For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏబీసి డిటాక్స్ డ్రింక్ తయారు చేయడం ఎలా?

ఏబీసి డిటాక్స్ డ్రింక్ తయారు చేయడం ఎలా?

By Abbireddi Umamaheswari
|

డిటాక్సిఫికేషన్(నిర్విశీకరణ) అనేది ఆరోగ్య ఔత్సాహికుల్లో ఒక తాజా వ్యామోహం. రసములు అనేవి మీ శరీరానికి పోషకాలు అందించడం ద్వారా త్వరితముగా మీ శరీరంలోని విశాధాతువులను నిర్వీర్యం చేయుటకు గొప్ప మార్గం. ఉత్తమమైన డిటాక్స్ డ్రింక్ తో మీ రోజుని ప్రారంభించడం వలన అది మిమ్మల్ని రీఫ్రెష్ చేయడమే కాకుండా రోజంతా శక్తివంతంగా ఉంచుతుంది.

ఈ శక్తివర్ధకమైన జ్యూస్ ఆపిల్, బీట్రూట్ మరియు క్యారట్ రసముల మిశ్రమంతో రుపొందించబడుతుంది కనుక దీనిని ABC డిటాక్స్ డ్రింక్ అన్నారు.

How To Make ABC Detox Drink

ఈ ABC నిర్విషీకరణ పానీయం బహుళ లాభాలను కలిగి ఉంది మరియు మూడు ప్రధాన పదార్థాల వలన క్యాన్సర్-పోరాట పానీయంగా రక్షక తరంగాలు తయారవుతున్నాయి. ఈ పానీయంను ఊపిరితిత్తుల క్యాన్సర్ మరియు ఇతర వ్యాధులను చికిత్స చేయడానికి ఒక చైనీస్ మూలికా వైద్య నిపుణుడు పరిచయం చేసాడు.

 ఆపిల్ యొక్క ఆరోగ్య లాభాలు:

ఆపిల్ యొక్క ఆరోగ్య లాభాలు:

ఆపిల్ లో ఉన్న విటమిన్ A, విటమిన్ B1, విటమిన్ B2, విటమిన్ B6, విటమిన్ C మరియు విటమిన్ E, విటమిన్ K, ఫోలేట్, నియాసిన్, జింక్, రాగి, పొటాషియం, ఫాస్పరస్ మరియు మాంగనీస్ వంటి పోషకాలు చాలా గొప్పవి. మంచి జీర్ణ శక్తిని కలిగించే పీచుపదార్ధాలు ఆపిల్స్ లో ఉన్నాయి. అవి సరైన ప్రేగు కదలికలకు సహాయం చేయడంలో ఆరోగ్యానికి అత్యంత లాభదాయకమైనవి. విటమిన్ సి మరియు అనామ్లజనకాలు ఎక్కువగా ఉన్న యాపిల్స్ మీ రోగనిరోధక వ్యవస్థ, నాడీ వ్యవస్థను నిర్మించడానికి మరియు ప్రమాదకర స్వేచ్ఛా రాశులు నుండి కణాలను కాపాడడానికి సహాయపడతాయి.

బీట్రూట్ యొక్క ఆరోగ్య లాభాలు:

బీట్రూట్ యొక్క ఆరోగ్య లాభాలు:

బీట్రూట్లు మీ హృదయ ఆరోగ్యానికి ఎంతో మంచివి. విటమిన్ A, C, B- కాంప్లెక్స్, ఇనుము, పొటాషియం, మెగ్నీషియం మరియు రాగి వంటి పోషకాలు బీట్రూట్ లో సమృద్ధిగా ఉంటాయి. బీట్రూటు లైకోపీన్ మరియు అంతోసియనిన్లు లాంటి అనామ్లజనకాలు కలిగి ఉంటుంది. ఇవి ఈ బీట్రూట్లను ముదురు గులాబీ రంగులో ఉంచుతాయి. ఈ అనామ్లజనకాలు మీ రోగనిరోధక వ్యవస్థను బలపరచి చెడు కొవ్వులను తగ్గిస్తాయి. అలాగే ఎంతో సన్నిహితమైన ఈ బీట్రూట్లు వయస్సు మీరడానికి వ్యతిరేకంగా పనిచేసే రక్షక ఏజెంట్లను కలిగి ఉంటాయి. అలాగే ఇది మీ కాలేయాన్ని కాపాడడంలో సహాయపడే ఉద్వేగ వ్యతిరేఖ పదార్థం అయిన బెటాలైన్ ను అందిస్తుంది.

క్యారెట్ యొక్క ఆరోగ్య లాభాలు:

క్యారెట్ యొక్క ఆరోగ్య లాభాలు:

క్యారెట్లు విటమిన్ A, విటమిన్ B1, విటమిన్ B2, విటమిన్ B3, విటమిన్ B6, విటమిన్ K, విటమిన్ E మరియు విటమిన్ C వంటి విటమిన్లు మరియు మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్ మరియు సెలీనియం వంటి ఖనిజాలు సహా అనేక పోషకాలను కలిగి ఉంటాయి. క్యారేట్లలో బీటా-కెరోటిన్లు పుష్కలంగా ఉంటాయి. వాటిని శరీరం విటమిన్ A కు మార్పిడి చేసి కంటి పనితీరుకు మరియు రోగనిరోధక వ్యవస్థకు సహాయపడే విధంగా పనిచేస్తాయి. విటమిన్ A శరీరం నుండి విషధాతువులని తొలగించడంలో సహాయపడుతుంది. కాలేయం నుండి పిత్తాన్ని తగ్గిస్తుంది అలాగే మంచి కంటి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

అద్బుతమైన పానీయం యొక్క( ABC డిటాక్స్ డ్రింక్) యొక్క ఆరోగ్య లాభాలు:

అద్బుతమైన పానీయం యొక్క( ABC డిటాక్స్ డ్రింక్) యొక్క ఆరోగ్య లాభాలు:

ఆపిల్, బీట్రూట్ మరియు క్యారెట్ మూడు ముఖ్యమైన పదార్ధాల కలయికతో, మీకు సరిపడే పోషకాలు పొంది రోజంతా శక్తివంతముగా ఉండటమే కాకుండా మీ చర్మం మరియు ఆరోగ్యం యొక్క దీర్ఘకాలిక ప్రయోజనాలను కూడా పొందుతారు. ఈ అద్భుత పానీయం యొక్క విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలను మీరు కూడా చుడండి.

1.ఈ పానీయంలో విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలం

1.ఈ పానీయంలో విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలం

ఈ అద్భుతమైన పానీయం అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాల ఆరోగ్యకరమైన సమ్మేళనం. ప్రతి విభాగం దాని యొక్క సొంత పోషక విలువను జత చేస్తుంది కానీ ఆశ్చర్యకరంగా విటమిన్ ఎ, విటమిన్ B1, విటమిన్ B2, విటమిన్ B6, విటమిన్ C, విటమిన్ K, విటమిన్ E, ఫోలేట్, ఇనుము వంటి విటమిన్లు, అలాగే మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, కాల్షియం, జింక్, రాగి, నియాసిన్, సోడియం మరియు మాంగనీస్ వంటి ఖనిజాల అద్భుత మిశ్రమాన్ని మీరు పొందవచ్చు

2. మెదడు శక్తిని పెంచుతుంది

2. మెదడు శక్తిని పెంచుతుంది

ABC పానీయం ప్రయోజనాల్లో ముఖ్యమైనది వేగవంతమైన ప్రతిస్పందనల కోసం నరాల కనెక్షన్లు విస్తరించడం ద్వారా మెదడు వేగాన్ని పెంచడం. అంతేకాకుండా ఇది జ్ఞాపకశక్తిని, ఏకాగ్రత మరియు దృష్టిని మెరుగుపరుస్తుంది. ఫలితంగా మీరు వేగంగా ఆలోచించగలిగి పనిలో మంచి ఫలితాలను పొందగలరు.

3. హృదయ ఆరోగ్యానికి మంచిది

3. హృదయ ఆరోగ్యానికి మంచిది

ఈ అద్భుత పానీయం గుండె ఆరోగ్యానికి అనుకూలమైనది. బీట్రూటు మరియు క్యారట్లు బీటా-కెరోటిన్, లౌటిన్ మరియు ఆల్ఫాలను కలిగి ఉంటాయి. ఈ రెండు పోషకమైన కూరగాయలు రక్తపోటు స్థాయిలను నిలకడగా ఉంచుకుని వివిధ వ్యాధుల నుండి గుండెను కాపాడతాయి మరియు కెరోటెనాయిడ్ల యొక్క అధిక స్థాయి కొలెస్ట్రాలను క్రమబద్దీకరించి ఉంచుతాయి.

4. కంటి కండరాలను బలపరుస్తుంది

4. కంటి కండరాలను బలపరుస్తుంది

మీరు కంప్యూటర్లలో పని చేస్తున్నట్లయితే, మీ కళ్ళు చాలా ఒత్తిడికి గురవుతాయి మరియు రోజంతా అలసిపోతాయి. అందువల్ల మీ కళ్లు తిరగి, కంటి కండరాలు ప్రభావితం చేయబడతాయి మరియు కంటిని పొడిబారిపోయేలా కూడా చేయవచ్చు. ఈ ఆపిల్, బీట్రూట్ మరియు క్యారెట్ యొక్క రసం తాగడం వలన మీ కంటి చూపుని పెంచుకోవడానికి అవసరమైన విటమిన్ A మీ శరీరరానికి అందించబడుతుంది. ABC పానీయం అలసిన మీ కళ్ళను ప్రశాంతపరచి ఉపశమనం కలిగిస్తుంది. ఫలితంగా మీరు మంచి దృష్టి శక్తిని కొనసాగించవచ్చు.

5. అంతర్గత అవయవాలను బలపరుస్తుంది

5. అంతర్గత అవయవాలను బలపరుస్తుంది

శరీరంలోని అన్ని అవయవాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఇది మొత్తం శరీరం యొక్క అవయవాల మీద జాగ్రత్త తీసుకుంటుంది. కాలేయంలో నిర్విషీకరణకు క్యారెట్ మరియు బీట్రూట్ లలో ఉన్న ఆల్ఫా మరియు బీటా కెరోటిన్ లు సహాయపడతాయి, రక్తపోటు స్థాయిలను నియంత్రిస్తాయి, కొలెస్ట్రాల్ ని నియంత్రిస్తాయి, జీర్ణక్రియకు సహాయపడతాయి. అందువల్ల శరీరం చురుకుగా మరియు ఆరోగ్యంగా ఉంచబడుతుంది. అంతేకాకుండా గుండె జబ్బులు, పుండ్లు, కాలేయ వ్యాధులు, దీర్ఘకాలిక మలబద్ధకం మరియు మూత్రపిండాల సమస్యల మీద పోరాటం చేసి నిరోధిస్తుంది.

6. సాధారణ సమస్యలపై పోరాటం

6. సాధారణ సమస్యలపై పోరాటం

ఈ అద్భుత పానీయంలో వివిధ పోషకాలు మీ రోగనిరోధక వ్యవస్థను పెంచడానికి మరియు విస్తరించేందుకు దీని లక్షణాలు ప్రసిద్ధి చెందాయి. దీనితో జ్వరం, రక్తహీనత మరియు ఆస్త్మా వంటి సాధారణ వ్యాధులను నిరోధించవచ్చు. మంచి రోగనిరోధకత కోసం, అలాగే హెమోగ్లోబిన్, తెల్ల రక్తకణాల సంఖ్య పెరుగుతుంది. ఈ బీట్రూట్, క్యారెట్ మరియు ఆపిల్ రసం త్రాగటం వలన మీ శరీరం యొక్క తెల్ల రక్త కణాలు మరియు హెమోగ్లోబిన్ల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. ఈ వ్యాధులకు చికిత్స చేస్తున్నప్పుడు మంచి ఫలితాలు ఇస్తాయి.

7. మచ్చలు లేని మృదువైన చర్మం

7. మచ్చలు లేని మృదువైన చర్మం

ఆపిల్, బీట్రూట్ మరియు క్యారట్ రసం యొక్క ప్రయోజనాల్లో ముఖ్యమైనది మచ్చలు లేని మృదువైన చర్మాన్ని ప్రోత్సహించడం. ముఖ్యంగా మచ్చలు, నల్ల మచ్చలు, మొటిమలు మరియు బ్లాక్ హెడ్స్ నుండి ఉపశమనం పొందొచ్చు. విటమిన్ A విటమిన్ B కాంప్లెక్స్, విటమిన్ C, విటమిన్ E మరియు విటమిన్ K యొక్క మంచి లక్షణాలు మిమ్మల్ని యవ్వనంగా ఉంచేందుకు సహాయపడతాయి.

8. బరువు తగ్గడానికి

8. బరువు తగ్గడానికి

బరువు తగ్గించుకోవడానికి ప్రణాళిక వేసుకునే వారికి ABC రసం దీని యొక్క తక్కువ క్యాలరీలతో మంచి ఉపయోగకారినిగా ఉంటుంది. ఈ నిర్విషీకరణ పానీయం బరువు తగ్గడానికి అపారమైన సహాయం చేస్తుంది ఎందుకంటే ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది మరియు గొప్ప పీచు పదార్ధాలను కలిగి ఉంది. మీ శరీరాన్ని కనీస కేలరీలను తీసుకోవడం ద్వారా గరిష్ట శక్తిని అందిస్తుంది.

మీరు ఏబీసీ డిటాక్స్ పానీయం ఎప్పుడు త్రాగాలి?

మీరు ఏబీసీ డిటాక్స్ పానీయం ఎప్పుడు త్రాగాలి?

రోజువారీగా రోజుకు ఒకసారి ABC నిర్విషీకరణ పానీయాన్ని త్రాగడం మంచిది. ఖాళీ కడుపుతో ఈ పానీయం తాగడం వలన అద్భుతాలు చేస్తుంది. మీ అల్పాహారానికి ఒక గంట ముందు లేదా సాయంత్రం సమయంలో ఖాళీ కడుపుతో త్రాగాలి.

మీరు ఏబీసీ డిటాక్స్ పానీయం ఎప్పుడు త్రాగాలి?

రోజువారీగా రోజుకు ఒకసారి ABC నిర్విషీకరణ పానీయాన్ని త్రాగడం మంచిది. ఖాళీ కడుపుతో ఈ పానీయం తాగడం వలన అద్భుతాలు చేస్తుంది. మీ అల్పాహారానికి ఒక గంట ముందు లేదా సాయంత్రం సమయంలో ఖాళీ కడుపుతో త్రాగాలి.

మీరు ఏబీసీ డిటాక్స్ పానీయం ఎలా తయరు చేయాలి?

మీరు ఏబీసీ డిటాక్స్ పానీయం ఎలా తయరు చేయాలి?

కావలసినవి:

1. ఒక పెద్ద బీట్రూట్

2. ఒక పెద్ద ఆపిల్

౩. ఒక ఇంచు అల్లం ముక్క

4. ఒక పూర్తి క్యారెట్

తయారు చేయు విధానం:

ఒక బీట్రూట్ తీసుకుని బాగా కడగండి.

బీట్రూట్ తొక్కని తీసేయండి మరియు చిన్నముక్కలుగా తరగండి.

ఆపిల్ మరియు క్యారెట్ తీసుకుని చిన్న ముక్కలుగా తరగండి.

అన్నిటినీ కలిపి జ్యూసర్ లో వేయండి మరియు దానికి అల్లం జతచేయండి(రుచి కోసం)

పావు కప్పు మంచి నీళ్ళు వేసి పదార్ధాలను మిశ్రమం చేయండి.

English summary

How To Make ABC Detox Drink

The invigorating drink of beetroot, carrot and apple juice called the ABC detox drink has innumerable health benefits. This drink was first introduced by a Chinese herbalist to treat lung cancer and other diseases. The health benefits of the miracle drink include boosting the brains and heart health, promoting good vision and skin, etc.
Story first published:Wednesday, May 16, 2018, 13:06 [IST]
Desktop Bottom Promotion