For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రపంచ రక్తదాన దినోత్సవం 2018 ; శరీరంలో ఐరన్ పెంచటానికి అరటిపండు,ఖర్జూరాల స్మూతీ

ప్రపంచ రక్తదాన దినోత్సవం 2018 ; శరీరంలో ఐరన్ పెంచటానికి అరటిపండు,ఖర్జూరాల స్మూతీ

|

ఈరోజు ప్రపంచ రక్తదాన దినోత్సవం 2018. ప్రతి ఏడాది, ఈ రోజు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని జరుపుకుంటాయి. ఈ కార్యక్రమం సురక్షితమైన రక్తం,దానికి సంబంధించిన ఉత్పత్తుల అవసరంపై అవగాహన కల్పిస్తూ, స్వఛ్చందంగా రక్తం దానం చేసిన దాతలకి కృతజ్ఞతలు తెలుపుతుంది.

ఈ ఆర్టికల్ లో మేము రక్తం ఇవ్వటానికి ఎలా అరటిపండు, ఖర్జూర స్మూతీ సాయపడుతుందో వివరించబోతున్నాం.

World Blood Donor Day 2018: Banana And Date Smoothie For Increasing Iron In The Body

ప్రపంచ రక్తదాన దినోత్సవ స్లోగన్ “ఇంకొకరికి అండగా నిలబడండి. రక్తం ఇవ్వండి. జీవితాన్ని పంచుకోండి.”

ప్రపంచ రక్తదాన దినోత్సవం ముఖ్యంగా ప్రాథమిక మానవ విలువలైన దయ, సానుభూతి, గౌరవం, కరుణ వంటి వాటిమీద దృష్టి పెడుతుంది, ఎందుకంటే అవే డబ్బులు తీసుకోకుండా రక్తాన్ని డొనేట్ చేయటంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.

రక్తం ఇచ్చేవాళ్ళకి అలసట, తల తేలిపోతున్నట్లు అన్పించడం, రక్తం ఇచ్చాక స్పృహ కోల్పోవటం వంటి సైడ్ ఎఫెక్ట్’స్ ఉండటం వలన వారు ఎక్కువగా ఐరన్ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. సరైన ఆహారం తీసుకోవటం వలన కోల్పోయిన ఐరన్,విటమిన్లు మళ్ళీ శరీరంలో చేరతాయి.

రక్తం ఇచ్చాక ఐరన్ ఉండే ఆహారం ఎందుకు అవసరం?

రక్తం ఇచ్చాక ఐరన్ ఉండే ఆహారం ఎందుకు అవసరం?

మీ రక్తంలో ఐరన్ ఉంటుంది, ఇది కణజాలాలకి ఆక్సిజన్ సరఫరా చేయటానికి అవసరం. శరీరంలో ఐరన్ లేకపోతే,అది ఆరోగ్యకరంగా ఎర్ర రక్తకణాలను ఉత్పత్తి చేయలేదు. అందుకే రక్తం ఇచ్చాక ఐరన్ ఎక్కువ ఉండే స్మూతీలను తాగటం ముఖ్యం.

అరటిపళ్ళు, ఖర్జూరాలు,తేనె వంటి అన్నిట్లో సులభంగా పీల్చుకోగలిగే ఐరన్,ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 ఉంటాయి. ఈ పోషకాలన్నీ రక్తహీనతను నయం చేయటంలో చాలా ఉపయోగపడతాయి. అందుకని రక్తం ఇచ్చాక అరటిపండు,ఖర్జూరాలతో తయారైన స్మూతీ తాగితే శరీరానికి ఐరన్ అందుతుంది.

అరటిపండు,ఖర్జూరాల స్మూతీ ఆరోగ్య లాభాలు

అరటిపండు,ఖర్జూరాల స్మూతీ ఆరోగ్య లాభాలు

అరటిపళ్ళలో వివిధ రకాల విటమిన్లు, ఖనిజలవణాలు అంటే విటమిన్ బి6,మాంగనీస్,విటమిన్ సి,ఆహర పీచు,పొటాషియం, ప్రొటీన్,మెగ్నీషియం,ఫోలేట్ వంటివి ఎన్నో ఉంటాయి.

అరటిపళ్ల లాంటి ఆహారం ఇంకా విటమిన్ బి6 వంటివి రక్తం ఇచ్చిన వెంటనే తీసుకుంటే చాలా లాభాలనిస్తాయి. మీ శరీరానికి ఆరోగ్యకరమైన రక్తకణాలను తయారుచేయటానికి ఈ విటమిన్ అవసరం, ఇది శరీరానికి ప్రొటీన్లను విడగొట్టడానికి కూడా సాయపడుతుంది. రక్తం ఇచ్చాక ప్రొటీన్లలో మీకు కావాల్సిన పోషకాలుంటాయి.

అరటిపళ్ళు జీర్ణక్రియలో, రక్తపోటు తగ్గించటంలో, ఎముకలను ఆరోగ్యంగా ఉంచటం మొదలైనవాటిల్లో సాయపడతాయి కూడా.

మరోవైపు,ఖర్జూరాలు శక్తిని,ఫైబర్ ను, చక్కెరలను అందిస్తాయి.వీటిల్లో అవసరమైన ఖనిజలవణాలు కాల్షియం, పొటాషియం,మెగ్నీషియం,ఫాస్పరస్,జింక్ వంటివి ఉంటాయి. ఖర్జూరాలలో థయామిన్, రిబోఫ్లేవిన్,ఫోలేట్,నియాసిన్,విటమిన్ కె,విటమిన్ ఎ వంటివి ఉంటాయి.

ఖర్జూరాలు కూడా కొలెస్ట్రాల్ తగ్గించటంలో సాయపడి బరువు తగ్గిస్తాయి. వాటిల్లో సహజ చక్కెరలైన గ్లూకోజ్,సుక్రోజ్,ఫ్రక్టోస్ వంటివి ఉంటాయి. అందుకని అరటిపండు,ఖర్జూరాల స్మూతీ కేవలం ఆరోగ్యకరమే కాక,ఈ కాంబినేషన్ రక్తం ఇచ్చాక ఎర్ర రక్తకణాల ఉత్పత్తిలో సాయపడుతుంది కూడా.

ఈ స్మూతీలో కాల్షియం,ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఇ, ఒమేగా 3 ఫ్యాటీయాసిడ్లు వంటివి ఎక్కువగా ఉండే బాదంపాలను కూడా జతచేస్తారు. పాల ఉత్పత్తులకి ప్రత్యామ్నాయంగా బాదంపాలు చక్కగా ఉండి ఏ స్మూతీకైనా బేస్ పదార్థంగా ఉపయోగపడతాయి.

బాదంపాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చి,బరువు తగ్గించడంలో, కొలెస్ట్రాల్ తగ్గించటంలో సాయపడి,మెదడు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.

ఈ స్మూతీలో వేసే మరో పదార్థం దాల్చినచెక్క. ఇది మెదడు పనితీరును మెరుగుపర్చి, గుండె వ్యాధులు రాకుండా చేస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించి,అదనంగా ఉన్న బరువును తగ్గిస్తుంది.

ఐరన్ ను పెంచే అరటిపండు, ఖర్జూర స్మూతీ ఎలా తయారుచేయాలి

ఐరన్ ను పెంచే అరటిపండు, ఖర్జూర స్మూతీ ఎలా తయారుచేయాలి

కావాల్సిన వస్తువులు

1 అరటిపండు

½ కప్పు ఖర్జూరాలు

1 కప్పు బాదంపాలు

½ చెంచా దాల్చిన చెక్క

పద్ధతి

పద్ధతి

అరటిపండును తొక్కతీసి చిన్న ముక్కలుగా తరగండి,వాటిని జ్యూసర్ లో వేయండి.

ఇప్పుడు విత్తనాలు తీసేసి,ముక్కలుగా తరిగిన ½ కప్పు ఖర్జూరాలను కూడా వేయండి.

½ కప్పు బాదంపాలను పోయండి.

ఆఖరుగా అరచెంచా దాల్చిన చెక్క పొడిని కూడా వేయండి. ఇది స్మూతీకి మంచి వాసన,రుచిని అందిస్తుంది.

అన్నిటినీ మిక్సీ పట్టండి. మీ స్మూతీ తయారు.

English summary

World Blood Donor Day 2018: Banana And Date Smoothie For Increasing Iron In The Body

The World Blood Donor Day slogan is 'Be there for someone else. Give blood. Share life'. This World Blood Donor Day mainly focuses on the fundamental human values of altruism, empathy, respect, and kindness which underline and sustain voluntary unpaid blood donation. People who donate blood should have iron-rich foods and iron-rich smoothies as they may experience side effects like fatigue, light-headedness, and loss of consciousness after donating blood. Eating the right kind of foods and shakes will help replenish the lost iron and vitamin stores.
Story first published:Tuesday, June 19, 2018, 16:10 [IST]
Desktop Bottom Promotion