For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ్రీన్ టీ తాగటానికి మంచి సమయం ఏది?

|
Do You Know What Is The Best Time To Drink Green Tea?||గ్రీన్ టీ ఏ టైమ్ కి తాగితే మంచిదో తెలుసా?

గ్రీన్ టీ వల్ల కలిగే అనేక లాభాలు దానికి చాలా పాపులర్ అయ్యేలా చేసాయి. తారలైన కరీనాకపూర్, అనుష్కశర్మ, విరాట్ కొహ్లీ వంటివారు బరువు తగ్గడానికి, శరీరంలో విషపదార్థాలు తొలగిపోవటానికి గ్రీన్ టీ చాలా ఉపయోగకరమని నొక్కి వక్కాణించారు. కానీ దాని లాభాలు మెరుగ్గా పొందటానికి మీకు గ్రీన్ టీ తాగటానికి సరైన సమయమేదో తెలియటం అవసరం.

When Is The Best Time To Drink Green Tea?

గ్రీన్ టీ ఆరోగ్య, ఫిట్ నెస్ రంగంలో ఈమధ్య చాలా పాపులర్ అయింది,జిమ్ కి వెళ్ళే చాలామంది దీన్ని తాగుతారు. దీనిలో ఖనిజలవణాలు, విటమిన్లు, వాపు వ్యతిరేక లక్షణాలు, గుండె సమస్యల రిస్క్ ను తగ్గించే లక్షణాలు, కొన్ని రకాల క్యాన్సర్లను తగ్గించే లక్షణాలు ఉంటాయి.

మీకు గ్రీన్ టీ ఎందుకు మంచిది?

మీకు గ్రీన్ టీ ఎందుకు మంచిది?

ఇతర టీలలా గ్రీన్ టీ ఆక్సిడేషన్ ప్రక్రియకి గురవ్వదు, అందుకే మరింత ఆరోగ్యకరం. సువాసన,హెర్బల్ రకాల గ్రీన్ టీలతో పోలిస్తే, ప్యూర్ గ్రీన్ టీ ప్రాచీనకాలం నుండి ఆరోగ్యానికి మంచిదని వాడుతూ వస్తున్నారని తెలుస్తుంది.

గ్రీన్ టీలో ఉండే శక్తివంతమైన లక్షణాలు చెడ్డ కొలెస్ట్రాల్ ,ట్రైగ్లిసరైడ్లను శరీరంలో తగ్గిస్తాయి. అందులో ఉండే ఫ్లేవనాయిడ్లు, పాలీఫినాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు మీ రోగనిరోధక శక్తిని పెంచి,జలుబు,జ్వరం నుండి దూరంగా ఉంచుతాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు మీ చర్మానికి,జుట్టుకి కూడా మంచివి.

గ్రీన్ టీ తాగటానికి మరి మంచి సమయం ఏది?

గ్రీన్ టీ తాగటానికి మరి మంచి సమయం ఏది?

గ్రీన్ టీని పొద్దున్నే తాగవద్దు

దీనిలో ఉండే అధిక కెఫీన్ వలన ఖాళీ కడుపుపై పొద్దున్నే గ్రీన్ టీ తాగడం వలన కాలేయంపై హానికర ప్రభావం చూపిస్తుంది.

గ్రీన్ టీ పదార్థాలతో కూడిన ఆహార సప్లిమెంట్లపై చేసిన అధ్యయనంలో గ్రీన్ టీని ఖాళీ కడుపుపై తాగితే, కాలేయంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని తేలింది. గ్రీన్ టీలో ఉండే కాటెచిన్స్ అనే సమ్మేళనాల వలన గ్రీన్ టీ ఎంత తాగుతున్నారన్నది గమనిస్తూ ఉండాలి. కాటెచిన్స్ అధిక మొత్తంలో ఉంటే కాలేయం పాడవుతుంది.

గ్రీన్ టీని ఉదయం 10 నుంచి 11 గంటల మధ్యలో లేదా సాయంత్రం తీసుకోండి. ఈ సమయంలో తాగటం వలన మెటబాలిజం పెరుగుతుంది.

భోజనాల మధ్యలో గ్రీన్ టీ తాగటం వలన లాభాలు.

భోజనాల మధ్యలో గ్రీన్ టీ తాగటం వలన లాభాలు.

రెండు భోజనాల సమయాల మధ్య కప్పు గ్రీన్ టీ తాగవచ్చు. ఆహారానికి రెండు గంటల ముందు లేదా తిన్న తర్వాత తాగటం వలన పోషకాలు బాగా శరీరానికి పడతాయి, అలాగే ఐరన్ కూడా చక్కగా పీల్చుకోబడుతుంది.

మీరు రక్తహీనత పేషెంట్ అయితే భోజనాల సమయంలో గ్రీన్ టీ తాగవద్దు. జాతీయ క్యాన్సర్ పరిశోధనా సంస్థ వారి ప్రకారం, గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్ కాటెచిన్స్ జీర్ణక్రియను ఆపేసి, మీ ఆహారం నుంచి ఐరన్ పీల్చుకోకుండా చేస్తాయి.

వ్యాయామం ముందు గ్రీన్ టీ తాగండి

వ్యాయామం ముందు గ్రీన్ టీ తాగండి

వ్యాయామం చేసేముందు గ్రీన్ టీ తాగటం వలన అందులో ఉండే కెఫీన్ మరింత కొవ్వును కరిగేలా చేస్తుంది. కెఫీన్ మీ శక్తిని పెంచటం వలన ఎక్కువ సమయం వ్యాయామం చేయగలుగుతారు.

నిద్రపోయే రెండు గంటల ముందు గ్రీన్ టీ తాగండి

నిద్రపోయే రెండు గంటల ముందు గ్రీన్ టీ తాగండి

మీరు గ్రీన్ టీని నిద్రపోయే ముందు టీలా తాగితే, అది నిద్రపోయే సమయానికి చెందిన పానీయం కాదని గుర్తించండి. ఎందుకంటే అందులో ఉండే కెఫీన్ మీ నిద్రను పాడుచేస్తుంది. ఇందులో ఉండే అమినో యాసిడ్ ఎల్-థియానైన్ మీకు ఏకాగ్రతని పెంచి,నిద్రలేకుండా చేస్తుంది. అందుకని రాత్రి తాగకుండా ఉంటే మంచిది.

రోజుకి ఎన్నిసార్లు గ్రీన్ టీ తాగాలి?

రోజుకి ఎన్నిసార్లు గ్రీన్ టీ తాగాలి?

యూనివర్శిటీ ఆఫ్ మేరీలాండ్ మెడికల్ సెంటర్ ప్రకారం, రోజుకి 2-3 కప్పుల గ్రీన్ టీ లేదా 100 నుంచి 750 మిగ్రాల గ్రీన్ టీ సప్లిమెంట్ రోజుకి సరిపోతుంది. ఎక్కువగా గ్రీన్ టీ తాగటం వలన మీ శరీరంలో అవసరమైన పోషకాలు కూడా బయటకి పంపించేస్తుంది.

English summary

When Is The Best Time To Drink Green Tea?

Drinking green tea on an empty stomach in the morning can have harmful effects on the liver because of the high caffeine content in it. You can drink a cup of green tea in between your meals, preferably two hours before or after eating to maximize your nutrients intake and absorption of iron. Best Time To Drink Green Tea
Story first published: Tuesday, August 21, 2018, 7:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more