For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పండ్లు తినడానికి మంచి సమయం అంటూ ఉందా?

పండ్లు తినడానికి మంచి సమయం అంటూ ఉందా?

|

రోజులోనా లేదా రాత్రి సమయంలోనా? పండ్లు తినడానికి ఉత్తమ సమయం అంటూ ఉందా? మీరు క్రమంగా బరువు కోల్పోతున్నా లేదా పాలిపోయిన చర్మం కలిగి ఉన్నా, రక్తపోటు, హైపర్ టెన్షన్ లేదా ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా మీకు తోస్తున్న ఎడల, ఈ ప్రశ్న ఖచ్చితంగా మీ మనస్సుకి రావచ్చు.

మనకు ఏదైనా ఆరోగ్య సంబంధ సమస్యలు కలిగి వుంటేనే, పండ్ల వైపు మొగ్గు చూపిస్తుంటాము. ఎందుకంటే అవి పోషకాలు, అనామ్లజనకాలు మరియు ఫ్లేవనాయిడ్లతో నిండి ఉండి శరీరానికి శక్తినిస్తాయి కాబట్టి. పండ్లు, శరీరంలోని ఫ్రీ రాడికల్స్ నష్టాన్ని నిరోధించడానికి మరియు శరీరంలో సోడియం మరియు పొటాషియం వంటి ఖనిజాలను అందించడానికి సహాయం చేస్తాయి.

Best And Worst Time To Eat Fruits

మీ ఆహారంలో పండ్లు చేర్చడం ద్వారా వాటిలోని అధిక ఫైబర్ కంటెంట్ వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కానీ తప్పు సమయంలో వాటిని తీసుకోవడం అనేక ఆరోగ్య సమస్యలను కలిగించవచ్చు కూడా. రోజులో నిర్దిష్ట సమయంలో పండ్ల వినియోగం మీ శరీరంలో సానుకూల లేదా ప్రతికూల ప్రభావాన్ని కలిగి ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

కావున రోజులో ఏ సమయంలో పండ్లు తీసుకోడానికి ఉత్తమంగా ఉంది అని తెలుసుకోడానికి ఈ వ్యాసం దోహదపడుతుంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోషకాహార నిపుణులు రోజువారీ భాగంలో గరిష్టంగా పండ్లను తీసుకునేలా సిఫార్సు చేస్తున్నారు.

పండ్లు తినడానికి మంచి సమయం అంటూ ఉందా?

ఉదయం పూట పండ్లు తీసుకోవడం :
ప్రతిరోజూ ఉదయం, ఖాళీ కడుపుతో ఒక గ్లాసు నీళ్ళతో పండ్లు తీసుకోవడంఅనేది ఉత్తమ సమయం భావించబడినది. పరగడుపున పండ్లు తీసుకోవడం మూలముగా మీ జీర్ణవ్యవస్థ పండ్లను పూర్తిగా జీర్ణం చేసుకోగలిగే శరీరానికి పూర్తి స్థాయిలో పోషకాలను అందించేలా సహాయపడగలదు.
అల్పాహారం ముందు తీసుకోదగిన పండ్లు : పైనాపిల్, పుచ్చకాయ, అరటి, ద్రాక్ష, బెర్రీలు, పియరీ, మామిడి, బొప్పాయి మరియు ఆపిల్.

రెండు భోజనాల మధ్య తీసుకోదగిన పండ్లు :

జీర్ణశక్తి శీఘ్రముగా జరగడం మరియు వేరువేరు ఎంజైమ్లను విడుదల చేస్తున్న కారణంగా రెండు భోజనాల మధ్య సమయము పండ్లు తీసుకోవడానికి అనువైన సమయంగా ఉంటుంది. క్రమంగా పండ్లలోని పోషకాలు సాధారణ చక్కెరలు మరియు ఫైబర్ యొక్క మెరుగైన శోషణ శరీరానికి అందుతుంది. రెండు భోజనాల మధ్య పండ్లు తీసుకోవడం మూలముగా ఎంజైముల కారణముగా సులభంగా జీర్ణమవుతాయి.

అల్పాహారము మరియు మధ్యాహ్నభోజనం సమయానికి మధ్యలో పండ్లు తీసుకోవడం మూలముగా అధిక బరువు నష్టానికి దోహదపడుతుంది. పండ్లలోని ఫైబర్ నిక్షేపాలు కడుపునిండినట్లు చేయడం మూలముగా ఆకలి క్రమంగా తగ్గి ఆహారాన్ని తక్కువగా తీసుకోవడం జరుగుతుంది. క్రమముగా శరీరానికి తక్కువ క్యాలరీలు అందుతాయి. పండ్లు తీసుకోవడానికి మరియు మధ్యాహ్న భోజనానికి మధ్య కనీసం అరగంట వ్యవధి ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.

రెండు భోజనాల మధ్య తీసుకోదగిన పండ్లు: నిమ్మజాతి పండ్లు, పుచ్చకాయలు, పైనాపిల్, దానిమ్మ, ఆపిల్ మరియు మామిడి.

వ్యాయామానికి ముందు మరియు తర్వాత తీసుకోవలసిన పండ్ల వివరాలు :

పండ్లు తినడానికి మరొక ఉత్తమ సమయంగా, వ్యాయామం సమయం ఉన్నది. వ్యాయామానికి ముందు తీసుకునే పండ్లు మీ శరీరానికి చురుకైన వ్యాయామం చేయడానికి సహాయపడే తక్షణ శక్తిని అందివ్వగలదు. అదేవిధంగా వ్యాయామం తరువాత తీసుకునే పండ్లు శరీరంలో కోల్పోయిన శక్తిని తిరిగి పునరుద్ధరించడంలో సహాయపడుతాయి.

ఈ సమయంలో, సహజ చక్కెరలను కలిగిన మరియు అధిక ఫైబర్ నిక్షేపాలు కలిగిన పండ్లు ఉత్తమమైనవిగా సూచించబడుతున్నాయి. ముఖ్యంగా అరటి, మామిడి, ద్రాక్ష, సిట్రస్ పండ్లు, పైనాపిల్, చికూ, దానిమ్మ మరియు పియర్. ఈ పండ్లు వ్యాయామం ముందు మరియు తర్వాత మీ శరీరాన్ని అత్యంత ముఖ్యమైన ఎలెక్ట్రోలైట్స్ మరియు శక్తితో నింపుతాయి.

డిన్నర్ ముందు పండ్లు తీసుకోవడం:

డిన్నర్ తరువాత నిద్రకు ఉపక్రమించే ముందు కన్నా, డిన్నర్ ముందుగానే పండ్లను తీసుకోవడం మూలముగా మంచి ఫలితాలను పొందవచ్చు. పండ్లలోని తక్కువ క్యాలరీల శక్తి మరియు ఎక్కువ ఫైబర్ నిక్షేపాలు ఆకలిని తగ్గించి ఆహారాన్ని తక్కువగా తీసుకునేలా మనసును ప్రేరేపిస్తాయి. రాత్రి వేళలందు తక్కువ ఆహారం తీసుకోమని వైద్యులు కూడా సూచిస్తుంటారు. ముఖ్యముగా పడకకు ఉపక్రమించేముందు రెండు నుండి మూడు గంటల ముందుగానే ఆహారాన్ని తీసుకోవలసినదిగా సూచిస్తుంటారు.

డిన్నర్ ముందు తీసుకోదగిన పండ్లు: పైనాపిల్ మరియు యాపిల్.

ఈ సమయంలో పండ్లు తినడం మంచిది కాదు :

భోజనానికి ముందు లేదా భోజనం చేసిన వెంటనే, లేదా నిద్రకు ఉపక్రమించే ముందుగా పండ్లు తీసుకోవడం మంచిది కాదని చెప్పబడినది.

భోజనం తీసుకున్న వెంటనే పండ్లు తినడం మూలముగా జీర్ణక్రియ సక్రమంగా సాగక అరుగుదల కష్టమవుతుంది. క్రమంగా పండ్ల నుంచి శరీరానికి అందవలసిన పోషకాలు సక్రమంగా అందవు.

మధుమేహం వ్యాధిగ్రస్తులకు: మధుమేహ వ్యాధిగ్రస్తులకు, పండ్లు తీసుకొనే వేళలు కొంచెం భిన్నంగా ఉంటాయి. వీరు భోజనానికి గంట ముందు, మరియు భోజనానికి రెండు గంటల తర్వాతగానీ పండ్లు తీసుకోవడానికి లేదు.

నిద్రకు ఉపక్రమించే ముందు :

అనేక అధ్యయనాల ప్రకారం నిద్రపోయే ముందు పండ్లు తీసుకోవడం సరికాదని చెప్పబడినది. దీని కారణముగా రక్తంలోని చక్కెరస్థాయిలు అసాధారణంగా పెరగడం జరుగుతుంది. మరియు అర్ధరాత్రి సమయాలలో జీర్ణక్రియల కారణముగా, కడుపు ఉబ్బరంగా ఉండడం లేదా జీర్ణరసాలు అన్నవాహిక గుండా నోటిలోనికి రావడం మొదలైన కారణాల వలన నిద్రాభంగం కలిగే అవకాశాలు.

ఆహారంతో కలిపి తీసుకోవడం కూడా సరికాదు :

కొందరికి ఆహారంలో పండ్లను కలిపి తీసుకోవడం మక్కువగా ఉంటుంది. కానీ ఈ పద్ధతి సరైనది కాదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలా భోజనములో పండ్లను కలిపి తీసుకోవడం మూలముగా జీర్ణక్రియలు తగ్గుముఖం పడతాయి. సాధారణ ఆహార పదార్థాల కన్నా పండ్లు జీర్ణమవడంలో కాస్త ఎక్కువ సమయం తీసుకుంటుంది. క్రమముగా అజీర్తి లేదా ఇతర జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతాయి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Best And Worst Time To Eat Fruits

No matter whatever health concern we may have, we always turn to fruits because they are the powerhouse of nutrients, antioxidants and flavonoids. They help prevent free radical damage and provide minerals like sodium and potassium to the body.
Desktop Bottom Promotion