For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అంతర్జాతీయ మహిళా దినోత్సవం: స్త్రీలలో యూటీఐ(యోని)ఇన్ఫెక్షన్ ను అరికట్టే పది ఆహారాలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం: స్త్రీలలో యూటీఐ(యోని)ఇన్ఫెక్షన్ ను అరికట్టే పది ఆహారాలు

|

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది మహిళలను వేధించే ఒక రకమైన ఆరోగ్య సమస్య. యూరినరీ ట్రాక్ట్ లో కొన్ని రకాల బాక్టీరియా వృద్ధి వలన ఈ ఇన్ఫెక్షన్ తలెత్తుతుంది. బ్లాడర్, యురెత్రా మరియు కిడ్నీలతో కూడిన యూరినరీ ట్రాక్ట్ కు ఇన్ఫెక్షన్ సోకుతుంది.

2023 International Womens Day:Top ten Foods That Prevent UTI

మీరు తీసుకునే ఆహారాలు అలాగే యూరిన్ లో నుండే యాసిడ్ లు యూరినరీ ట్రాక్ట్ లోని బాక్టీరియా ఎదుగుదలకి తోడ్పడతాయి. ఈ ఇన్ఫెక్షన్ బారిన పడిన వారిలో అబ్డోమినల్ పెయిన్, యురినేషన్ సమయంలో బర్నింగ్ సెన్సేషన్ మరియు లోయర్ బ్యాక్ క్రామ్పింగ్ ను గమనించవచ్చు.

కాబట్టి, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ను అరికట్టేందుకు సరైన మోతాదులో పోషకాలను తీసుకోవడం అవసరం. ఆహారాలలో లభించే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి శరీరం నుండి ఫ్రీ రాడికల్స్ ని తరిమేస్తాయి. తద్వారా, సెల్ డ్యామేజ్ ను అరికడతాయి.

యూటీఐని అరికట్టే ఆహారాలను ఇప్పుడు పరిశీలిద్దాం..

1. క్రాన్బెర్రీస్ :

1. క్రాన్బెర్రీస్ :

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ తో బాధపడేవారికి క్రాన్బెర్రీ జ్యూస్ ను రికమెండ్ చేస్తారు. రీసెర్చ్ ప్రకారం, క్రాన్బెర్రీస్ లో ఇన్ఫెక్షన్ కు దారితీసే బాక్టీరియాను యూరినరీ ట్రాక్ట్ వాల్స్ నుంచి తొలగించే సామర్ధ్యం కలదని తెలుస్తోంది. క్రాన్బెర్రీస్ లో లభించే యాంటీ ఆక్సిడెంట్లు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ను అరికట్టడానికి తోడ్పతాయని తెలుస్తోంది.

3. వెల్లుల్లి:

3. వెల్లుల్లి:

వెల్లుల్లిలో యూటీఐని అరికట్టే సామర్థ్యం ఉందని మీకు తెలుసా? వెల్లుల్లిలో లభించే పదార్థాలు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ను కలిగించే బాక్టీరియాను నశింపచేస్తాయి. ఇందులో లభించే అలిసిన్ మరియు మిగతా సల్ఫర్ కాంపౌండ్స్ లో కలిగిన యాంటీ మైక్రోబయాల్ ప్రాపర్టీలు యూటీఐను అరికట్టడానికి తోడ్పడతాయి.

4. విటమిన్ సి:

4. విటమిన్ సి:

విటమిన్ సిని ఆస్కార్బిక్ యాసిడ్ అని కూడా అంటారు. దీనికి యూటీఐతో పోరాడే శక్తి కలదు. విటమిన్ సి అనేది బాక్టీరియా వృద్ధిని అదుపులో ఉంచుతుంది. అందువలన, యూరిన్ అనేది తక్కువ ఎసిడిక్ గా ఉంటుంది. దీనివలన, యూటీఐ బారిన పడే ప్రమాదం తగ్గుతుంది. ఆరెంజ్, లెమన్, టమాటో, క్యాబేజ్, బ్రొకోలీ, జామపండు వంటి విటమిన్ సి రిచ్ ఫుడ్స్ ని తీసుకుంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ను అరికట్టవచ్చు.

5. బ్లూ బెర్రీస్:

5. బ్లూ బెర్రీస్:

ప్రో యాంతోసియానిడిస్ అనే ప్లాంట్ కాంపౌండ్స్ బ్లూ బెర్రీస్ లో లభిస్తాయి. ఇవి యూరినరీ ట్రాక్ట్ లో బాక్టీరియాను పేరుకుపోకుండా చూస్తాయి. అలాగే రోగనిరోధక శక్తిని పెంపొందించే యాంటీ ఆక్సిడెంట్స్ బ్లూ బెర్రీస్ లో పుష్కలంగా లభిస్తాయి.

6. డార్క్ చాకొలేట్:

6. డార్క్ చాకొలేట్:

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ని అరికట్టడానికి డార్క్ చాకొలేట్ దోహదపడుతుంది. ఇందులో లభించే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఫ్రీ రాడికల్స్ పై పోరాడతాయి. పోలీఫెనాల్స్ మరియు ఫ్లవనాయిడ్స్ వంటి రెండు యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి యూటీఐ లక్షణాలని అరికట్టడానికి తోడ్పడతాయి.

7. రెడ్ వైన్:

7. రెడ్ వైన్:

రెడ్ వైన్ లో మెడిసినల్ ప్రాపర్టీస్ కలవు. ఇవి అనేక వ్యాధులను అరికట్టడానికి తోడ్పడతాయి. యాంటీసెప్టిక్ గా రెడ్ వైన్ ను పరిగణిస్తారు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, ఆందోళన, కంటి నొప్పి వంటి సమస్యలకు రెడ్ వైన్ నురెమెడీ గా వాడతారు.

8. ఓట్స్:

8. ఓట్స్:

ఓట్స్ లో సాల్యుబుల్ ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ను వృద్ధి చేసే అవకాశాన్ని తగ్గిస్తుంది. ఓట్స్ లో ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. అందువలన యూటీఐ ఇన్ఫెక్షన్స్ తగ్గుముఖం పడతాయి. ఓట్ మీల్ ను రోజూ తీసుకోవడం వలన యూటీఐ నుంచి రక్షణ పొందవచ్చు.

9. టొమాటోస్:

9. టొమాటోస్:

టొమాటోలలో యూరినరీ ఇన్ఫెక్షన్ పై పోరాడే శక్తి ఉంది. టొమాటోలలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ మరియు మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి యూటీఐ లక్షణాలను తగ్గిస్తాయి. సలాడ్ లలో తాజా టమాటోలను జోడించడం ద్వారా టమాటో ఇన్టేక్ ను పెంచుకోవచ్చు.

అదనంగా, నీళ్లను తగినంత తీసుకోవడం ద్వారా ఉపశమనం లభిస్తుంది!

తగినంత నీటిని తీసుకోవడం వలన శరీరం నుంచి టాక్సిన్స్ బయటకు పోతాయి. అందువలన, యూటీఐ వంటి అనేకరకాల ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షణ పొందవచ్చు. నీటిని ఎంత ఎక్కువగా తీసుకుంటే, అంత ఎక్కువగా యూరినేట్ చేస్తారు. అంటే, శరీరం నుంచి టాక్సిన్స్ అనేవి బయటకు పోవడానికి తగిన అవకాశం మనం కలిపించినట్టు అవుతుంది. ప్రతి ఒక గంటకు ఒక గ్లాసు నీళ్లు తీసుకోవాలి.

English summary

2023 International Women's Day:Top ten Foods That Prevent UTI

Urinary tract infections (UTIs) is caused by bacterial infections that develop in the urinary tract, which is composed of the bladder, urethra and the kidneys. These are some of the foods to prevent UTI like tomatoes, cranberry, blueberry, yogurt, garlic, dark chocolate, etc.
Desktop Bottom Promotion