For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సల్ఫర్ అధికంగా ఉండే 10 ఆహారాలు తింటే క్యాన్సర్ బలాదూర్

By R Vishnu Vardhan Reddy
|

మన శరీరంలోని కణజాలాలు సరైన పద్దతిలో పనిచేయాలంటే, అందుకు సల్ఫర్ అనే ఖనిజం చాలా ముఖ్యమైనది. శరీరం పనిచేయు విషయం లో ఈ ఖనిజం ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తుంది. సల్ఫర్ శరీరాన్ని క్రిమికీటకాల నుండి కాపాడుతుంది మరియు హానికర పదార్ధాల నుండి రక్షిస్తుంది. కణజాలాలు ఒకటితో ఒకటి సంబంధాన్ని ఏర్పరుచుకొని సరైన పద్దతిలో వృద్ధి చెందాలంటే అందుకు ఈ ఖనిజం చాలా ముఖ్యం. చర్మ నిర్మాణం యొక్క మూలాలు దెబ్బతినకుండా నిర్వహించడంలో ఈ ఖనిజం ఎంతో బాగా పనిచేస్తుంది.

అంతేకాకుండా రెండు ఎముకలను కలిపే దగ్గర ఉండే మృదులాస్థి సరైన పద్దతిలో పనిచేయడానికి మరియు కాలేయంలో జీర్ణక్రియ సరైన పద్దతిలో అవ్వడానికి, ఇలా వీటన్నింటిలో సల్ఫర్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. చాలా మంది ప్రజలకు తెలియని విషయాలు ఏమిటంటే, ఎమినో ఆమ్లాలు మరియు విటమిన్లు నిర్మాణం అవ్వడానికి ఇది సహాయపడుతుంది మరియు ఆరోగ్యవంతమైన ఎముకలు, కండరాల్ల కణాలు మరియు కణజాలాలు వృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

శరీరంలో సల్ఫర్ లోపం ఉన్నట్లయితే, అటువంటి సమయంలో ప్రొటీన్ల సంశ్లేషణ తగ్గిపోతుంది. ఏ ఎమినో ఆమ్లంలో సల్ఫర్ ఉంటుందో, దానిని సిస్టైన్ అని అంటారు. గ్లూటాతియోన్ అనే పదార్ధం తయారవడానికి ఈ సిస్టైన్ చాలా అవసరం. సమర్ధవంతమైన యాంటీ యాక్సిడెంట్ గా గ్లూటాతియోన్, తన బాధ్యత నిర్వహిస్తూ కణాలకు ఎటువంటి హానికలగకుండా చూసుకుంటుంది.

ఏ రకమైన ఆహారంలో సల్ఫర్ ఉంటుందో, అటువంటి ఆహారం తీసుకోవడం వల్ల మన శరీరంలో సల్ఫర్ స్థాయిలు పెరుగుతాయి. ఏ ఆహారాల్లో సల్ఫర్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.

1. గుడ్లు :

1. గుడ్లు :

గుడ్లలో ప్రోటీన్లు మాత్రమే అధికంగా ఉంటాయి అని అనుకున్నట్లైతే పొరబడినట్లే. గుడ్డు యొక్క తెల్లటి సొనలో సల్ఫర్ ఖనిజం అత్యధికంగా లభ్యం అవుతుంది. తెల్లటి సొనలో 0.195 మిల్లి గ్రాముల సల్ఫర్ ఉంటుంది మరియు గుడ్డు లోపల ఉండే పసుపుపచ్చ సొనలో 0.016 మిల్లి గ్రాముల సల్ఫర్ ఉంటుంది. ఉడికించిన గుడ్లను ఆహారంగా స్వీకరించడం వల్ల ఈ ఖనిజాన్ని అధికంగా మన శరీరానికి అందించవచ్చు.

2. సల్ఫర్ అధికంగా లభించే కూరగాయలు :

2. సల్ఫర్ అధికంగా లభించే కూరగాయలు :

వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, ఉల్లి కాడలు మరియు కేసరము లాంటి కూరగాయల్లో సల్ఫర్ అత్యధికంగా లభిస్తుంది. వీటిల్లో ఉండే సేంద్రీయ సమ్మేళనం పెద్దప్రేగు, ఊపిరితిత్తులు మరియు ఆహార నాళము ప్రాంతంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా అడ్డుకుంటుంది. శరీరానికి క్యాన్సర్ సోకకుండా అడ్డుకొనే ఒక శక్తిగా కూడా ఇది పనిచేస్తుంది.

3. అవిసె గింజలు :

3. అవిసె గింజలు :

అవిసె గింజ ల్లో ఆరోగ్యవంతమైన గుణాలు ఎన్నో ఉన్నాయి. ప్రమాదకరమైన వ్యాధులు ఏవి శరీరానికి అంటకుండా ఇవి నిరోధిస్తాయి. అవిసె గింజలుల్లో సల్ఫర్ మరియు ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ అత్యధికంగా లభిస్తాయి. అవిసె గింజల లో ఉండే సల్ఫర్ లో ఉండే ఎమినో ఆమ్లాల వల్ల మెదడు మరియు కాలేయం సరైన పద్దతితో పనిచేసేలా చేస్తుంది.

4. వాల్ నట్స్ (అక్రోటుకాయ) :

4. వాల్ నట్స్ (అక్రోటుకాయ) :

మెదడుకు అవసరమయ్యే ఆహారాల్లో వాల్ నట్స్ కూడా ఒకటి. వీటిల్లో సల్ఫర్ లభిస్తుంది మరియు చెడు కొవ్వుని తగ్గించడానికి, జీర్ణక్రియను పెంచడానికి మరియు మధుమేహ వ్యాధి రాకుండా ఉండటానికి అవసరమయ్యే ఖనిజాలను ఇది శరీరానికి అందిస్తుంది. వాల్ నట్స్ లో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కె మరియు ఎన్నో రకాల అవసరమైన విటమిన్లు ఉన్నాయట.

5. మాంసాహారం :

5. మాంసాహారం :

సాధారణంగా ప్రతి మాంసాహారంలో కూడా సల్ఫర్ లభిస్తుంది. కానీ, బీఫ్ మరియు గొర్రె, పొట్టేలు మాంసంలో సల్ఫర్ స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి. కోడి మరియు చేపల్లో కూడా సల్ఫర్ బాగానే లభిస్తుంది. వారానికి ఒక్కసారైనా మాంసాహారాన్ని తీసుకోడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల మీ శరీరానికి అవసరమయ్యే సల్ఫర్ లభిస్తుంది.

6. చిక్కుళ్ళు :

6. చిక్కుళ్ళు :

చిక్కుళ్ళు లో సల్ఫర్ చాలా బాగా లభిస్తుంది. ఎండిన బీన్స్, సొయా బీన్స్ మరియు కాయధాన్యాలుల్లో సల్ఫర్ అత్యధికంగా ఉంటుంది. ఈ చిక్కుళ్ళు వల్ల మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది మరియు శరీరంలో కణాలను దెబ్బ తినకుండా రక్షిస్తుంది. సల్ఫర్ మిగతా ఎంజైమ్స్ తో కలిసి పనిచేస్తుంది మరియు శరీరంలో చోటుచేసుకునే కొన్ని రకాల ప్రక్రియలకు సహాయం చేస్తుంది.

7. క్యాబేజ్ కుటుంబానికి చెందిన కాయగూరలు :

7. క్యాబేజ్ కుటుంబానికి చెందిన కాయగూరలు :

బ్రోకలీ, క్యాలీఫ్లవర్, క్యాబేజ్ మరియు ఇతర క్యాబేజీ కుటుంబానికి చెందిన కాయగూరల్లో సల్ఫర్ అధికమొత్తంలో లభిస్తుంది. ఇలాంటి కాయగూరల్లో ఉండే సల్ఫర్ శరీరానికి కొన్ని రకాల క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది.

8. పాల పదార్ధాలు:

8. పాల పదార్ధాలు:

పాలు, పెరుగు మరియు ఉప్పగా ఉండే క్రీము వంటి పాల పదార్ధాల్లో సల్ఫర్ ఎంతో బాగా దొరుకుతుంది. రెండు కణజాలాల మధ్య సంబంధం ఏర్పరచడానికి మరియు కీళ్లు సరైన పద్దతిలో పనిచేయడానికి మరియు పనిచేసేలా వృద్ధి చెందడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. మీరు ప్రతిరోరోజు తీసుకొనే ఆహారంలో పాల పదార్ధాలు తీసుకున్నట్లైతే, మీకు సల్ఫర్ లోపం తలెత్తదు.

9. పండ్లు :

9. పండ్లు :

మీరు అందరూ ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే, మనం తినే పండ్లలో కూడా సల్ఫర్ లభిస్తుంది. పండ్లన్నింటిలో సల్ఫర్ ఉంది అనుకుంటే పొరబడినట్లే. అరటిపండు, పుచ్చకాయ మరియు కొబ్బరి కాయలో సల్ఫర్ అధికంగా లభిస్తుంది. ఈ రకమైన ఆహారం తీసుకోవడం వల్ల మీ శరీరంలో సల్ఫర్ శాతం విపరీతంగా పెరుగుతుంది.

10. సముద్రపు ఆహారం :

10. సముద్రపు ఆహారం :

డిప్పలు,ఎండ్రకాయలు, పీతలు మొదలగు సముద్రపు ఆహారంలో సల్ఫర్ అత్యధికంగా ఉంటుంది. పది ఆవిరి పై ఉడికించిన డిప్పలు లో 510 గ్రాముల సల్ఫర్ ఉంటుంది. మీకు గనుక సముద్రపు ఆహారం ఇష్టమైతే, మీరు సల్ఫర్ గురించి అస్సలు చింతించాల్సిన అవసరం లేదు. కానీ, ఎవరికైతే సముద్రపు ఆహారం అంటే పడదో, అటువంటి వారు ఇతర మాంసాహారాన్ని తీసుకోవచ్చు.

English summary

Top 10 Foods High In Sulphur

Sulphur plays a major role in the functioning of the joint cartilage and liver metabolism. Not many people know that sulphur helps to build amino acids and vitamins; and it is critical to healthy development of bones, nerve cells and tissues. A sulphur deficiency could lead to reduced protein synthesis.
Desktop Bottom Promotion