For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవిలో ఖర్జూర పండును తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు?

వేసవిలో ఖర్జూర పండును తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు?

|

వేసవి కాలం వచ్చేసింది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ సమయంలో మిమ్మల్ని హైడ్రేటెడ్ గా ఉంచే ఆహారాన్ని అలాగే పానీయాలను తీసుకోవాలి. ఖర్జూర పండ్లు (డేట్స్) శరీరంలోని వేడిని పెంచుతాయని అంటుంటారు. అందుకే, వీటిని శీతాకాలంలో తీసుకోవాలని చెప్తారు. అయితే, వేసవిలో ఖర్జూర పండ్లను తీసుకోవచ్చా?

అబ్డోమినల్ క్యాన్సర్ ప్రమాదాన్ని అరికట్టే సామర్థ్యం డేట్స్ లో ఉంది. ఇస్లాం మతస్తులు డేట్స్ ను నీళ్లతో తీసుకోవడం ద్వారా తమ ఉపవాసాన్ని విరమిస్తారు.

డైజెస్టివ్ ప్రాసెస్ ను రెగ్యులేట్ చేసేందుకు డేట్స్ ఉపయోగకరంగా ఉంటాయి. ఈ తీయటి పండ్లలో రుచితో పాటు ఔషధ గుణాలు నిండి ఉన్నాయి. వీటిని తీసుకున్న అరగంటలోపలే ఎనర్జీ లెవల్స్ పెరగడాన్ని మనం గుర్తించవచ్చు. రోజుకు కనీసం 20-35 గ్రాముల డైటరీ ఫైబర్ ను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ స్పష్టం చేస్తోంది.

What Are The Benefits Of Eating Dates In Summer?

రోజుకు ఒక ఖర్జూర పండును తీసుకోవడం ద్వారా కంటి చూపు మెరుగ్గా ఉంటుంది. అలాగే, రేచీకటి సమస్య కూడా దరిచేరదు.

1. ఎముకలను బలపరుస్తుంది:

1. ఎముకలను బలపరుస్తుంది:

డేట్స్ లో లభించే మినరల్స్ ఎముకలను బలపరించేందుకు తోడ్పడతాయి. తద్వారా, ఓస్టియోపొరోసిస్ వంటి బాధాకరమైన సమస్యల నుంచి రక్షణను అందిస్తాయి. డేట్స్ లో సెలీనియం, మాంగనీజ్, మెగ్నీషియంలతో పాటు కాపర్ వంటి మినరల్స్ లభిస్తాయి. ఇవన్నీ ఆరోగ్యకరమైన బోన్ డెవలప్మెంట్ కు తోడ్పడతాయి. తద్వారా, ఎముకలను ఆరోగ్యంగా అలాగే బలంగా ఉంచుతాయి. డేట్స్ ను తీసుకోవడం ద్వారా ఎముకల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు.

2. ప్రేగుకు సంబంధించిన వ్యాధులను తగ్గిస్తుంది:

2. ప్రేగుకు సంబంధించిన వ్యాధులను తగ్గిస్తుంది:

డేట్స్ లో లభించే నికోటిన్ అనేది అనేక రకాల ఇంటస్టినల్ డిజార్డర్స్ ని తగ్గించేందుకు తోడ్పడుతుంది. రోజూ డేట్స్ ను తీసుకోవడం ద్వారా రోగలక్షణ జీవుల వృద్ధిని అరికట్టవచ్చు. తద్వారా, ప్రేగులో ఫ్రెండ్లీ బాక్టీరియా వృద్ధికి తోడ్పడవచ్చు. డేట్స్ లో సాల్యుబుల్ అలాగే ఇన్ సాల్యుబుల్ ఫైబర్ తో పాటు ఎమినో యాసిడ్స్ లభిస్తాయి. ఇవి డైజేషన్ ను మెరుగుపరుస్తాయి.

3. మలబద్దకాన్ని తగ్గిస్తుంది:

3. మలబద్దకాన్ని తగ్గిస్తుంది:

డేట్స్ అనేవి లాక్సేటివ్ ప్రాపర్టీస్ ను కలిగి ఉంటాయి. అందువలన ఇందులో సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువ మోతాదులో లభిస్తుంది. హెల్తీ బౌల్ మూవ్మెంట్స్ కి ఇది అవసరం. తద్వారా, మలబద్దకం సమస్య తగ్గుతుంది. డేట్స్ ను రాత్రంతా నీటిలో నానబెట్టి మరునాటి ఉదయన్నే తీసుకుంటే ఆశించిన ఫలితాలను పొందవచ్చు.

4. అనీమియా ను తగ్గిస్తుంది:

4. అనీమియా ను తగ్గిస్తుంది:

డేట్స్ లో ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. అనీమియాతో బాధపడుతున్న వారికి డేట్స్ మంచి ఔషధంలా పనిచేస్తాయి. అందువలన, మీరు అనీమిక్ అయితే డేట్స్ ను తీసుకోవడం ద్వారా ఐరన్ డెఫిషియన్సీ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. విపరీతమైన అలసట మరియు నీరసంతో బద్ధకాన్ని తగ్గించి శక్తిని అలాగే ఆసక్తిని పెంపొందిస్తుంది.

5. వెయిట్ గెయిన్ ను ప్రమోట్ చేస్తుంది:

5. వెయిట్ గెయిన్ ను ప్రమోట్ చేస్తుంది:

డేట్స్ లో ప్రోటీన్స్, షుగర్ తో పాటు మరెన్నో ఎసెన్షియల్ విటమిన్స్ అలాగే మినరల్స్ లభిస్తాయి. ఒక కిలోగ్రామ్ డేట్స్ లో 3000 కేలరీలు లభిస్తాయి. వెయిట్ గెయిన్ కై ప్రయత్నించేవారికి డేట్స్ ఉపయోగకరంగా ఉంటాయి. దోసకాయ పేస్ట్ తో డేట్స్ ను తీసుకుంటే ఆరోగ్యకరమైన శరీర బరువును మెయింటైన్ చేయగలుగుతారు.

6. శక్తిని పెంపొందిస్తుంది:

6. శక్తిని పెంపొందిస్తుంది:

ఎప్పుడూ నీరసంగా లేదా బద్ధకంగా అనిపిస్తుందా? డేట్స్ లో ఫ్రక్టోస్, గ్లూకోస్ మరియు సుక్రోస్ వంటి నేచురల్ షుగర్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఈ లక్షణాలని తగ్గిస్తాయి. డేట్స్ ను మధ్యాహ్నపు స్నాక్ గా తీసుకోవడం వలన మంచి ఫలితం పొందవచ్చు. అలాగే జిమ్ లోని వర్కవుట్ సెషన్ తరువాత అలసిపోయిన మీకు డేట్స్ ను తీసుకోవడం వలన తక్షణశక్తి లభిస్తుంది.

7. గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది:

7. గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది:

డేట్స్ అనేవి గుండె ఆరోగ్యాన్ని సంరక్షించే డ్రై ఫ్రూట్స్. పొటాషియం వీటిలో పుష్కలంగా లభిస్తుంది. అందువలన గుండె జబ్బుల బారిన పడే ప్రమాదాన్ని డేట్స్ తగ్గిస్తాయి. డేట్స్ ను తీసుకోవడం వలన శరీరంలోని అధిక బరువు సమస్యకు అలాగే అనేక రకాల గుండె జబ్బులకు దారితీసే LDL కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. వారానికి రెండు సార్లు డేట్స్ ను తీసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు.

8. నెర్వస్ సిస్టమ్ పనితీరును మెరుగుపరుస్తుంది:

8. నెర్వస్ సిస్టమ్ పనితీరును మెరుగుపరుస్తుంది:

డేట్స్ లో లభించే విటమిన్స్ అనేవి నెర్వస్ సిస్టం పనితీరును మెరుగుపరిచేందుకు తోడ్పడతాయి. డేట్స్ లో పొటాషియం అనేది ముఖ్యమైన మినరల్. నెర్వస్ సిస్టమ్ పనితీరుకు ఈ మినరల్ ఎంతగానో తోడ్పడుతుంది. మెదడులోని అలర్ట్ నెస్ ను పెంచుతుంది. బ్రెయిన్ చురుగ్గా ఉండాలని అనుకునే వారు డేట్స్ ను తీసుకోవాలి.

9. డయేరియాను తగ్గిస్తుంది:

9. డయేరియాను తగ్గిస్తుంది:

పండిన డేట్స్ లో పొటాషియం లభిస్తుంది. ఇది డయేరియాను తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. డేట్స్ త్వరగా డైజెస్ట్ అవుతాయి. క్రానిక్ డయేరియాను తగ్గిస్తాయి. వీటిలోనున్న సాల్యుబుల్ ఫైబర్ వలన డయేరియా నుంచి ఉపశమనం లభిస్తుంది.

రోజుకు ఎన్ని డేట్స్ ను తీసుకోవాలి?

రోజుకు ఎన్ని డేట్స్ ను తీసుకోవాలి?

డేట్స్ ను మితంగా తీసుకోవాలి. లేదంటే అదనపు బరువు సమస్య వేధించే ప్రమాదం ఉంది. అందువలన, వెయిట్ లాస్ డైట్ ప్లాన్ లో ఉన్న వారు డేట్స్ ను మితంగా తీసుకోవడాలి. వారానికి ఒకటి లేదా రెండు సార్లు మూడు నుంచి నాలుగు డేట్స్ ను తీసుకోవాలి.

English summary

What Are The Benefits Of Eating Dates In Summer?

Dates are considered useful in preventing abdominal cancer. An intake of 20-35 grams of dietary fibre per day is recommended by the American Cancer Society. It is generally recommended to not have more than two to three pieces of dates during summers. Dates can be a perfect food for summers, but having it in moderate quantities is the key.
Desktop Bottom Promotion