For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంటర్నేషనల్ బీర్ డే : బీర్ గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు

ఇంటర్నేషనల్ బీర్ డే : బీర్ గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు

|

ప్రతి ఏడాది ఆగస్టు 3 వ తేదీన ఇంటర్నేషనల్ బీర్ డే ను సెలెబ్రేట్ చేసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా పబ్స్ లో అలాగే బీరు తయారీ కేంద్రాలలో ఈ సెలెబ్రేషన్స్ జరుగుతాయి. ఈ రోజు బీర్ ప్రేమికులందరూ విపరీతంగా పండుగ చేసుకుంటారు.


బీర్ లోని న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయా?

బీర్ అనేది మాల్ట్ సెరల్స్, హాప్స్, ఈస్ట్ మరియు వాటర్ వంటి సహజసిద్ధమైన పదార్థాలతో తయారవుతుంది. ఇందులో విటమిన్స్, మినరల్స్, పోలీఫెనాల్స్ మరియు ఫైబర్ వంటి పోషక విలువలు లభిస్తాయి. అలాగే థయామిన్, నియాసిన్, రైబో ఫ్లేవిన్, పాంటోతేనిక్ యాసిడ్, పైరీడోక్సిన్ మరియు కొబలమిన్ వంటి విటమిన్స్ లభిస్తాయి. అలాగే, కేల్షియం, కాపర్, ఐరన్, పొటాషియం, సిలికాన్, సోడియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సెలీనియం మరియు జింక్ వంటి మినరల్స్ లభిస్తాయి.

Everything You Need To Know About Beer

బీర్ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు

ఇంటర్నేషనల్ బీర్ డే ను మొదటగా ఆగస్టు 2008లో సెలెబ్రేట్ చేశారు.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 సిటీలలో ఈ సెలెబ్రేషన్స్ జరుగుతాయి.


బీర్ తో పాటు మీరు తీసుకునేదేదైనా అద్భుతమైన టేస్ట్ కలిగి ఉంటుంది.

బీర్ లోని రకాలు:

బీర్ లోని రకాలు:

ఫెర్మెంటేషన్ కి వాడే ఈస్ట్ లోని రకాలను బట్టి బీర్ టేస్ట్ వివిధ రకాలుగా ఉంటుంది. అందువలన, బీర్ టేస్ట్ డిఫెరెంట్ గా ఉంటుంది.

ఇప్పుడు బీర్ లోని వెరైటీస్ గురించి తెలుసుకుందాం

ఇప్పుడు బీర్ లోని వెరైటీస్ గురించి తెలుసుకుందాం

1. లాగర్ బీర్ అనేది బాటమ్ ఫెర్మెంటింగ్ ఈస్ట్ లో తయారుచేస్తారు. ఇందులో ఆల్కహాల్ తక్కువగా ఉంటుంది. ఈ బీర్ టేస్ట్ లైట్ గా ఉంటుంది అలాగే మల్టీగా ఉంటుంది.

2. ఇండియా పేల్ ఎల్స్ (IPA) అనేది టేస్ట్ లో కొంచెం చేదుగా ఉంటుంది. అలాగే ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది సిట్రస్ ఫ్లేవర్ తో ఘాటుగా అలాగే చేదుగా ఉంటుంది.

3. పిల్సనర్ అనేది న్యూట్రల్ మరియు హార్డ్ వాటర్ తో తయారుచేయబడినది. ఇది గోల్డెన్ కలర్ లో డ్రైగా, క్రిస్పీగా అలాగే చేదు ఫ్లేవర్ లో ఉంటుంది.

4. స్టౌట్ బీర్స్ డార్క్ గా రోస్టెడ్ మాల్ట్ తో క్రాఫ్ట్ చేయబడి ఉంటాయి.

5. పోర్టార్ బీర్స్ అనేవి డార్క్ కలర్ లో ఉంటాయి. ఇందులో వాడే చాకొలేట్ అలాగే డార్క్ రోస్టెడ్ మాల్ట్స్ వలన బీర్ ఈ కలర్ లోకి మారుతుంది.

6. బెల్జియన్ స్టయిల్ బేర్స్ అనేవి స్వీట్, ఫ్రూటీ అలాగే స్పైసీ ఫ్లేవర్స్ లో ఉంటాయి. వీటిలో ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. చేదు తక్కువగా ఉంటుంది.

7. వీట్ బేర్స్ అనేవి వీట్ తో తయారవుతాయి. అందువలన, ఈ బెవెరేజ్ లైట్ కలర్ లో ఉంటుంది. ఆల్కహాల్ కంటెంట్ అవేరేజ్ గా ఉంటుంది. దీన్ని సమ్మర్ లో ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు.

8. చెర్రీ, రాస్ప్ బెర్రీ లేదా పీచ్ తో సోర్ బీర్ ను తయారుచేస్తారు. ఫ్లేవర్ అనేది స్వీట్ గా అలాగే సోర్ గా ఉంటుంది.

ఆల్కహాలిక్ అలాగే నాన్ ఆల్కహాలిక్ బీర్ మధ్య ఉన్న బేధం:

ఆల్కహాలిక్ అలాగే నాన్ ఆల్కహాలిక్ బీర్ మధ్య ఉన్న బేధం:

ఆల్కహాలిక్ బీర్ లో ఆల్కహాల్ కంటెంట్ కొద్ది మొత్తంలో ఉంటుంది. నాన్ ఆల్కహాలిక్ బీర్ లో ఆల్కహాల్ తక్కువగా ఉంటుంది. అంటే దాదాపు 0.05 శాతం ఉంటుంది.

నాన్ ఆల్కహాలిక్ బీర్ అనేది ఆల్కహాలిక్ బీర్ రుచితో పోలి ఉంటుంది. అయితే, తయారీ విధానం మాత్రం వేరుగా ఉంటుంది.

బీర్ వలన ఆరోగ్యంపై పడే ప్రభావం గురించి ఇప్పుడు తెలుసుకుందాం:

బీర్ వలన ఆరోగ్యంపై పడే ప్రభావం గురించి ఇప్పుడు తెలుసుకుందాం:

బీర్ లో ఆల్కహాల్ ఉంటుంది. కాబట్టి, బీర్ ను తగిన మోతాదులో తీసుకుంటే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఆల్కహాలిక్ బెవెరేజెస్ అన్నిటిలో కన్నా, బీర్ అనే బెవెరేజ్ లో ఆల్కహాల్ శాతం అత్యంత తక్కువగా ఉంటుంది. అంటే దాదాపు నాలుగు నుంచి ఐదు శాతం లోపే ఉంటుంది. ఒక అధ్యయనంలో బీర్ ను మోతాదుగా తీసుకోవడమంటే 7 పింట్స్ గా తీసుకోవడమని తెలుస్తోంది.

బీర్ ను మోతాదుకంటే ఎక్కువగా తీసుకుంటే గుండె వ్యాధుల బారిన ప్రమాదం ఎక్కువవుతుంది. హార్ట్ ఫెయిల్యూర్, కార్డియాక్ అరెస్ట్ మరియు స్ట్రోక్ వంటి సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని వివిధ పరిశోధనలు తెలుపుతున్నాయి. కానీ, తగిన మోతాదులో తీసుకోవడం వలన గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాలు తెలుపుతున్నాయి.

బీర్ మరియు కార్డియో వాస్క్యులార్ వ్యాధులు

బీర్ మరియు కార్డియో వాస్క్యులార్ వ్యాధులు

బీర్ అనేది గుండె ఆరోగ్యానికి అలాగే బ్లడ్ వేసిల్స్ కి మంచిది. ప్రతి రోజూ 15-30 గ్రాముల ఆల్కహాల్ ను రోజూ తీసుకుంటే కార్డియో వాస్క్యులార్ డిసీస్ ల బారిన పడే ప్రమాదం 25 శాతం తగ్గుతుందని సైంటిఫిక్ ఎవిడెన్స్ తెలుపుతోంది. వెబ్ ఎండి ప్రకారం కాంబ్రిడ్జ్ యూనివర్సిటీ మరియు లండన్ యూనివర్సిటీ కాలేజ్ ప్రకారం ఆల్కహాల్ ను తీసుకోవడానికి అలాగే గుండె వ్యాధుల బారిన పడే ప్రమాదానికి సంబంధం ఉందని తెలుస్తోంది.

మోతాదుకు మించకుండా తీసుకునే వారిలో హార్ట్ ఎటాక్ కి గురయ్యే ప్రమాదం దాదాపు 32 శాతం తగ్గుతున్నట్టు తెలుస్తోంది. అలాగే సడెన్ కార్డియాక్ ప్రమాదం 56 శాతం తగ్గినట్టు, ఇస్కెమిక్ స్ట్రోక్ 12 శాతం తగ్గినట్టు మరియు హార్ట్ ఫెయిల్యూర్ 24 శాతం తగ్గినట్టు తెలుస్తోంది.

బీర్ ను తీసుకోవడానికి అలాగే శరీరంలోని హెచ్ డీ ఎల్ కొలెస్ట్రాల్ (మంచి కొలెస్ట్రాల్), ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగవడం మరియు బ్లడ్ క్లాటింగ్ తగ్గడానికి సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది.

బీర్ మరియు వెయిట్ మేనేజ్మెంట్

బీర్ మరియు వెయిట్ మేనేజ్మెంట్

ఆల్కహాల్ బెవెరేజెస్ ను తీసుకోవడం వలన వెయిట్ గెయిన్ సమస్య తలెత్తవచ్చని, ముఖ్యంగా బీర్ వలన ఈ సమస్య మరింత ఎక్కువగా తలెత్తుతుందని, పొట్ట పెరుగుతుందన్న భావన ఉంది. అయితే, ఈ విషయంపై సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. బీర్ లో ఆల్కహాల్ నుంచే రెండు వంతుల కేలరీస్ అలాగే కార్బోహైడ్రేట్స్ నుంచి ఒక మూడో వంతు కేలరీస్ అందుతాయి.

బీర్ మరియు డయాబెటిస్

బీర్ మరియు డయాబెటిస్

బీర్ ను తగిన మోతాదులో తీసుకుంటే అంటే రోజుకు 24 గ్రాములు తీసుకుంటే టైప్ 2 డయాబెటిస్ సమస్య బారిన పడే ప్రమాదం దాదాపు 30 శాతం తగ్గుతుంది. ఇది అదిపోనెక్టిన్ లెవెల్స్ ను అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీను పెంపొందిస్తుంది.

బీర్ మరియు బోన్ హెల్త్

బీర్ మరియు బోన్ హెల్త్

తక్కువ నుంచి మోడరేట్ స్థాయిలో బీర్ ను తీసుకుంటే ఆస్టియోపొరోసిస్ బారిన ప్రభావం తగ్గవచ్చు. బోన్ మినరల్ డెన్సిటీ పెరుగుతుంది. ఇందులో లభించే సిలికాన్ అనే మినరల్ ఇందుకు తోడ్పడుతుంది. బీర్స్ లో మాల్టెడ్ బార్లీతో పాటు హాప్స్ అధికంగా లభిస్తాయి.

ఇవండీ బీర్ వలన కలిగే ప్రయోజనాలు అలాగే నష్టాలు.

English summary

Everything You Need To Know About Beer

Beer is made from natural ingredients such as malt cereals, hops, yeast and water. Due to these ingredients, beer contains vitamins, minerals, polyphenols and fibre. Vitamins like thiamine, niacin, riboflavin, pantothenic acid, folate, pyridoxine, and cobalamin are present in beer. The minerals in beer include calcium, copper, iron, potassium, manganese, silicon, sodium, phosphorous, magnesium, selenium and zinc.
Story first published:Saturday, August 4, 2018, 15:47 [IST]
Desktop Bottom Promotion