For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజువారీ ఆహారప్రణాళికలలో భాగంగా పసుపు తీసుకోవడం వలన కలిగే ఉపయోగాలు ఏమిటి.

భారతీయ సాంప్రదాయక వంటలలో సాధారణంగా ఉండే ఉత్తమమైన పదార్ధాలలో పసుపు కూడా ఒకటి. ఇది శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచడం ద్వారా అనేక వ్యాధులతో పొరాడి, వాటి తగ్గుదలకు కారణమవుతుంది. ఈ పసుపులో అనేకరకాల ప్రయోజనాల

|

భారతీయ సాంప్రదాయక వంటలలో సాధారణంగా ఉండే ఉత్తమమైన పదార్ధాలలో పసుపు కూడా ఒకటి. ఇది శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచడం ద్వారా అనేక వ్యాధులతో పొరాడి, వాటి తగ్గుదలకు కారణమవుతుంది. ఈ పసుపులో అనేకరకాల ప్రయోజనాలున్నాయి, ఇది రోజూ వారీ ఆహారంలో తీసుకోవడం వలన కలిగే ఉపయోగాల గురించి ఇక్కడ పొందుపరచడం జరిగినది.

కుర్కుమినాయిడ్స్ అని పిలవబడే అనేక రకాల రసాయనిక సమ్మేళనాలు ఈ పసుపులో ఉంటాయి. ఈ పసుపులో కుర్కుమిన్ అనే ప్రత్యేకమైన సమ్మేళనం ఉంటుంది, దీని కారణంగానే వంటలలో రుచి చేకూరుతుంది, మరియు అనేక ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది

health tips in telugu

ఈ కుర్కుమిన్ మంటను తగ్గించే ఆంటీఇన్ఫ్లమేషనరీ లక్షణాలతో పాటు శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచే గుణాలు కూడా ఉన్నాయి. ఇవి బహిష్టు సమస్యలను, కామెర్ల నిరోధానికి, రక్తం గడ్డకట్టుటను, మూత్రంలో రక్తాన్ని, దంతక్షయాన్ని, గుండెనొప్పిని తగ్గించుటలో ఉపయోగపడుతాయి.

పసుపు ఒక రకమైన చేదు తత్వాన్ని కలిగి ఉంటుంది, ఈ తత్వమే వంటలో రుచిని ఇవ్వడంలో తోడ్పడుతుంది. వీటి వేర్లను ఎన్నో రకాల ఔషధాల తయారీకి వినియోగిస్తారు, తద్వారా ఆర్థరైటిస్ , కీళ్ల నొప్పులు , గుండెలో మంట, కడుపు నొప్పి, కామెర్లు, ఆకలి మందగించుట, క్రాన్స్ వ్యాధి , ఇతర కాలేయ సంబంధిత వ్యాధుల నివారణలో పసుపు కీలకపాత్ర పోషిస్తుంది.

జీర్ణక్రియలో సహాయం చేస్తుంది:

జీర్ణక్రియలో సహాయం చేస్తుంది:

మీ జీర్ణ ప్రక్రియ మెరుగవ్వడానికి తీసుకోవలసిన అద్భుతమైన పదార్ధంగా ఈ పసుపు చెప్పబడుతున్నది. ఇది జీర్ణాశయాన్ని ఉత్తేజ పరచి, జీవక్రియలు మెరుగవ్వడంలో కీలకపాత్ర పోషిస్తుంది. మీరు తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేసి శరీరానికి కావలసిన పోషకాలు, క్రొవ్వు అందించడంలో పసుపు కీలక పాత్ర పోషిస్తుంది. మరియు ఆపాన వాయువుల నియంత్రణలో, కడుపు ఉబ్బరానికై మంచి ఉపశమనాన్ని ఇవ్వడంలో పసుపు కీలకపాత్ర పోషిస్తుంది. కొన్ని అధ్యయనాల ద్వారా కడుపులో గాస్ క్రమంగా తగ్గుదలకు కూడా ఈ పసుపు అత్యుత్తమo గా పని చేస్తుంది అని నిరూపితమైనది.

మంటను తగ్గించే లక్షణం:

మంటను తగ్గించే లక్షణం:

పసుపులో యాంటీ ఇన్ఫ్లమేషనరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. తద్వారా కడుపులో గుండెల్లో మంటను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. నిజానికి మన దేశంలో ఎక్కువమంది ఈ సమస్యలతోనే పోరాడుతున్నారు, ఇది దైనందిక ఆహారపు అలవాట్లు మరియు సరైన వ్యాయామoలేని కారణంగా ఇలాంటి వ్యాధులకు గురవుతున్నారు అని అనేక నివేదికలు తేల్చాయి. ముఖ్యంగా ఇందులో ఉండే curcumin ఇలాంటి మంటను తగ్గించే లక్షణాలను కలిగి ఉంటుంది. కావున రోజూవారీ ఆహారంలో పసుపు ఉండడం వలన అనేక రాబోవు సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

మీ కాలేయ పని తీరుని పెంచుతుంది:

మీ కాలేయ పని తీరుని పెంచుతుంది:

కాలేయం శరీరంలో అతి ముఖ్యమైన భాగాలలో ఒకటి, శరీరానికి అధికమైన పోషకాలను ఇది నిల్వచేస్తుంది. మరియు శరీరంలోని విషతుల్య రసాయనాలను తొలగించుటలో , గ్లూకోస్ నియంత్రణలో , మరియు క్రొవ్వు నియంత్రణలో కూడా కాలేయం ప్రత్యేకపాత్ర పోషిస్తుంది. ఒక్కసారి కాలేయం దెబ్బతింటే అనేక సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. చివరికి ప్రాణాంతకంగా కూడా పరిణమిస్తుంది.కావున కాలేయం పట్ల అశ్రద్ద తగదు

పసుపులో ఉండే రోగనిరోధకశక్తి తత్వాలు, క్రిమి సంహారక లక్షణాలు కాలేయం సరిగ్గా పనిచేయుటలో సహాయం చేస్తాయి. తద్వారా కాలేయ సంబంధిత రోగాలు రాకుండా కాపాడగలదు.

ప్రకృతి సిద్దమైన క్రిమినాశకతత్వాలు కలిగి ఉంటుంది:

ప్రకృతి సిద్దమైన క్రిమినాశకతత్వాలు కలిగి ఉంటుంది:

పసుపులో ప్రకృతి సిద్దంగా ఆంటీసెప్టిక్ (క్రిమినాశక తత్వం) కలిగి ఉంటుంది, తద్వారా ఏదైనా గాయం అయిన పక్షంలో ఆ చోట పసుపు రాసినప్పుడు, రక్తం బయటకు రాకుండా ఆపడమే కాకుండా, అక్కడ చేరిన క్రిములను నాశనం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. మరియు కొందరు చల్ది శరీరాన్ని కలిగి ఉంటారు. వీరికి దుమ్ము, ధూళి, సూర్యరశ్మి ప్రతిదీ చర్మ నాశనకారులుగా ఉంటాయి. తద్వారా పుండ్లతో భాధ పడుతుంటారు. వీటికి కూడా పసుపు ఎంతో చక్కగా పని చేస్తుంది అని చెప్పబడినది. తద్వారా ఇది మంచి గృహ వైద్యంగా పేరు గడించింది.

అల్జీమర్స్ వ్యాధి సైతం రాకుండా :

అల్జీమర్స్ వ్యాధి సైతం రాకుండా :

ఎన్నో అధ్యయనాల ప్రకారం, ఈ పసుపు అల్జీమర్స్ వ్యాధిని సైతం రాకుండా అడ్డుకోగలదని నిరూపితమైనది. మెదడులోని ఆమ్ల తత్వాలను నియంత్రించగల శక్తి మరియు మంటను తగ్గించే గుణాల కారణంగా పసుపు మెదడు విషయంలో కీలకంగా పని చేస్తుంది. మెదడులోని నాళాలలో ప్రోటీన్ ఫలకాలు లేదా క్రొవ్వుతత్వాలు పేరుకుని పోవడం ద్వారా అల్జీమర్స్ వ్యాధి వస్తుంది. రోజువారీ ఆహారంలో పసుపు తీసుకోవడం ద్వారా ఇలాంటి సమస్యలు దారికి చేరకుండా పసుపు చూడగలదు.

ప్రకృతి సిద్దమైన నొప్పిని హరించే తత్వాలు:

ప్రకృతి సిద్దమైన నొప్పిని హరించే తత్వాలు:

ఒక్కోసారి కీళ్లవాతాలకు, గాయాల కారణంగా ఏర్పడిన వాపులు భాధను కలిగిస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యలకు పసుపు ఉత్తమ పరిష్కారంగా చెప్పబడినది. గాయాలైన చోట పసుపును రాయడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.

ఊబకాయం తగ్గుటలో:

ఊబకాయం తగ్గుటలో:

మీరు ఊబకాయానికి గురై ఎన్నో సమస్యలను ఎదుర్కుంటూ ఉన్న ఎడల, రోజు వారీ ఆహారంలో పసుపు ఖచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకొనవలసి ఉంటుంది. ఇది మీ శరీర బరువుని నియంత్రించుటలో కీలకపాత్రను పోషిస్తుంది. శరీరంలోని క్రొవ్వు తత్వాలకు వ్యతిరేకంగా పని చేసే లక్షణాలు పసుపు సొంతం. జీవక్రియలను మెరుగుపరచడంలో సహాయ పడి, తద్వారా క్రొవ్వును కరిగించుటలో కీలకపాత్ర పోషిస్తుంది.

మానసిక ఒత్తిడులను కూడా తగ్గిస్తుంది:

మానసిక ఒత్తిడులను కూడా తగ్గిస్తుంది:

ఒక్కోసారి అనారోగ్యకర జీవనశైలి మానసిక సమస్యలను కూడా తీసుకుని వస్తుంది, నెమ్మదిగా డిప్రెషన్ వంటి సమస్యలకు కూడా ఇలాంటి జీవనమార్గాలే కారణమవుతాయి. ఇలాంటి సమస్యలకు పసుపు గొప్ప ఔషధంగా చెప్పబడినది. ఇది నెమ్మదిగా డిప్రెషన్ స్థాయిలను తగ్గించుటలో కీలక పాత్ర పోషిస్తుంది.

కావున రోజూవారీ ఆహారంలో పసుపు తీసుకోవడం ద్వారా అనేక మానసిక శారీరిక సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

English summary

reasons-why-you-should-be-having-turmeric-as-a-part-of-your-daily-diet

The active compound present in turmeric is curcumin and this is what makes it a powerful spice. The root of the turmeric is used for the treatment of arthritis, joint pain, heartburn, stomach pain, etc. Reasons why you should be having turmeric daily is because it helps in weight loss, aids digestion, promotes liver function, prevents Alzheimer's disease, etc.
Story first published:Thursday, April 5, 2018, 18:03 [IST]
Desktop Bottom Promotion