For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నానబెట్టిన మరియు మొలకెత్తిన ధాన్యాల వలన కలిగే ఆరోగ్యప్రయోజనాలివే

నానబెట్టిన మరియు మొలకెత్తిన ధాన్యాల వలన కలిగే ఆరోగ్యప్రయోజనాలివే

|

తృణధాన్యాలను తీసుకోవడం అన్ని విధాలా ఆరోగ్యకరం. ఈ ధాన్యాలలో ఫైటిక్ యాసిడ్ అనే యాంటీ న్యూట్రియెంట్ ఎలిమెంట్ లభిస్తుంది. ఇక్కడ, నానబెట్టిన, మొలకెత్తిన మరియు పుల్లటి ధాన్యాల వలన కలిగే లాభాల గురించి వివరిస్తున్నాము.

ఫైటిక్ యాసిడ్ అనేది న్యూట్రియెంట్స్ ను ధాన్యాలలో భద్రపరచి మీ శరీరం పోషకాలను పుష్కలంగా అందుకునేందుకు తోడ్పడుతుంది. కాబట్టి, ధాన్యాలలోని పోషకాలను గ్రహించేందుకు ధాన్యాలను నానబెట్టి, పులియబెట్టి మరియు మొలకెత్తనివ్వడం అత్యవసరం.

Health Benefits Of Eating Soaked, Sprouted And Sour Grains

నానబెత్తిన, మొలకెత్తిన మరియు పుల్లటి ధాన్యాల మధ్యనున్న తేడాలు

ధాన్యాలను నానబెట్టడమంటే ధాన్యాలను పెరుగు లేదా ఆపిల్ సిడర్ వినేగార్ లో కలిపి వెచ్చటి ప్రాంతంలో పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటలవరకు ఉండనివ్వాలి. ఈ సమయంలో, ధాన్యాలలో ఉండే యాసిడ్ అనేది యాంటీ న్యూట్రియెంట్స్ ను విఛ్చిన్నం చేసి పోషకాలను శరీరం గ్రహించే విధంగా తయారుచేస్తుంది.

పుల్లటి ధాన్యాలు

పులియబెట్టడమంటే ధాన్యాలను ఫెర్మెంట్ చేయడం. సోర్ డౌ బ్రేడ్ రూపంలో ఈ విధానాన్ని పాటించడం జరుగుతుంది. పిండిని నీళ్ళల్లో కలిపి రూమ్ టెంపరేచర్ లో కొద్ది సేపటి వరకు వదిలేయాలి. కొంత సమయం గడిచాక, ఫెర్మెంట్ అయి బ్రెడ్ అనేది ఉబ్బుతుంది.

1. ఎంజైమ్ నిరోధకాలను న్యూట్రలైజ్ చేస్తుంది:

1. ఎంజైమ్ నిరోధకాలను న్యూట్రలైజ్ చేస్తుంది:

తృణధాన్యాల వెలుపలి ప్రొటెక్టివ్ లేయర్ లో ఎంజైమ్ నిరోధకాలు ఉంటాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ ధాన్యాలను పచ్చిగా తీసుకుంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ మరియు మెటబాలిక్ ఎంజైమ్స్ యాక్టివిటీ నియంత్రించబడుతుందని వారు వెల్లడిస్తున్నారు.

2. ఫైటిక్ యాసిడ్ తగ్గుతుంది

2. ఫైటిక్ యాసిడ్ తగ్గుతుంది

ధాన్యాల వెలుపలి లేయర్ లో ఫైటిక్ యాసిడ్ లభిస్తుంది. ఇది కేల్షియం, మెగ్నీషియం వంటి ఇతర మినరల్స్ ను గ్రహించకుండా అడ్డుకుంటుంది. అందువలన, వండడానికి ముందు ధాన్యాలను నానబెట్టడం ద్వారా ఫైటిక్ యాసిడ్ ను విఛ్చిన్నం చేసే బాక్టీరియాతో పాటు మరికొన్ని ముఖ్యమైన ఎంజైమ్స్ అనేవి విడుదలవుతాయి.

3. విటమిన్స్ ను పెంపొందిస్తుంది:

3. విటమిన్స్ ను పెంపొందిస్తుంది:

ధాన్యాలను నానబెట్టడం వలన విటమిన్స్ అనేవి నీళ్ళల్లోకి చేరతాయి. వంట చేసేటప్పుడు ఈ నీళ్లను వాడటం వలన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

4. ఆరోగ్యంగా ఉంచుతుంది

4. ఆరోగ్యంగా ఉంచుతుంది

రాత్రంతా ధాన్యాలను నానబెట్టడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మీ శరీరం దృఢంగా మారుతుంది. అనేక వ్యాధులతో పోరాడే సామర్థ్యం పెరుగుతుంది. ఫైటిక్ యాసిడ్ మోతాదు తగ్గడం వలన ఇవన్నీ సాధ్యపడతాయి.

5. జీర్ణక్రియ మెరుగవుతుంది:

5. జీర్ణక్రియ మెరుగవుతుంది:

రాత్రంతా తృణధాన్యాలను నానబెట్టడం ద్వారా ఎంజైమ్ నిరోధకాల పనితీరు దెబ్బతింటుంది. కాబట్టి, జీర్ణక్రియపై దుష్ప్రభావం తగ్గుతుంది. జీర్ణక్రియ పనితీరు సజావుగా ఉంటుంది.

మొలకెత్తిన ధాన్యాల వలన కలిగే ఆరోగ్యప్రయోజనాలు

మొలకెత్తిన ధాన్యాల వలన కలిగే ఆరోగ్యప్రయోజనాలు

1. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది:

కాపర్ మరియు ఐరన్ మోతాదు తగినంతగా ఉండే విధంగా రెడ్ బ్లడ్ సెల్ కౌంట్ ను మెయింటెయిన్ చేస్తూ బ్లడ్ సర్క్యూలేషన్ ను మెరుగుపరిచేందుకు మొలకెత్తిన ధాన్యాలు తోడ్పడతాయి. దీని వలన వివిధ భాగాలకు ఆక్సిజన్ లభిస్తుంది. వాటి పనితీరు మెరుగుపడుతుంది. ధాన్యాల వలన హెయిర్ గ్రోత్ మెరుగవుతుంది. కొత్త బ్లడ్ వెజిల్స్ జెనెరేట్ అవుతాయి.

2. బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది:

2. బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది:

మొలకెత్తిన ధాన్యాలను తీసుకోవడం వలన బరువు తగ్గుట జరుగుతుంది. మొలకెత్తిన ధాన్యాలలో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కేలరీలు అస్సలు లభించవు. అందువలన, అధిక బరువు సమస్య వేధించదు. అంతేకాక, మొలకెత్తిన ధాన్యాలలో ఫైబర్ లభిస్తుంది. ఇది మీకు ఎక్కువ సేపు కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. మెదడును ఎక్కువగా తినమని ప్రేరేపించే ఆకలి హార్మోన్ గ్రెలిన్ ఉత్పత్తిని ఇది నిరోధిస్తుంది.

3. కంటిచూపును మెరుగుపరుస్తుంది:

3. కంటిచూపును మెరుగుపరుస్తుంది:

మొలకెత్తిన ధాన్యాలలో విటమిన్ ఏ సమృద్ధిగా లభిస్తుంది. ఇది కంటిచూపును మెరుగుపరిచేందుకు తోడ్పడుతుంది. అలాగే, వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. ఫ్రీ రాడికల్స్ నుంచి కళ్ళను సంరక్షిస్తాయి.

4. ఎసిడిటీను తగ్గిస్తుంది:

4. ఎసిడిటీను తగ్గిస్తుంది:

మొలకెత్తిన ధాన్యాలు శరీరంలోని యాసిడ్స్ ను తగ్గించి పీహెచ్ లెవల్ ను నియంత్రించి మెయింటెయిన్ చేస్తాయి. సలాడ్స్ లో మొలకెత్తిన గింజలను భాగం చేసుకోవడం లేదా భోజనం తరువాత ఎసిడిటీను నిరోధించేందుకు కాసిన్ని మొలకెత్తిన ధాన్యాలను తీసుకోవడం వలన ప్రయోజనం ఉంటుంది.

5. గుండె ఆరోగ్యానికి మంచిది:

5. గుండె ఆరోగ్యానికి మంచిది:

మొలకెత్తిన ధాన్యాలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. ఇవి శరీరంలోని గుడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను పెంపొందించి చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లో యాంటీ ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీస్ కలవు. ఇవి గుండెపై పడే అధిక ఒత్తిడిని తగ్గించేందుకు తోడ్పడతాయి. తద్వారా, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

6. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది:

6. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది:

మొలకెత్తిన ధాన్యాలలో విటమిన్ సి అధిక మోతాదులో లభ్యమవుతుంది. ఇది వైట్ బ్లడ్ సెల్స్ కు శక్తివంతమైన ఉత్తేజక పదార్థంగా తోడ్పడుతుంది. తద్వారా, వ్యాధులపై అలాగే ఇన్సక్షన్స్ పై పోరాడే శక్తిని శరీరానికి అందిస్తుంది. మొలకెత్తిన గింజలలో ఉండే విటమిన్ ఏ అనేది యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ తో నిండి ఉంటుంది. తద్వారా, రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.

7. ప్రీమెచ్యూర్ ఏజింగ్ ను అరికడుతుంది:

7. ప్రీమెచ్యూర్ ఏజింగ్ ను అరికడుతుంది:

మొలకెత్తిన గింజలలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ఇది ప్రీమెచ్యూర్ ఏజింగ్ ను అరికట్టేందుకు తోడ్పడుతుంది. అలాగే, ఏజింగ్ వలన డీఎన్ఏను నశింపచేసే ప్రక్రియను అరికడుతుంది. అంతేకాక, మొలకెత్తిన గింజలలో కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ తో పోరాడే సామర్థ్యం కలదు. అందువలన, ప్రీమెచ్యూర్ ఏజింగ్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

మొలకెత్తిన ధాన్యాలను తీసుకునేందుకు ఉత్తమ మార్గాలు

మొలకెత్తిన ధాన్యాలను తీసుకునేందుకు ఉత్తమ మార్గాలు

బక్ వీట్, మూంగ్ బీన్స్, బ్లాక్ బీన్స్, లెంటిల్స్, బార్లీ, క్వినోవా, చిక్ పీస్, సొయా బీన్స్ మరియు మిలెట్ ను మొలకెత్తించవచ్చు.

ఈ విధానాలను గమనించండి:

ధాన్యాలను ఒక నిమిషం పాటు బాగా కడిగి వాటిని నీళ్లు నిండిన ఒక పాత్రలోకి బాగా తీసుకోండి.

ఈ నీళ్లు అనేవి ధాన్యాల స్థాయి కంటే కొంచెం ఎక్కువగా ఉండాలి. నానే కొద్దీ ధాన్యాలు నీళ్లను పీల్చుకుంటాయి.

తేలే ధాన్యాలను లేదా ఏదైనా చెత్తను తొలగించండి.

ఒక ఛీజ్ క్లాత్ తో ఈ పాత్రను కప్పి ఉంచి రూమ్ టెంపరేచర్ లో మూడు నుంచి పన్నెండు గంటల పాటు అలాగే ఉండనివ్వాలి.

ఛీజ్ క్లాత్ ను ఉపయోగించి నీళ్లను వడగట్టండి. మొలకెత్తిన గింజలను స్వచ్ఛమైన నీటితో శుభ్రపరచండి.

ధాన్యాలు మొలకెత్తే వరకు ఈ పద్దతిని రోజుకు రెండు సార్లు పాటిస్తే ధాన్యాలు మొలకెత్తుతాయి.

English summary

Health Benefits Of Eating Soaked, Sprouted And Sour Grains

Studies have suggested that phytic acid locks away nutrients in the grain and keeps you from being able to absorb the nutrients fully. So, that's why preparing the grains include soaking, souring, and sprouting is essential. The health benefits include keeping one heart-healthy, helping in weight loss, etc.
Story first published:Tuesday, July 3, 2018, 11:57 [IST]
Desktop Bottom Promotion