For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విటమిన్ బి 1 అధికంగా వున్న ఇండియన్ ఫుడ్స్ మరియు వాటి బెనిఫిట్స్!

మీకు కావాల్సిన శక్తిని అందిస్తూ మరియు సెల్ ని ఆరోగ్యంగా కాపాడుకోవడంలో విటమిన్ B కీలక పాత్ర పోషిస్తుందని మీకు తెలుసా? అన్ని రకాల విటమిన్ బి ఒకే విధమైన పనితీరును కలిగి వుండవు, అదనంగా వివిధ రకాలైన విటమి

By Ashwini Pappireddy
|

మీకు కావాల్సిన శక్తిని అందిస్తూ మరియు సెల్ ని ఆరోగ్యంగా కాపాడుకోవడంలో విటమిన్ B కీలక పాత్ర పోషిస్తుందని మీకు తెలుసా? అన్ని రకాల విటమిన్ బి ఒకే విధమైన పనితీరును కలిగి వుండవు, అదనంగా వివిధ రకాలైన విటమిన్ B వివిధ రకాల ఆహార పదార్థాల నుండి లభిస్తాయి.

విటమిన్ బి 1 ని థియామిన్ అని కూడా పిలుస్తారు, శరీరానికి ఆహారాన్ని జీవక్రియ చేయడానికి మరియు హృదయ ఆరోగ్యం కోసం మరియు నరాల పని తీరుని నిర్వహించడానికి శరీరం చేత ఉపయోగించబడే కో-ఎంజైమ్.

థియామిన్ నిఇతర B విటమిన్ల తోకలిపి కూడా ఉపయోగిస్తారు, ఇది హృదయనాళ వ్యవస్థ, ఎండోక్రైన్ వ్యవస్థ మరియు జీర్ణ వ్యవస్థ యొక్క ముఖ్యమైన విధులు నిర్వహించడానికి బి- విటమిన్ కాంప్లెక్స్ తయారు చేయబడి ఉంటాయి.

ఒకవేళ మీ శరీరంలో తగినంత థయామిన్ లేకపోతే, ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్లలో నిండివున్న అణువులను వివిధ ముఖ్యమైన విధులను నిర్వహించడానికి సరిగా ఉపయోగించుకోలేదు.

కాబట్టి, మీకు థయామిన్ లోపం ఉంటే, మీరు క్రానిక్ ఫెటీగ్, హృదయ సమస్యలు, బలహీనత మరియు నరాల దెబ్బతినటంతో బాధపడుతుంటారు. అందువల్ల మీ శరీరానికి విటమిన్ బి 1 ను తగినంతగా పొందడం అవసరం.

ఇప్పుడు అసలు ఈ థయామిన్ ఎక్కడ దొరుకుతుందో మరియు విటమిన్ బి 1 అధికంగా వున్న ఇండియన్ ఫుడ్స్ యొక్క 13 ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

విటమిన్ బి 1 అధికంగా వున్న ఇండియన్ ఫుడ్స్

1. నట్స్

1. నట్స్

నట్స్ దట్టమైన పోషకాహారాలు మరియు విటమిన్ బి 1 లతో నిండి ఉంటాయి. పిస్తాపప్పులు, బ్రెజిల్ గింజలు, పెకన్లు మరియు జీడిపప్పు వంటి నట్స్ విటమిన్ బి 1 అధికంగా ఉంటాయి. కాబట్టి, మీ అనారోగ్యానికి కారణమైన స్నాక్స్ ని మానేసి వాటికి బదులుగా విటమిన్ బి 1 పెంచడంలో సహాయపడే నట్స్ ని తినడం ప్రారంభించండి.

2. చేప

2. చేప

చేపలు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి మరియు థియామిన్ లేదా విటమిన్ బి 1 కి మంచి మూలం గా చెప్పవచ్చు. ట్యూనా చేపల్లో విటమిన్ బి 1 యొక్క అత్యధిక స్థాయిలు ఉంటాయి. ఇవి రోజువారీ మీ శరీరానికి అవసరమైన 35 శాతం కంటే ఎక్కువగా విటమిన్ ని అందిస్తాయి. సాల్మోన్ మరియు మేకరేల్ చేపలు వరుసగా 19 శాతం మరియు 9 శాతం వరకు విటమిన్ బి 1 ని కలిగి ఉంటాయి.

3. లీన్ పోర్క్

3. లీన్ పోర్క్

లీన్ పోర్క్ అనేది నాన్ వెజ్ లో విటమిన్ బి 1 ముఖ్యమైన మూలంగా చెప్పవచ్చు. 100 గ్రాముల ఈ మాంసంలో మీ రోజువారీ అవసరం కన్నా 74 శాతం విటమిన్ బి 1 ని అందిస్తుంది. లీన్ పోర్క్ లోయిన్, లీన్ పోర్క్ టెండర్లోయిం మరియు లీన్ పంది చాప్స్ లో థయామిన్ గణనీయమైన మొత్తంలో లభిస్తుంది.

4. ( గ్రీన్ పీస్) బఠానీ

4. ( గ్రీన్ పీస్) బఠానీ

మీరు బఠానీ ని తినడానికి ఇష్టపడితే, అవి విటమిన్ బి 1 ని అందించడంలో మీకు మంచి వనరులని మీకు మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అవును మీరు రోజు 100 గ్రాముల వండిన బఠానీ ని సేవించడం వలన ఇవి మీకు 19 శాతం వరకు విటమిన్ బి 1 ను అందిస్తాయి. తాజా బఠానీ ని తీసుకోవడం వలన మీ రోజువారీ మీ శరీరానికి అవసరమైన విటమిన్ బి 1 ని 28 శాతం మీకు అందిస్తుంది.

5. స్క్వాష్

5. స్క్వాష్

స్క్వాష్ అనేది విటమిన్ బి 1 యొక్క మంచి మూలం మరియు విటమిన్ బి 1 యొక్క ఉత్తమ మూలం అకార్న్ స్క్వాష్, కేవలం 100 గ్రాముల సేకరణలో 11 శాతం విటమిన్ బి 1 ని అందిస్తుంది. స్క్వాష్ లో వుండే ఇతర రకాలలో కూడా విటమిన్ బి 1 కలిగి ఉంటాయి, కానీ ఇది మీకు 10 శాతం థియామిన్తో అందిస్తుంది.

6. బీన్స్

6. బీన్స్

ఆకుపచ్చ బీన్స్, నలుపు బీన్స్ వంటి దాదాపు అన్ని రకాలైన బీన్స్, విటమిన్ బి 1 మరియు గుండె-ఆరోగ్యకరమైన ప్రోటీన్ల అధిక స్థాయిలో ఉంటాయి. మీరు విటమిన్ బి 1 ని సులభంగా పొందడానికి బీన్స్ ని ఉడికించి మీకు నచ్చిన ఈ సలాడ్లలో మరియు సూప్స్ లలో కూడా వాడుకోవచ్చు.

7. విత్తనాలు(సీడ్స్)

7. విత్తనాలు(సీడ్స్)

వివిధ రకాల విత్తనాలు కూడా విటమిన్ బి 1 యొక్క మంచి వనరులుగా ఉన్నాయి. ఉదాహరణకి, సన్ ఫ్లవర్ విత్తనాలు వివిటమిన్ బి 1 యొక్క అత్యధిక సాంద్రత కలిగి ఉంటాయి,100 గ్రాముల ఈ విత్తనాలలో 99 శాతం విటమిన్ బి 1 కలిగి ఉంటాయి. సీసమ్ విత్తనాలు విటమిన్ బి 1 యొక్క 80 శాతం మరియు చియా విత్తనాలు మరియు గుమ్మడి గింజలు వంటివి కూడా థయామిన్లో అధికంగా ఉంటాయి.

8. ఆస్పరాగస్

8. ఆస్పరాగస్

ఆస్పరాగస్ విటమిన్ బి 1 యొక్క మంచి మూలం. వండిన 100 గ్రాముల ఆస్పరాగస్ లో 11 శాతం థియామిన్ అందిస్తుంది. ఇంకా ఎక్కువ కాలం నిల్వ చేసిన మరియు రెఫ్రిజిరేటర్ ఉంచిన ఆకుకూరలలో ఈ విటమిన్ తక్కువ మొత్తంలో ఉంటుంది, కనుక మీరు ఎల్లప్పుడూ తాజా ఆకుకూరలని వాడేలా చూసుకోండి.

9. బ్రెడ్

9. బ్రెడ్

గోధుమ పిండితో చేసిన బ్రెడ్ లో విటమిన్ బి 1 యొక్క గణనీయమైన మొత్తంలో ఉంటుంది. ఒక రొట్టె ముక్క లో విటమిన్ బి 1 9 శాతం కలిగి ఉంది.గోధుమ బాగెల్, మఫిన్లు మరియు రై బ్రెడ్ లలో కూడా థియామిన్ కి మంచి మూలంగా చెప్పవచ్చు.

థయామిన్ లేదా విటమిన్ బి 1 వలన మనకి తెలియని అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా...

10. ఇది ఆరోగ్యకరమైన జీవక్రియని నిర్వహిస్తుంది

10. ఇది ఆరోగ్యకరమైన జీవక్రియని నిర్వహిస్తుంది

థియామిన్ కార్బోహైడ్రేట్లను గ్లూకోజ్గా మార్చడంలో సహాయపడుతుంది, ఇది శరీర శక్తిని ఉపయోగించే ఒక శక్తి వనరు లాంటిది. ఇది ప్రోటీన్లు మరియు కొవ్వులని విడగొట్టడంలో కూడా సహాయపడుతుంది, అందువలన మీ శక్తి మరియు జీవక్రియను పెంచుతుంది.

11. నరాల డామేజ్ ని నిరోధిస్తుంది

11. నరాల డామేజ్ ని నిరోధిస్తుంది

థియామిన్ నరాల మరియు మెదడు డామేజ్ ని నిరోధిస్తుంది. ఇది ఆహారం నుండి ఫ్యూయల్ తెస్తుంది మరియు నాడీ వ్యవస్థకు తీసుకువెళుతుంది, తద్వారా సరైన మెదడు పని తీరుని మరియు నరాల వ్యవస్థను నిర్వహిస్తుంది. విటమిన్ బి 1 నరాల డామేజ్ ని మరింత తగ్గిస్తుంది.

12.హృదయం ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది.

12.హృదయం ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది.

థియామిన్ గుండెకి సంబంధించిన వ్యాధులతో పోరాడటంలో సహాయపడుతుంది మరియు గుండెని

ఆరోగ్యంగా ఉంచుతుంది. హృదయ స్పర్శ పోరాటంలో థియామిన్ ఉపయోగకరంగా ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి, ఎందుకంటే ఇది ఆరోగ్యకరమైన జఠరిక పనితీరును నిర్వహించడానికి సహాయపడుతుంది మరియు గుండె వైఫల్యాన్ని పరిగణిస్తుంది.

13. ఇమ్మ్యునిటీని పెంచుతుంది

13. ఇమ్మ్యునిటీని పెంచుతుంది

జీర్ణ ఆరోగ్యం థయామిన్ శోషణకు ముఖ్యమైనది ఎందుకంటే ఆరోగ్యవంతమైన జీర్ణవ్యవస్థ మీ శరీరాన్ని మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ఉపయోగించే ఆహారం నుండి పోషకాలను సేకరించేందుకు అనుమతిస్తుంది. వివిధ రకాల అంటురోగాల నుండి అనారోగ్యాన్ని నివారించడానికి విటమిన్ బి 1 కూడా సహాయపడుతుంది....

English summary

Vitamin B1 Rich Indian Foods & Their Benefits

Vitamin B1, which is also referred to as thiamine is a co-enzyme used by the body to metabolise the food for energy and maintain heart health and nerve function. Thiamine is also used in combination with other B vitamins, which make up the B-vitamin complex to manage the important functions of the cardiovascular system, endocrine system and digestive system.
Story first published:Monday, January 29, 2018, 11:52 [IST]
Desktop Bottom Promotion