For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు షుగర్‌ అలర్జీ ఏంటో తెలుసా? ఇది ప్రాణాంతకమా?

కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకుంటే కొందరికి పడదు. దాంతో రకరకాల ఇబ్బందులు వ‌చ్చేస్తాయి. ఒంటిపై దద్దుర్లు, పుండ్లు ఏర్పడతాయి. మరి కొందరికి పండ్లు, మిఠాయిల వంటి తీపి పదార్థాలు తింటే అలర్జీ వస్తుంది.

By Krishnadivya P
|

కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకుంటే కొందరికి పడదు. దాంతో రకరకాల ఇబ్బందులు వ‌చ్చేస్తాయి. ఒంటిపై దద్దుర్లు, పుండ్లు ఏర్పడతాయి. మరి కొందరికి పండ్లు, మిఠాయిల వంటి తీపి పదార్థాలు తింటే అలర్జీ వస్తుంది. అంటే వారి ఒంటికి చ‌క్కెర ప‌డ‌క‌పోవ‌డ‌మే కార‌ణం. ఇలా వ‌చ్చే అల‌ర్జీని చ‌క్కెర అల‌ర్జీ (షుగ‌ర్ అల‌ర్జీ) అంటారు.

ఈ చ‌క్కెర అల‌ర్జీతో వ‌చ్చే ప్ర‌ధాన స‌మ‌స్య ఒక్క‌టే! అది ఏ ఆహార ప‌దార్థాలు తింటే వ‌స్తుందో గుర్తించ‌డం క‌ష్టం. ఏదో ఒక ఆహారాన్ని బ‌హిష్క‌రించ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య తీర‌దు. చ‌క్కెర ఉండే మ‌రో ప‌దార్థం తింటే మ‌ళ్లీ స‌మ‌స్య మొద‌ల‌వుతుంది.

అస‌లేమిటీ చ‌క్కెర అల‌ర్జీ

అస‌లేమిటీ చ‌క్కెర అల‌ర్జీ

చ‌క్కెర చాలా ర‌కాల ఆహార ప‌దార్థాలో ఉంటుంది. ముఖ్యంగా మిఠాయిలు, పండ్లు, కొన్ని ర‌కాల కూర‌గాయ‌ల్లో పుష్క‌లంగా ల‌భిస్తుంది. వీటిని గుర్తించ‌డం చాలా క‌ష్టం. ఈ ప‌దార్థాల‌ను తీసుకున్న‌ప్పుడు శ‌రీరానికి సహించ‌దు. వెంట‌నే ప్ర‌తి స్పంద‌న మొద‌ల‌వుతుంది. చ‌ర్మంపై ద‌ద్దుర్లు వంటివి వ‌చ్చేస్తాయి. దేహంలోని రోగ‌నిరోధ‌క వ్య‌వ‌స్థ దీన్ని త‌ప్పుగా అర్థం చేసుకొని హానికారంగా భావించి దాంతో పోరాటం జ‌రుపుకుతుంది. దీని ఫ‌లిత‌మే శ‌రీరంపై ద‌ద్దుర్లు. గుర్తించిన వెంట‌నే వైద్యుడిని సంప్ర‌దించాలి.

ఆ త‌ర్వాత ఏమ‌వుతుంది

ఆ త‌ర్వాత ఏమ‌వుతుంది

చ‌క్కెర‌ను స్వీక‌రించిన త‌ర్వాత రోగ‌నిరోధ‌క వ్య‌వ‌స్థ యాంటీబాడీస్‌ను విడుద‌ల చేసి పోరాటం చేస్తుంది. దీని త‌ర్వాత శ‌రీరంలో ర‌సాయ‌న మార్పులు వ‌స్తాయి. ఇది హిస్ట‌మైన్ స్థాయుల్ని పెంచుతుంది. దాంతో శ‌రీరంపై మంట పుడుతుంది.

ల‌క్ష‌ణాలు ఇవి

ల‌క్ష‌ణాలు ఇవి

శ‌రీరంపై మంట పుడుతుంది. చ‌ర్మంపై చిన్న చిన్న గ‌డ్డ‌లు అవుతాయి. ప‌దేప‌దే త‌ల‌నొప్పి వ‌స్తుంది. ముక్కు కారుతుంది. ముక్కులోని రెండు రంధ్రాలు బిగుతై శ్వాస తీసుకోవ‌డం క‌ష్టంగా మారుతుంది. ఇవ‌న్నీ అంద‌రికీ క‌న‌బ‌డే సాధార‌ణ ల‌క్ష‌ణాలు. వీటితో పాటు మ‌రికొన్ని ప్ర‌త్యేక ల‌క్ష‌ణాలు ఉంటాయి. తిమ్మిర్లు రావ‌డం, ముక్కు కార‌డం, వాంతులు చేసుకోవ‌డం, క‌డుపు నొప్పి, అతిసారం వంటివి వ‌స్తాయి. మ‌న జీవ వ్య‌వ‌స్థ‌లోంచి చ‌క్కెర తొల‌గిపోయే వ‌ర‌కు ఉంటాయి.

కొన్ని సంద‌ర్భాల్లో

కొన్ని సంద‌ర్భాల్లో

చ‌క్కెర అల‌ర్జీ చాలా వ‌ర‌కు అతిగా హాని క‌లిగించ‌దు కానీ కొన్ని సార్లు మాత్రం చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ అల‌ర్జీ వ‌ల్ల కొంద‌రిలో అస్త‌మా ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. శ్వాస తీసుకోవ‌డం చాలా క‌ష్టంగా ఉంటుంది. ఆయాసం క‌లుగుతుంది. విప‌రీతంగా ద‌గ్గు వ‌స్తుంది. గొంతు నొప్పి పుడుతుంది

జాగ్ర‌త్త సుమా!

జాగ్ర‌త్త సుమా!

పైన పేర్కొన్న ల‌క్ష‌ణాల్లో ఏవి క‌నిపించినా వెంట‌నే వైద్యుడిని సంప్ర‌దించ‌డం మంచిది. కొన్ని సార్లు ఈ చ‌క్కెర అల‌ర్జీ అనాఫిలాక్సిస్ కు దారితీయ‌వ‌చ్చు. ఇది ప్రాణాంత‌కంగా మారొచ్చు.

Read more about: sugar allergy food diet
English summary

What Is Sugar Allergy

What is sugar allergy? This allergy is different from the regular food allergies. In some people, eating a food that contains sugar can trigger certain allergic reactions in the body. The main issue with sugar allergy is that it can be tough to identify it as many foods contain sugar. Read this!
Desktop Bottom Promotion