For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పోషకాల నిధి ఆపిల్ తినుటకు అనువైన సమయం ఇదే?

|

రోజుకొక యాపిల్, డాక్టర్ ని దూరంగా ఉంచుతుంది అని మన పెద్దవారు ఎప్పుడూ చెప్తుంటారు. అంత గొప్ప వ్యాధినిరోధక లక్షణాలు కలిగి ఉన్న పండు యాపిల్. కానీ దీనిని రోజులో ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవడం కుదరదు.అలా వేళ కాని వేళల్లో తీసుకోవడం మూలం గా ఫలితాల కన్నా దుష్ప్రభావాలే ఎక్కువ ఉంటాయి. దీనికి మన ఆయుర్వేదం ఏపండును ఏసమయంలో తీసుకుంటే దానియొక్క ఉపయోగాలను గరిష్టంగా పొందగలమో వివరించింది. వీటిలో భాగంగానే యాపిల్ కు కూడా కొన్ని నిర్దిష్టమైన సమయం ఉంది.

పగటి వేళల్లో ఆపిల్ ఉత్తమం: చాలా అధ్యయనాలు ఆపిల్ ని పగటి వేళల్లో తీసుకోవడం ఉత్తమం అని చెప్తున్నాయి. దీనికి ప్రధానకారణం దీని తొక్కలో అధికశాతంలో ఉన్న పెక్టిన్ మరియు పీచుపదార్ధాలు. ఎక్కువ శాతం ప్రజలు అజీర్ణం, నిద్రలేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కోవడంతో పాటు ఆలస్యంగా భోజనం చెయ్యడం వంటివి చేస్తుంటారు. వీరికి ఆపిల్ జీర్ణం అవడానికి సమయం తీసుకుంటుంది. కావున పగటివేళల్లో ఈ పండు తీసుకోమని ప్రాధమికంగా నిర్దేశించబడినది. పైగా పగటి వేళల్లో తీసుకోవడం మూలంగా ప్రేవులు ఉద్దీపనకు గురయ్యి మిగిలిన పండ్లకంటే అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి.

THIS is the best time to eat an apple if you want maximum health benefits!

పెక్టిన్ : ఇందులో ఉన్న పెక్టిన్ అను పదార్ధం పెద్దపేగులో ఉన్న లాక్టిక్ యాసిడ్ ఆమ్లం ను పెంచడంలో మరియు రక్షించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీని కారణాన జీర్ణ వ్యవస్థ మెరుగుపడి ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. పైగా ప్రేవుల్లోని విషతుల్య కాన్సర్ కారకాలను తొలగిస్తుంది. దీనికారణంగా పెద్ద ప్రేవు కాన్సర్(colon cancer) లాంటి రోగాలు రాకుండా అడ్డుకుంటుంది. ఈ కొలన్ కాన్సర్ అత్యంత ప్రమాదకరమైనది, దీనిని కొలనోస్కోపీ పరీక్ష ద్వారా మాత్రమే కనుక్కోవడానికి సాద్యం అవుతుంది. కాని రోజూవారి ఆహార నియమాలలో ఆపిల్ ని భాగం చెయ్యడం ద్వారా దీనిని అడ్డుకోవచ్చని అధ్యయనాల సారాంశం.
THIS is the best time to eat an apple if you want maximum health benefits!

సాయంత్రం వేళ ఆపిల్ తినడం మంచిదేనా? : పగలు జీర్ణవ్యవస్థకు అనుకూలంగా ఉండే ఆపిల్, సాయంత్ర సమయాల్లో తినడం వలన ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. పెద్ద ప్రేవుల పని తీరు పై భారాన్ని పెంచే అవకాశం ఉంది. అనగా రాత్రివేళల్లో ప్రేవుల్లోని ఆపిల్ నుండి వచ్చే వాయువుల ప్రభావం వలన అతి తక్కువ సమయంలోనే అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంది. కావున సాయంత్రం వేళల్లో ఆపిల్ తినకపోవడమే మంచిది అని చెప్తున్నారు.

THIS is the best time to eat an apple if you want maximum health benefits!

organic acid ప్రభావము: ఆపిల్ తినడం మూలంగా ఆపిల్ లో సహజసిద్దంగా ఉండే సేంద్రీయ ఆమ్లాలు కడుపులోని ఆమ్లాల స్థాయిని పెంచడంలో దోహదం చేస్తుంది. ఇది ప్రేవుల కదలికలో సహాయం చేస్తుంది. కాని సాయంత్రం వేళల్లో తీసుకోవడం మూలంగా ఆమ్లాల స్థాయి పెరిగి కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తవచ్చు. కావున ఆపిల్ ఎప్పుడూ పగటివేళల్లో మాత్రమే తీసుకోవలసినదిగా ఆయుర్వేదంలో చెప్పబడినది.
THIS is the best time to eat an apple if you want maximum health benefits!

ఆపిల్ తినడం వల్ల ప్రయోజనాలు: పగటివేళల్లో ఆపిల్ ను భోజనాల మద్య చిరుతిండిగా స్వీకరించడం మూలంగా, జీర్ణవ్యవస్థ మెరుగుపరచడంలో, అధిక బరువుని తగ్గించడంలో శరీరంలోని పోషకాల విలువలు పెంచడంలో, చక్కటి చర్మ సౌందర్యం మరియు ఆరోగ్య విలువలు పెరగడంలో ప్రముఖపాత్ర పోషిస్తుంది.

English summary

THIS is the best time to eat an apple if you want maximum health benefits!

THIS is the best time to eat an apple if you want maximum health benefits,any time of the day. There is a reason Ayurveda has always been behind us to eat certain foods at a particular time of the day to reap their benefits. Even our old friend apple has one.
Story first published:Monday, March 5, 2018, 18:10 [IST]
Desktop Bottom Promotion