For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బక్వీట్ తేనె వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి ? ఎలా వినియోగించాలి ?

|

బక్వీట్ తేనె గురించి ఎప్పుడైనా విన్నారా? బక్వీట్ పూల నుండి తేనెటీగలు, సేకరించి తేనెపట్టులో నిల్వ ఉంచిన తేనెను బక్వీట్ తేనె అని అంటారు. కొందరు ఈ మొక్కలు గోధుమ జాతికి చెందినవేమో అని అపోహ పడుతుంటారు. దీనికి కారణం ఇందులో వీట్ అనే పేరు ఉండడమే. కానీ గోదుమకు సంబంధమే లేని మొక్క ఇది. ఈ మొక్క రుభార్బ్ మరియు సోరెల్ జాతికి చెందినది. గ్లూటేన్ ఫ్రీ ఆహార పదార్ధంగా మంచి పోషకాలను కలిగి ఉంటుంది. మార్కెట్లో అరుదుగా లభించినా, ఇష్టపడేవారు ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా తెప్పించుకునే వెసులుబాటు కూడా ఉంది.

ఈ బక్వీట్ తేనె అత్యధిక పోషక విలువలను కలిగి ఉండడంతో పాటు, దృఢమైన రుచి సువాసనలను కలిగి ఉంటుంది. సహజంగా రాగితో కలిసి ఉన్న పసుపు రంగులో లేదా ఊదా లేదా ఇంచుమించు నలుపు రంగును పోలి ఉంటుంది. ఎక్కువగా ముదురు రంగులలోనే ఈ తేనె ఉంటుంది.

Health Benefits Of Buckwheat Honey And How To Use It

బక్వీట్ తేనె, మొలాసిస్ వలె అత్యధిక తీయదనాన్ని మరియు రుచిని కలిగి ఉండదు. కానీ పోషక విలువల నేపధ్యం దృష్ట్యా, మిగిలిన అన్ని రకాల తేనెలతో సారూప్యాన్ని కలిగి ఉంటుంది. తద్వారా అత్యధిక సంఖ్యలో సూక్ష్మ పోషక పదార్ధాలు, మూలకాలు, రోగ నిరోధక తత్వాలు అధికంగా ఉన్న మంచి పోషక పదార్ధంగా ఈ బక్వీట్ తేనె చెప్పబడుతున్నది.

ఈ బక్వీట్ తేనెలో అత్యధిక మోతాదులో ఫ్రక్టోజ్ నిల్వలు ఉండడమే కాకుండా, మామూలు తేనెతో పోల్చినప్పుడు గ్లూకోస్ స్థాయిలు కూడా అధికంగా ఉండడం దీని ప్రత్యేకత. ఒక జార్ బక్వీట్ తేనెలో 30 శాతం గ్లూకోస్, 40 శాతం ఫ్రక్టోజ్ ఉంటాయి. తద్వారా శరీరంలో గ్లూకోజ్ నిల్వలను క్రమబద్దీకరిస్తూ, కాలేయానికి మద్దతుగా ఉంటుంది.

బక్వీట్ తేనెలో ఉండే ఆరోగ్యకర ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1.రోగ నిరోధక లక్షణాలు అధికం :

1.రోగ నిరోధక లక్షణాలు అధికం :

ఈ బక్వీట్ తేనెలో అత్యధిక మోతాదులో రోగ నిరోధక తత్వాలు ఉంటాయి. క్రమంగా ఈ రసాయనాలు, శరీరంలో ప్రతికూల ప్రభావాలను కలుగజేసే బాక్టీరియాతో పోరాడి నాశనం చేసే ప్రయత్నం చేస్తుంది. కార్నెల్ యూనివర్సిటీ నివేదికల ప్రకారం రోగ నిరోధక తత్వాలు అదనంగా ఉన్న ఈ బక్వీట్ తేనె కార్డియోవస్క్యులర్ సంబంధించిన సమస్యలు రాకుండా చూడగలదు. దీనికి కారణం ఈ బక్వీట్ తేనెలో ఉన్న ఆరోగ్యకర క్రొవ్వులు మరియు చెడు క్రొవ్వులను తగ్గించే తత్వాలు. ఒకవేళ తేనెను ఎంచుకోవలసి వస్తే ఈ బక్వీట్ తేనె సూచించడమైనది.

2. విటమిన్లు, మినరల్స్ :

2. విటమిన్లు, మినరల్స్ :

బక్వీట్ తేనెలో పుష్కలంగా విటమిన్లు, మినరల్స్ కేంద్రీకృతమై ఉంటాయి. మేరీ లాండ్ మెడికల్ సెంటర్ నివేదికల ప్రకారం బక్వీట్ తేనెలో ఉండే మినరల్స్ లో అత్యధిక మోతాదులో పొటాషియం నిల్వలు ఉన్న కారణంగా, నాడీ మండల వ్యవస్థకు మరియు గుండె పనితీరుకు తోడ్పాటును ఇవ్వగలదు. మరియు ఈ బక్వీట్ తేనెలో ఉన్న బీటైన్, కాలేయం పనితీరుకు దహదం చేయడంతో పాటు, గుండె సంబంధ సమస్యలు రాకుండా కూడా చూడగలదు. ఈ బక్వీట్ తేనెను అనేక రకాల ఆరోగ్యకర ఆహార పదార్ధాలలో జోడించి తీసుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందగలరు. అనగా పండ్లు, పెరుగు, తృణ ధాన్యాలతో తీసుకోవడం ద్వారా బక్వీట్ తేనెను ఆహార ప్రణాళికలో భాగంగా చేర్చుకోనవచ్చు.

3.కాలరీలు అధికంగా:

3.కాలరీలు అధికంగా:

అమెరికా వ్యవసాయిక మరియు పోషక పర్యవేక్షణా శాఖ వారి నివేదిక ప్రకారం, ఒక టేబుల్ స్పూన్ బక్వీట్ తేనెలో అత్యధికంగా 64 కాలరీలు నిక్షిప్తమై ఉంటాయి. తద్వారా శరీరానికి అవసరమైన శక్తిని అందివ్వడంలో ఎంతో సహాయం చేస్తుంది. ముఖ్యంగా నీరసంగా ఉన్న యెడల, ఒక స్పూన్ తేనెను నేరుగా తీసుకోవడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.

4.గాయాలను తుదముట్టించడంలో :

4.గాయాలను తుదముట్టించడంలో :

బక్వీట్ తేనెలో తేమను హరించే శక్తి మూలకాలు , చక్కర నిల్వలు అధికంగా ఉండి, హైడ్రోజన్ పొటెన్షియల్ స్థాయి తక్కువగా ఉన్న కారణంగా బాక్టీరియాను త్వరగా తొలగించుటలో కీలక పాత్రను పోషించగలదు. తద్వారా సూక్ష్మజీవులను గాయం చుట్టూతా పెరగకుండా చేసి, గాయాలను నివారించుటలో బక్వీట్ తేనె అద్భుతంగా పనిచేయగలదు. చికిత్సలో భాగంగా గాయాలకు నేరుగా పూసి, కట్టుకడుతారు.

5.దగ్గును తగ్గించడంలో :

5.దగ్గును తగ్గించడంలో :

మీకు తెలుసా ఈ బక్వీట్ తేనె దగ్గును హరించగలదని? ముఖ్యంగా రాత్రివేళల్లో పసిపిల్లల్లో సహజంగా కనిపించే శ్వాసకోశ సంబంధ సమస్యలైన జలుబు, దగ్గులకు సత్వర నివారణా చర్యలలో భాగంగా ఈ బక్వీట్ తేనెను వినియోగించడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. అనేక అధ్యయనాల ప్రకారం, ఈ బక్వీట్ తేనె దగ్గు మందులకన్నా అద్భుతంగా పనిచేయగలదని తెలుస్తుంది.

అసలు ఈ బక్వీట్ తేనెను ఎలా వినియోగించాలి:

అసలు ఈ బక్వీట్ తేనెను ఎలా వినియోగించాలి:

ఈ బక్వీట్ తేనెను వినియోగించే మార్గాల గురించి క్రింది వివరణలో తెలుపడమైనది.

గాయాల చికిత్సలో భాగంగా, ఈ బక్వీట్ తేనెను గాయాలకు నేరుగా రాసి బాన్డేజ్ తో కట్టుకడుతారు.

బక్వీట్ తేనెను నేరుగా స్పూన్ తో కాని, లేదా ఏదేని ఇతర ఆహార పదార్ధాలలో అనగా ఓట్స్, కేక్స్, స్మూతీలలో జోడించి తీసుకోవచ్చు.

ప్రకృతి సిద్దమైన చక్కెరలను కలిగి ఉన్న ఈ బక్వీట్ తేనె, డిజర్ట్స్, కాఫీ, టీ, గ్రీన్ టీ, లేదా ఇతర పానీయాలలో కలిపి తీసుకోవడం ద్వారా రుచితో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

దగ్గు నివారణకై, ఏదేని హెర్బల్ టీ లో కలిపి తీసుకోవడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.

ఇలా ప్రతిరోజూ బక్వీట్ తేనెను తీసుకోవడం ద్వారా, రక్తంలో రోగ నిరోధక స్థాయిలు పెరగడంతో పాటు, గ్లూకోజ్ నిల్వలను క్రమబద్దీకరించవచ్చు కూడా. మరియు శరీరంలోని చెడు క్రొవ్వులను పారద్రోలడంలో ఈ బక్వీట్ తేనె ఎంతగానో సహకరిస్తుంది. ముఖ్యంగా ముదురు రంగులో ఉండే ఈ బక్వీట్ తేనెలో అత్యధిక శాతం ఫినోలిక్ సమ్మేళనాలు కూడా ఉంటాయి.

Read more about: nutrition honey wellness health
English summary

Health Benefits Of Buckwheat Honey And How To Use It

Health Benefits Of Buckwheat Honey And How To Use It,Do you know what is buckwheat honey? Read this article to know about the health benefits of buckwheat honey and how you should use it.
Desktop Bottom Promotion