For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తొక్క తీసినదా! తీయనిదా! ఏ యాపిల్ ను తినడం శ్రేయస్కరం?

తొక్క తీసినదా! తీయనిదా! ఏ యాపిల్ ను తినడం శ్రేయస్కరం?

|

యాపిల్ ను ఎలా తినాలి? మీరు తొక్క తొలగించి తింటారా లేదా తోలుతో పాటుగా తింటారా? కొంతమంది పురుగుమందుల భయం చేత మరియు తోలుపై మైనపు పూత కారణంగా యాపిల్ ను తొక్కతో పాటుగా తినడానికి ఇష్టపడరు. ఈ వ్యాసంలో, మేము చెక్కు తీసిన యాపిల్ తింటే మంచిదా! లేదా తీయనిది మంచిదా! అని తెలుపబోతున్నాం.

యాపిల్స్, విటమిన్ సి, పొటాషియం, ఫైబర్, కార్బోహైడ్రేట్లు మరియు క్వెర్సేటిన్, కేటచిన్ వంటి వృక్ష సమ్మేళనాలు మరియు క్లోరోజెనిక్ ఆమ్లం కలిగి ఉంటాయి. ఒక మధ్యస్థ పరిమాణంలో ఉండే, ఆపిల్ కేవలం 95 కేలరీలు కలిగి ఉంది.

Peeled Or Unpeeled Apple - Which One Should You Eat?

యాపిల్ లో పాలీఫీనాల్స్ మరియు యాంటిఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు యాపిల్ యొక్క కండ మరియు తోలులోనూ ఉంటాయి.

అయితే, ఇప్పుడు చెప్పండి. తొక్క తీసిన యాపిల్ తింటే ఆరోగ్యకరమా? తీయనిదా? తెలుసుకోవాలనుకుంటే చదవండి మరి!

చాలామంది యాపిల్ తొక్కను తొలగించి తినడానికి ఇష్టపడతారు. కానీ ఇలా చేసేటప్పుడు, దానిలో ఉండే పోషకాలను కూడా మనం తొలగించినట్టే! యాపిల్ పై తొక్కను ఎందుకు తొలగించకూడదో, ఇప్పుడు మీకు తెలుపబోతున్నాం.

1. యాపిల్ తోలులో పీచుపదార్ధం అధికంగా ఉంటుంది.

1. యాపిల్ తోలులో పీచుపదార్ధం అధికంగా ఉంటుంది.

ఒక మధ్యస్థమైన పరిమాణం కలిగిన యాపిల్ పై తొక్కలో మొత్తం 4.4 గ్రాములు పీచుపదార్ధం ఉంటుంది. ఆపిల్ పై తొక్కలో, కరిగే మరియు కరగని పీచుపదార్థాలు రెండూ ఉంటాయి. కాని వాటిలో అధిక భాగం అనగా 77 శాతం కరగని పీచుపదార్ధం ఉంటుంది. ఈ ఫైబర్ నీటితో బైండింగ్ చెంది, మలబద్ధకాన్ని నిరోధిస్తుంది మరియు మీ పెద్ద ప్రేగు ద్వారా జీర్ణ వ్యర్థాలను బయటకు పంపుతుంది.

మరొక వైపు, కరిగే పీచుపదార్ధం, మీకు కడుపు నిండిన అనుభూతినిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయి పెరగడం వలన వచ్చే చిక్కులు నిరోధిస్తుంది, మరియు పోషకాలను శోషణ వేగాన్ని తగ్గిస్తుంది. అంతేకాక, ఇది కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది.

2. యాపిల్ పై తొక్కలో విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి.

2. యాపిల్ పై తొక్కలో విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి.

ఒక ఆపిల్ పై తొక్కలో, 8.4 mg విటమిన్ C మరియు 98 IU విటమిన్ ఎ ఉంటాయి. ఒకసారి తోలును తొలగిస్తే, వీటి పరిమాణం, 6.4 mg విటమిన్ C మరియు 61 IU విటమిన్ ఎ కు తగ్గుతాయి. ఆపిల్ లో ఉండే మొత్తం విటమిన్ సిలో దాదాపుగా సగం దాని తోలులోనే ఉంటుందని మీకు తెలుసా? కాబట్టి, తొక్కతో పాటుగా యాపిల్ ను తినడమనేది చాలా మంచి ఆలోచన.

3. శక్తివంతమైన క్యాన్సర్ నియంత్రణ పదార్థం

3. శక్తివంతమైన క్యాన్సర్ నియంత్రణ పదార్థం

2007 లో కార్నెల్ యూనివర్శిటీ వారి అధ్యయనంలో యాపిల్ తోలులో ట్రైటెర్పినాయిడ్స్ అనే సమ్మేళనాలు ఉంటాయని తెలిసింది. ఈ సమ్మేళనాలకు క్యాన్సర్ కణాలను, ముఖ్యంగా పెద్దప్రేగు, రొమ్ము మరియు కాలేయ క్యాన్సర్ కణాలను నశింపజేసే సామర్ధ్యం ఉంటుంది.

అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ వారి అధ్యయనం ప్రకారం, యాపిల్ లో యాంటిఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

తొక్క తీసినదా! తీయనిదా! ఏ యాపిల్ ను తినడం శ్రేయస్కరం?

క్వెర్సేటిన్ అనే ఒక ఫ్లేవానోయిడ్, యాపిల్ కండలో కన్నా , తొక్కలో ఎక్కువగా కనిపిస్తుంది. ఒక అధ్యయనంలో, ప్రతి వారం ఐదు లేదా అంతకంటే ఎక్కువ యాపిళ్లను తినే వ్యక్తులలో క్వెర్సేటిన్ ప్రభావం చేత ఊపిరితిత్తుల పనితీరు బాగుంటుందని తెలిసింది. ఇది ఆస్తమా ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

2004లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం, క్వెర్సేటిన్, అల్జీమర్స్ వ్యాధి మరియు ఇతర ప్రమాదకరమైన సమస్యలతో సంబంధం ఉన్న మెదడులోని కణజాలం నష్టపోకుండా పోరాడుతుంది.

5. యాపిల్ తోలు బరువు కోల్పోవడంలో సహాయం చేస్తుంది

5. యాపిల్ తోలు బరువు కోల్పోవడంలో సహాయం చేస్తుంది

బాగా బరువు తగ్గించుకోవాలన్న ఆలోచన కలిగిన వారికి ఒక శుభవార్త. యాపిల్ తోలులో ఉండే ఉర్సోలిక్ ఆమ్లం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది స్థూలకాయంతో పోరాడటానికి ఉపయోగపడే ఒక ముఖ్యమైన సమ్మేళనం.ఇది కండరాల కొవ్వు పెరగడానికి తోడ్పడుతుంది. ఉర్సోలిక్ యాసిడ్ అధిక కేలరీలను దహించివేసి, ఊబకాయం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

6. యాపిల్ తోలు వలన కలిగే ఇతర పోషక ప్రయోజనాలు

6. యాపిల్ తోలు వలన కలిగే ఇతర పోషక ప్రయోజనాలు

ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయం వారి అధ్యయనం ప్రకారం, ఆపిల్ తోలులో పొటాషియం, కాల్షియం, ఫోలేట్, ఇనుము మరియు ఫాస్పరస్ వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఈ ఖనిజాలు, మన శరీరంలో వేర్వేరు విధులను నిర్వర్తిస్తాయి. ఇవి ఎముకలను గట్టిపరచి, కణాల పెరుగుదలని నియంత్రించి, ఆరోగ్యవంతమైన ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి.క్వెర్సేటిన్ అనే ఒక ఫ్లేవానోయిడ్, యాపిల్ కండలో కన్నా , తొక్కలో ఎక్కువగా కనిపిస్తుంది. ఒక అధ్యయనంలో, ప్రతి వారం ఐదు లేదా అంతకంటే ఎక్కువ యాపిళ్లను తినే వ్యక్తులలో క్వెర్సేటిన్ ప్రభావం చేత ఊపిరితిత్తుల పనితీరు బాగుంటుందని తెలిసింది. ఇది ఆస్తమా ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

2004లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం, క్వెర్సేటిన్, అల్జీమర్స్ వ్యాధి మరియు ఇతర ప్రమాదకరమైన సమస్యలతో సంబంధం ఉన్న మెదడులోని కణజాలం నష్టపోకుండా పోరాడుతుంది.

English summary

Peeled Or Unpeeled Apple - Which One Should You Eat?

Apples are high in polyphenols, which have antioxidant effects. One medium apple peel has about 4.4 g of total fibre. The apple peel has both soluble and insoluble fibre, but about 77 per cent of them is insoluble fibre. An apple peel is loaded with 8.4 mg of Vitamin C.Peeled Or Unpeeled Apple - Which One Should You Eat?
Desktop Bottom Promotion