For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిద్రపోవడానికి గుమ్మడి కాయ విత్తనాలు ఎలా సహకరిస్తాయి?

అవును నిజమే, మీరు బాగా నిద్ర పోవాలంటే గుమ్మడికాయ విత్తనాలను ఉపయోగించవచ్చు. అందులో పోషకాలను మాత్రమే కాకుండా, వీటిని సాయంత్రం సమయంలో తినడం వల్ల మీకు బాగా నిద్ర పట్టడానికి సహాయపడతాయి.

|

అవును నిజమే, మీరు బాగా నిద్ర పోవాలంటే గుమ్మడికాయ విత్తనాలను ఉపయోగించవచ్చు. అందులో పోషకాలను మాత్రమే కాకుండా, వీటిని సాయంత్రం సమయంలో తినడం వల్ల మీకు బాగా నిద్ర పట్టడానికి సహాయపడతాయి.

గుమ్మడికాయ గింజలలో మెగ్నీషియం మరియు ట్రిప్టోఫాన్ను కలిగి ఉంటాయి. ఈ విత్తనాలు మనకు జింక్ను మరియు ఆరోగ్యవంతమైన కొవ్వును అందిస్తాయి.

pumpkin seeds for sleep

మీరు మంచంపై విశ్రాంతి లేకుండా పడుకోవటానికి ప్రయత్నిస్తున్నటడుకోవటానికి ప్రయత్నిస్తున్నట్లయితే, అలాంటి సమస్యలను కేవలం ఆహారంతోనే పరిష్కరించవచ్చు. అందుకోసం నిద్రమాత్రలు వాడవలసిన అవసరం లేదు. నిద్రలేమి వల్ల కలిగే తీవ్రమైన దుష్ప్రభావాలు చాలానే ఉన్నాయి. అలా అని నిద్రమాత్రలు వాడటం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. అలాంటప్పుడు గుమ్మడికాయ గింజలు మీ ఆహారంలో ఒక భాగంగా చేసుకున్నప్పుడు, రాత్రిపూట మీరు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.

గుమ్మడి కాయ విత్తనాలు మనకు ఏవిధంగా సహాయపడుతుంది ?

గుమ్మడి కాయ విత్తనాలు మనకు ఏవిధంగా సహాయపడుతుంది ?

గుమ్మడి కాయ విత్తనాలు వంటి కొన్ని రకాల ఆహారపదార్థాలు మన శరీరానికి విశ్రాంతిని కలుగజేసే స్థితిలో ఉంచడానికి సహాయపడతాయి. నిజానికి, మీ శరీరంలో కొనసాగే అంతర్గత రసాయనిక చర్యల ప్రక్రియల వల్ల మీకు విశ్రాంతి అనేది అవసరమవుతుంది. ఇలాంటి ప్రక్రియను వేగవంతం చేయటానికి గుమ్మడి విత్తనాలు అనేవి బాగా సహాయపడతాయి.

మీరు బాగా నిద్రపోయేందుకు ఏ ఆహారం సహాయపడును ?

మీరు బాగా నిద్రపోయేందుకు ఏ ఆహారం సహాయపడును ?

అరటిపండ్లు అనేవి మీకు బాగా సహాయపడగలవు. అలానే, ఒక గ్లాస్ వేడి పాలను (కొన్ని చుక్కల తేనెను కలపండి) త్రాగటం వల్ల మంచి నిద్రకలుగుటకు సహాయపడుతుంది.

ఇలాంటి కొన్ని రకాల ఆహారపదార్థాలు శరీరంలో రసాయనిక చర్యల ప్రక్రియను వేగవంతం చేసి మన శరీరం త్వరగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.

ట్రిప్టోఫాన్ ఏ విధంగా సహాయపడుతుంది ?

ట్రిప్టోఫాన్ ఏ విధంగా సహాయపడుతుంది ?

గుమ్మడికాయ విత్తనాలు ట్రిప్టోఫాన్ను కలిగి ఉంటాయి. ఇందులో చెప్పుకోవడానికి ఏమీ లేకపోయినా అమైనో ఆమ్లాలను మాత్రం కలిగి ఉంటుంది. మీరు గుమ్మడికాయ గింజలను తిన్నప్పుడు ట్రిప్టోఫాన్ అనేది సెరోటోనిన్ గా మార్చబడుతుంది. ఇది శరీరంలోని మెలటోనిన్ అనేది బాగా ఉత్పత్తి అవ్వడానికి సహాయపడుతుంది మరియు మీ శరీరాన్ని నిద్రావస్థలోకి తీసుకువెళుతుంది.

గుమ్మడికాయ గింజలను ఎప్పుడు తినాలి ?

గుమ్మడికాయ గింజలను ఎప్పుడు తినాలి ?

రాత్రి పడుకునే ఒక గంట ముందు గుమ్మడికాయ గింజలను తినటం వల్ల మీకు బాగా సహాయపడుతుంది. ఈ గింజలను రాత్రి భోజనంలో కలిపి (లేదా) కార్బోహైడ్రేట్లను కలిగి ఉన్న ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవడం వల్ల నిద్రకు బాగా సహాయపడగలదు.

ఎంత తినాలి ?

ఎంత తినాలి ?

మీ చేతినిండా తీసుకోబడిన గుమ్మడికాయ గింజలు సరిగ్గా సరిపోతాయి. ఒక కప్పులో సగానికి గుమ్మడి గింజలను వేసి, స్నాక్స్ లా తినడం చాలా మంచిది.

రుతుస్రావం నిలిచిపోయిన మహిళలలో కలిగి వున్న వేడిని, కీళ్లనొప్పులను మరియు తలనొప్పులను ఈ విత్తనాలు నిరోధిస్తాయి.

ఇతర ప్రయోజనాలు :

ఇతర ప్రయోజనాలు :

ఈ గుమ్మడికాయ గింజలు విటమిన్-E, కెరోటినాయిడ్స్ మాత్రమే కలిగి ఉండటం కాకుండా, మీ శరీరానికి అవసరమైన ఇతర పోషకాలను కూడా అందిస్తాయి.

English summary

Pumpkin Seeds For Better Sleep

Do pumpkin seeds help fall asleep? Yes, you can use pumpkin seeds to boost your sleep quality. They are not only nutritious; they can help you fall asleep when consumed during late evening. Pumpkin seeds contain magnesium and tryptophan which can help you fall asleep. These seeds also provide healthy fats and zinc too.
Story first published:Saturday, January 13, 2018, 12:46 [IST]
Desktop Bottom Promotion