For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విరాట్ కోహ్లీ శాకాహారిగా మారాడు. శాకాహారిగా మారడం వలన కలిగే ప్రయోజనాలేమిటి?

విరాట్ కోహ్లీ శాకాహారిగా మారాడు. శాకాహారిగా మారడం వలన కలిగే ప్రయోజనాలేమిటి?

|

భారత జాతీయ క్రికెట్ జట్టుకు చెందిన క్రికెటర్ మరియు కెప్టెన్ అయిన విరాట్ కోహ్లి ప్రస్తుతం శాకాహార ఆహార ప్రణాళికను అవలంభిస్తున్నట్లు చెప్పడం జరిగింది. మరియు కొన్ని ఆధారాల ప్రకారం, ఈ ఆహార ప్రణాళిక కారణంగా తన ఆరోగ్యం మాత్రమే కాకుండా తన ఆటలో నైపుణ్యం కూడా మెరుగుపడిందని చెప్పబడింది. మాంసాహారం నుండి శాకాహార ఆహార ప్రణాళికకు మారడం కారణంగా తన బలం మరియు జీర్ణశక్తి అధికంగా పెరిగినట్లుగా కూడా చెప్పబడింది. విరాట్ కోహ్లి మాత్రమే కాకుండా, సెరీనా విలియమ్స్, లెవిస్ హామిల్టన్ మరియు హెక్టర్ బెల్లెరిన్ వంటి ఆటగాళ్ళు అనేకమంది శాకాహార ఆహార ప్రణాళికను అనుసరిస్తున్నారు.

ఈ మొక్క ఆధారిత ఆహార ప్రణాళిక, విరాట్ కోహ్లీ యొక్క స్వభావం మీద కూడా ప్రభావవంతంగా పని చేసింది. అతని కోపం స్థాయిలు తగ్గడానికి మరియు మానసికంగా ఉల్లాసంగా ఉండేందుకు ఎంతగానో సహాయం చేసింది. విరాట్ తన ఆహార ప్రణాళికలో మాంసం, గుడ్లు మరియు పాల ఉత్పత్తులకు బదులుగా ప్రోటీన్ షేక్స్, సోయ మరియు కూరగాయలను కలిగి ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు.

Virat Kohli Turns Vegan And Here’s Why You Should Do It Too

ఇక్కడ ఒక శాకాహార ఆహార ప్రణాళిక అథ్లెటిక్ జీవన శైలిని మరియు ఆట నైపుణ్యాలను ఎలా ప్రభావితం చేస్తుంది ? అన్న విషయం గురించి పూర్తిగా తెలుసుకోవలసి ఉంటుంది. శాకాహార ఆహార ప్రణాళికలో కొన్ని పాడి మరియు మాంసం ఉత్పత్తులను మినహాయించి, అధికంగా మొక్క ఆధారిత ఉత్పత్తులను తీసుకోవడం ద్వారా BMI నిర్వహించవలసి ఉంటుంది.

మీరు ఆరోగ్యమైన మరియు సన్నని శరీరాన్ని పొందాలంటే, మీ శాకాహార ఆహార ప్రణాళికలో భాగంగా క్రింది పోషకాలను చేర్చండి.

1. ప్రోటీన్ :

1. ప్రోటీన్ :

ప్రోటీన్ యువ క్రీడాకారులకు, కండరాలను నిర్మించడానికి మరియు మరమ్మత్తు చేయడంలో కీలక పాత్రను పోషిస్తుంది. ఇది మాక్రోన్యూట్రియెంట్లలో ఒకటిగా ఉంటుంది. అథ్లెట్లకు మరియు అథ్లెట్లు కాని వారికి కూడా ప్రోటీన్, ఒక లీన్ బాడీ మాస్ అందిస్తుంది. మీరు కండరాల మరమ్మతు మరియు ఆరోగ్యకర కండరాల పెరుగుదలను కోరుకునే వారైతే, వ్యాయామం తర్వాత రెండు గంటల లోపునే అధిక నాణ్యత గల ప్రోటీన్ ఆహార పదార్ధాలను తీసుకొనవలసి ఉంటుంది.

బలమైన కండరాల కోసం, గింజలు మరియు నట్ బట్టర్స్, విత్తనాలు, బీన్స్ మరియు కాయ ధాన్యాలు, టోఫు, సోయా పాలు, తృణ ధాన్యాలు, మరియు ప్రోటీన్ బార్ వంటి మాంసకృత్తులు కలిగిన శాఖాహార వనరులు మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా ఉన్నాయి.

2. విటమిన్ B12 :

2. విటమిన్ B12 :

ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకుల ప్రకారం, B విటమిన్లు సరైన స్థాయిలో లేని అథ్లెట్లు అధిక వ్యాయామాన్ని చేయలేకపోవడమే కాకుండా, దెబ్బతిన్న కండరాలను మరమ్మత్తు, లేదా సరైన కండరాల ద్రవ్యరాశిని నిర్మించలేకపోతున్నారని కనుగొన్నారు. అంతేకాకుండా, విటమిన్ B12 యొక్క లోపం అలసటకు కారణం కావచ్చు, ఇది ఒక అథ్లెట్ యొక్క పనితీరును ప్రభావితం చేస్తుంది.

విటమిన్ B12 యొక్క శాఖాహార వనరులుగా సోయ, బాదం పాలు, బియ్యం, ప్రోటీన్ బార్లు, తృణ ధాన్యాలు మరియు బీన్స్ ఉన్నాయి.

Most Read:మీరు ఊహించని ఈ పది కారణాలు కూడా మలబద్దకానికి దారితీయొచ్చు Most Read:మీరు ఊహించని ఈ పది కారణాలు కూడా మలబద్దకానికి దారితీయొచ్చు

3. కాల్షియం :

3. కాల్షియం :

అథ్లెట్లకు ప్రధానంగా అవసరమైన మైక్రో న్యూట్రియంట్లలో ముఖ్యమైనది కాల్షియం. బలమైన ఎముకలు మరియు దంతాల నిర్మాణానికి సహాయపడే కాల్షియం, ముఖ్యంగా మహిళా అథ్లెట్లకు ముఖ్యమైన ఖనిజంగా ఉంది. ఇది కండరాల సంకోచం మరియు సడలింపులో కీలక పాత్ర పోషిస్తుంది. మీ కండరములు సంకోచానికి గురైనప్పుడు, కాల్షియం, మజిల్ ఫైబర్తో కలుపబడుతుంది. కండరాల సడలింపుతో, విశ్రాంతి స్థితికి తిరిగి వచ్చేందుకు అనుమతించే ఫైబర్ నుండి కాల్షియం తిరిగి వెనుకకు పంప్ చేయబడుతుంది.

ఈ ఖనిజం యొక్క లోపం వలన కండరం తిప్పడం మరియు తిమ్మిరి ఏర్పడడం జరుగుతుంది. శాఖాహారులకు కాల్షియం అధికంగా ఉండే ఆహారాలుగా మొక్క ఆధారిత పాలు, టోఫు, కాల్షియం ఫోర్టిఫైడ్ జ్యూస్, ఆకుపచ్చ ఆకు కూరలు మరియు బ్రోకలీ ప్రధానంగా ఉన్నాయి.

4. విటమిన్ D :

4. విటమిన్ D :

అథ్లెట్స్ ప్రదర్శనను మెరుగుపరచడంలో సహాయపడే మరొక సూక్ష్మ పోషకాహారంగా విటమిన్ డి ఉంది. విటమిన్ -డి తగినంత మొత్తంలో శరీరంలో ఉన్న ఎడల, వాపు, మంట మొదలైనవి త్వరితగతిన తగ్గుముఖం పడుతాయి. స్ట్రెస్ ఫ్రాక్చర్ తగ్గడంతో పాటు, మరియు కండరాల పనితీరు క్రమబద్దీకరించబడుతుంది. అథ్లెట్లు బహిరంగ శిక్షణ పొందడం ద్వారా విటమిన్ -డి పొందడం సులభంగా ఉంటుంది. బచ్చలి కూర, కాలే, సోయాబీన్స్ మరియు కొల్లార్డ్ ఆకుకూరల నుండి విటమిన్ -డి ను తగిన మొత్తంలో పొందవచ్చు.

Most Read:ఆమె నాకు హస్త ప్రయోగం చేసింది, వీర్యం అంటిన చేతిని యోనిలో పెట్టుకుంది, ప్రెగ్నెన్నీ వస్తుందాMost Read:ఆమె నాకు హస్త ప్రయోగం చేసింది, వీర్యం అంటిన చేతిని యోనిలో పెట్టుకుంది, ప్రెగ్నెన్నీ వస్తుందా

5. ఐరన్ :

5. ఐరన్ :

ఐరన్ మీ అథ్లెటిక్ పనితీరును ఎలా మెరుగుపరుస్తుంది ?

వాస్తవానికి ఐరన్, రక్త కణాలకు ప్రాణవాయువును సరైన మోతాదులో అందిస్తుంది, అంతేకాకుండా మీరు మైదానంలో ఉత్తమ ప్రదర్శన ఇచ్చే క్రమంలో మెరుగైన శక్తిని అందివ్వగలుగుతుంది. చెమట ద్వారా చిన్న మొత్తంలో ఐరన్ కోల్పోవడం జరుగుతుంది, సరైన మోతాదులో ఐరన్ శరీరానికి అందివ్వని ఎడల, ఐరన్ లోపంతో కూడిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఐరన్ లోపంతో భాదపడుతున్న అథ్లెట్లు అధిక వ్యాయామాలను, పనులను చేయలేరు మరియు సరైన హృదయ స్పందనలను కలిగి ఉండరు కూడా.

ముదురు ఆకుపచ్చ ఆకు కూరలు, కాయ ధాన్యాలు మరియు తృణ ధాన్యాలు, నట్స్ మరియు ప్రూనే వంటి ఐరన్-రిచ్ శాఖాహార ఆహారాలను తీసుకోవడం ద్వారా సరైన మోతాదులో ఐరన్ నిల్వలను శరీరానికి అందివ్వగలరు.

 అథ్లెట్లకు సూచించదగిన శాఖాహార ఆహార ప్రణాళిక :

అథ్లెట్లకు సూచించదగిన శాఖాహార ఆహార ప్రణాళిక :

ఉదయం అల్పాహారం : 4 నుండి 5 బాదం మరియు బ్లాక్ కాఫీతో కూడిన వెజిటబుల్ శాండ్విచ్.

లంచ్ : మిశ్రమ కూరగాయలు, పప్పు మరియు బ్రోకలీ సలాడ్ మరియు 1 చపాతి.

సాయంత్రం స్నాక్స్ : గ్రీన్ టీ మరియు రైస్ ఫ్లేక్స్ (డైట్ చిడ్వా)తో ఆపిల్, కివి మరియు అరటి పండు.

డిన్నర్ : కూరగాయల సూప్ మరియు బ్రోకలీ సలాడ్ / కూరగాయల సలాడ్తో పాటుగా 1 చిన్న గిన్నె నిండా బ్రౌన్ రైస్

Most Read:నా గర్ల్ ఫ్రెండ్ నాతో సరసాలాడుతూనే మరో అతనితో ఎంజాయ్ చేస్తుంది, ఏం చెయ్యమంటారు?Most Read:నా గర్ల్ ఫ్రెండ్ నాతో సరసాలాడుతూనే మరో అతనితో ఎంజాయ్ చేస్తుంది, ఏం చెయ్యమంటారు?

English summary

Virat Kohli Turns Vegan And Here’s Why You Should Do It Too

Virat Kohli's vegan diet consists of protein shakes, soy and vegetables instead of meat, eggs and dairy products. How does a vegan diet affect athletic performance? As vegan diet excludes certain dairy and meat products, it helps athletes and non-athletes maintain a leaner physique with a low to average body mass index (BMI).
Desktop Bottom Promotion