For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాత్రిళ్లు భుజించేందుకు 8 ఉత్తమ ఆహార పదార్థాలు మీకోసం...

రాత్రిళ్లు భుజించేందుకు 8 ఉత్తమ ఆహార పదార్థాలు మీకోసం...

By M Krishna Adithya
|

ఎవరైనా మిమ్మల్ని ఈ రాత్రి డిన్నర్ ఏం ప్రిపేర్ చేసుకున్నారు అనగానే, చాలా మంది " ఆ ఏం లేదు.. కొద్దిగా మాత్రమే" అనడం సహజంగా వినిపించేదే. మీరే కాదు చాలా మంది రాత్రిళ్లు తమ డిన్నర్ విషయంలో చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. డిన్నర్ కి ఏం తినాలి విషయంలో తర్జన భర్జన పడుతుంటారు. అందుకే ఈ ఆర్టికల్ ద్వారా రాత్రిళ్లు ఏం తినాలి అనే దానిపై సూచనలు చేశాం.

రాత్రిళ్లు ఏం తినాలి అనేది చాలా మందికి అర్థం కాదు. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారం రాత్రిళ్లు భుజించాలి. ఉప్పు, చక్కెర పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా మీ నిద్రకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది.

Here Are The 8 Best Foods To Eat At Night

రాత్రిళ్లు మీ కండరాలు, ఇతర టిష్యూలు రిపేర్ చేసుకునే మోడ్‌లోకి జారుకుంటాయి. అలాగే శరీరం కూడా పలు క్రియలను నిద్రలో జరుపుకునేందుకు ఆసక్తి చూపుతుంది. నిద్ర సరిగ్గా పట్టేందుకు ముఖ్యంగా కొన్ని రకాల విటమిన్లు ఆహారంలో పుష్కలంగా ఉండేలా జాగ్రత్తపడాలి. ముఖ్యంగా విటమిన్ బి6, ట్రైటోఫాన్, అలాగే కొన్ని ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు ఆహారంలో ఉండేలా జాగ్రత్త పడాలి.

1. ఆకు కూరలు భుజిస్తే మేలు

1. ఆకు కూరలు భుజిస్తే మేలు

రాత్రిళ్లు చక్కగా నిద్రపట్టేందుకు మెటటోనిన్ హార్మోన్ చక్కగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం శరీరం కాల్షియం, ట్రైటోఫాన్‌లను ఉపయోగించి మెలటోనిన్‌ను తయారు చేస్తుంది. అందుకు కోసం కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఇందుకోసం ఆహారంలో పాల ఉత్పత్తులు ఉండేలా జాగ్రత్త పడాలి. అలాగే ఆకుపచ్చటి కూరలను ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. పాలకూర, అరటి పళ్లు, ఆవాలు వంటివి రాత్రిళ్లు తినేందుకు చాలా ఉపయోగపడతాయి.

2. ఓట్ మీల్ తింటే మేలు..

2. ఓట్ మీల్ తింటే మేలు..

ఓట్ మీల్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నారు. ముఖ్యంగా చిరు ధాన్యాల తరగతికి చెందిన ఓట్ మీల్‌ను సాధారణంగా ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటారు. ఓట్స్‌లో పెద్ద మొత్తంలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి జీర్ణం అయ్యేందుకు అధిక సమయం పడుతుంది. తద్వారా అర్థరాత్రి వరకూ ఆకలి వేసే చాన్సేలేదు. అలాగే ఓట్ మీల్ ద్వారా హాయిగా నిద్ర పడుతుందని పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి. దీంతో పాటు ఓట్ మీల్ లో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ కలిసి శరీరంలో సెరటోనిన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తాయి ఇది మెలటోనిన్ ఉత్పత్తికి దోహదం చేస్తుంది. ఓట్ మీల్ ను వెన్న లేని పెరుగుతోనూ, లేదా స్కిమ్డ్ పాలతోనూ కలిపి తీసుకుంటే మేలు.

3. చేపలు తీసుకుంటే మేలు

3. చేపలు తీసుకుంటే మేలు

8 ఔన్సుల చేప లేదా ఇతర సీ ఫుడ్ ఏదైనా ప్రతీ వారానికి ఒకసారి రాత్రిళ్లు తీసుకోవడం మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే చేపల్లో పెద్ద మొత్తంలో విటమిన్ బి6 లభిస్తుంది. దీని ద్వారా కూడా శరీరంలో మెలటోనిన్ ఉత్పత్తి అవుతుంది. కొన్ని చేపల్లో విటమిన్ బి6 అధికంగా ఉంటుంది. అందులో ప్రధానంగా సాలమన్ చేపలు, టునా, హలిబుట్ వంటి రకాలు ఉన్నాయి. ఒమెగా 3 ఫాటీ యాసిడ్స్ సైతం చేపల్లో అధికంగా ఉంటాయి.

4. అరటి పళ్లు తీసుకోండి..

4. అరటి పళ్లు తీసుకోండి..

అరటి పళ్లను తినడం వల్ల శరీరానికి అవసరమైన సహజ పొటాషియం, మెగ్నిషియం లభిస్తాయి. రాత్రిళ్లు నిద్రపోయే ముందు అరటి పండు తీసుకోవడం వల్ల నిద్రలో శరీరం రిలాక్స్ అయ్యేందుకు దోహదపడుతుంది. ఒక అధ్యయనం ప్రకారం మెగ్నీషియం శరీరంలో సరిపడా ఉండటం వల్ల పెద్దవారిలో ఇన్సోమ్నియా వంటి నిద్రలేమి వ్యాధిని దూరం చేసుకునే వీలుంది. అలాగే అరటి పళ్ల నుంచి ట్రిప్టో‌ఫాన్ అనే సహజమైన హార్మోన్ వల్ల శరీరంలో నిద్రకు దోహదపడుతుంది, ఆందోళన దూరం అవుతుంది, శరీరంలో కొవ్వు కరిగేందుకు ఉపయోగపడుతుంది.

5. పౌల్ట్రీతో సుఖనిద్ర..

5. పౌల్ట్రీతో సుఖనిద్ర..

మీకు చికెన్ తినడం ఇష్టమా ? అయితే రాత్రిళ్లు డిన్నర్‌లో చికెన్ తీసుకోండి. ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ పెద్ద మొత్తంలో మాంసంలో లభిస్తుంది. దీని వల్ల సుఖ నిద్ర పడుతుంది. ఇటీవల ఒక అధ్యయనం ప్రకారం మూడు ఔన్సుల చికెన్‌ను భుజిస్తే నిద్రబాగా పడుతుందని తేల్చింది. అంతేకాదు బ్రౌన్ రైస్‌తో కలిపి తీసుకుంటే పుష్కలంగా కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి.

6. బాదంతో మంచినిద్ర

6. బాదంతో మంచినిద్ర

నిద్ర బాగా పట్టేందుకు అద్భుతమైన ఆహారం బాదం పప్పు, అవును నిజమే.. బాదం విరివిగా తీసుకోవడం వల్ల కండరాలకు మంచి రిలాక్సింగ్ లభిస్తుంది. అలాగే బాదంలో పోషకవిలువలైన మెగ్నీషియం, కాల్షియం పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా కండరాలను పటిష్ట పరిచేందుకు ఈ రెండు మినరల్స్ దోహదపడతాయి. కాల్షియం మొలటోనిన్ ఉత్పత్తికి ఎక్కువగా దోహదపడతాయి. ప్రధానంగా నానిన బాదం పప్పును తీసుకుంటే ఇంకా మంచిది.

7. చీజ్ చాలా మంచిది

7. చీజ్ చాలా మంచిది

చాలా మంది రాత్రిళ్లు పనిచేసే సమయంలో ఎక్కువగా బ్రెడ్ తీసుకుంటారు. అయితే కేవలం బ్రెడ్ తీసుకునే బదులు కాస్తంత చీజ్‌తో పాటు తీసుకుంటే మంచిది. చీజ్ తో తీసుకుంటే ఎక్కువగా ఆకలి వేయదు. చపాతి లేదా పుల్కాతో కూడా చీజ్ తీసుకుంటే నిద్ర సుఖంగా పడుతుంది.

8. చెర్రీ పళ్లను తినండి..

8. చెర్రీ పళ్లను తినండి..

ఇటీవలే యూరోపియన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషియన్ ప్రకారం ప్రతీ రోజు చెర్రీ జ్యూస్ తాగే వారిలో మంచి నిద్ర పడుతుందని తేల్చింది. ఎందుకుంటే చెర్రీ పళ్లలో సహజంగానే మెలటోనిన్ అధికంగా ఉందని అధ్యయనం తేల్చింది. మెలటోనిన్ వల్ల నిద్ర ఎక్కువగా పడుతుంది. అలాగే చెర్రీస్ వల్ల శరీరంలో యాంటిఆక్సిడెంట్స్ నియంత్రిస్తాయి. అలాగే వాపులను తగ్గిస్తాయి, ఆర్థరైటిస్ నొప్పులను తగ్గిస్తుంది, పొట్టలో కొవ్వు నియంత్రిస్తుంది, దీంతో పాటు గుండెపోటును నియంత్రిస్తుంది.

English summary

Here Are The 8 Best Foods To Eat At Night

Night is the time when your muscles and tissues start working and repairing themselves while the whole day the body goes through a turmoil. The natural foods should be chosen that offer sleep-inducing help with vitamin B6, tryptophan, and a combination of complex protein and carbohydrates. The best foods to eat at night are cherries, oatmeal, fishes, bananas, etc.
Story first published:Monday, September 3, 2018, 18:02 [IST]
Desktop Bottom Promotion