For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వరల్డ్ కిడ్నీ డే: కిడ్నీల కోసం 10 బెస్ట్ డీటాక్స్ డ్రింక్స్

శరీరం నుంచి వెస్ట్ ను అలాగే టాక్సిన్స్ ను ఫ్లష్ అవుట్ చేసి ఎలిమినేట్ చేసేందుకు కిడ్నీలనే ముఖ్యమైన ఆర్గాన్స్ ఉపయోగపడతాయి. టాక్సిన్స్ అనేవి ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తాయి. ఇన్ఫెక్షియస్ వ్యాధులను కలిగి

|

8th మార్చ్ ని వరల్డ్ కిడ్నీ డే గా గుర్తించారు. కిడ్నీలను టాక్సిన్స్ నుంచి ఫ్రీగా ఉంచుకునేందుకు ఈ రోజు ఈ ఆర్టికల్ లో కిడ్నీల కోసం బెస్ట్ డీటాక్స్ డ్రింక్స్ గురించి వివరించాము.

శరీరం నుంచి వెస్ట్ ను అలాగే టాక్సిన్స్ ను ఫ్లష్ అవుట్ చేసి ఎలిమినేట్ చేసేందుకు కిడ్నీలనే ముఖ్యమైన ఆర్గాన్స్ ఉపయోగపడతాయి. టాక్సిన్స్ అనేవి ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తాయి. ఇన్ఫెక్షియస్ వ్యాధులను కలిగిస్తాయి. కిడ్నీల ఆరోగ్యం బాగుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది.

మీ కిడ్నీలు అనారోగ్యంగా ఉన్నప్పుడు, శరీరంనుంచి వ్యర్థాలను తొలగించే సామర్థ్యం అవి కోల్పోతాయి. అప్పటినుంచి శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోవడం ప్రారంభమవుతాయి. అవి కిడ్నీ స్టోన్స్ గా మారతాయి.

కాబట్టి, కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం తప్పనిసరి. కొన్ని ప్రత్యేకమైన డీటాక్స్ డ్రింక్స్ ను మీ డైట్ లో భాగంగా చేసుకొని కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ డీటాక్స్ డ్రింక్స్ జాబితాను మీకోసం సిద్ధం చేసాము.

1. బీట్ రూట్ జ్యూస్:

1. బీట్ రూట్ జ్యూస్:

బెటెయిన్ అనేది బీట్ రూట్ లో లభిస్తుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ క్వాలిటీలు కలిగిన ప్రయోజనకరమైన ఫైటో కెమికల్. ఇది యూరిన్ లోని యాసిడ్ లెవెల్స్ ని పెంచుతుంది. జ్యూస్ లా బీట్ రూట్స్ ని తీసుకుంటే, కేల్షియం ఫాస్ఫేట్ మరియు స్ట్రవైట్ బిల్డ్ అప్ ని కిడ్నీల నుంచి తొలగించుకోవచ్చు. తద్వారా, కిడ్నీ స్టోన్స్ ఫార్మేషన్ రిస్క్ ని అరికట్టవచ్చు. కిడ్నీల పనితీరును మెరుగుపరచుకోవచ్చు.

2. క్రాన్ బెర్రీ జ్యూస్:

2. క్రాన్ బెర్రీ జ్యూస్:

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ని అరికట్టడానికి క్రాన్ బెర్రీ జ్యూస్ ఉపయోగకరంగా ఉంటుంది. కిడ్నీలను క్లీన్సింగ్ చేయడానికి కూడా ఈ జ్యూస్ ఉపయోగపడుతుంది. కిడ్నీలలో పేరుకున్న కేల్షియం ఆక్సలేట్ ను తొలగించడం ద్వారా కిడ్నీ స్టోన్స్ బారిన పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కిడ్నీలను డిటాక్సిఫై చేసుకునేందుకు హోంమేడ్ క్రాన్బెర్రీ జ్యూస్ ను చేసుకోవడం మంచిది.

3. లెమన్ జ్యూస్:

3. లెమన్ జ్యూస్:

లెమన్ జ్యూస్ అనేది సహజంగానే యాసిడిక్ నేచర్ కలిగి ఉండటం వలన ఇది యూరిన్ లోని సిట్రేట్ లెవెల్స్ ని పెంపొందించడానికి తోడ్పడుతుంది. తద్వారా, కిడ్నీ స్టోన్స్ ఫార్మేషన్ ని అరికడుతుంది. ఒక గ్లాసుడు తాజా నిమ్మరసాన్ని రోజూ తీసుకుంటే కిడ్నీలను సులభంగా డీటాక్స్ చేసుకోవచ్చు.

4. ఆపిల్ సిడర్ వినేగార్ డ్రింక్:

4. ఆపిల్ సిడర్ వినేగార్ డ్రింక్:

ఆపిల్ సిడర్ వినేగార్ అనేది ఆరోగ్యానికి మంచిది. శరీరాన్ని డిటాక్సిఫై చేయడానికి ఈ డ్రింక్ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కిడ్నీలను డిటాక్సిఫై చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇందులో లభించే సిట్రిక్ యాసిడ్, యాసెటిక్ యాసిడ్ మరియు ఫాస్ఫరస్ యాసిడ్ లు కిడ్నీ స్టోన్స్ ని తగ్గించడానికి తోడ్పడతాయి. అదే సమయంలో, కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా నివారిస్తాయి.

5. బెర్రీ స్మూతీ

5. బెర్రీ స్మూతీ

బ్లూ బెర్రీస్, రాస్ప్ బెర్రీస్, బ్లాక్ బెర్రీస్ మరియు క్రాన్ బెర్రీస్ లు విటమిన్స్, మినరల్స్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఫ్లెవనాయిడ్స్ లను అధికంగా కలిగి ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి శరీరం నుంచి ఫ్రీ రాడికల్స్ ను తొలగించి కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడతాయి.

6. దాండేలియన్ టీ

6. దాండేలియన్ టీ

దాండేలియన్ ఆకులలో ఫ్లెవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ కలవు. ఇవి కిడ్నీలను క్లీన్స్ చేసి రక్తాన్ని శుద్ధి చేస్తాయి. తద్వారా, యూరిన్ ఫ్లో ని పెంచుతాయి. దాండేలియన్ టీని రోజూ తాగడం ద్వారా కిడ్నీలను డీటాక్స్ చేసుకుని కిడ్నీ వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.

7. కేరట్ జ్యూస్:

7. కేరట్ జ్యూస్:

కెరోటిన్ అనేది కేరట్స్ లో పుష్కలంగా లభిస్తుంది. ఇది క్యాన్సర్ పై పోరాటం జరుపుతుంది. అలాగే కిడ్నీల లోంచి టాక్సిన్స్ ను అలాగే హెవీ మెటల్స్ ను తొలగిస్తుంది. కేరట్స్ లో లభించే ఫైబర్ అనేది టాక్సిన్స్ ను శరీరం నుంచి తొలగించేందుకు తోడ్పడుతుంది.

8. వెజిటబుల్ జ్యూస్:

8. వెజిటబుల్ జ్యూస్:

వెజిటబుల్స్ నుంచి తయారుచేయబడిన జ్యూస్ లలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ మరియు మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. సెలెరీ, కుకుంబర్, స్పినాచ్, లెట్యూస్ వంటి వి కిడ్నీలకు మంచివి. వీటిని జ్యూస్ రూపంలో తీసుకుంటే కిడ్నీల ఆరోగ్యాన్ని సంరక్షించుకున్నవారవుతారు.

9. కోకోనట్ వాటర్:

9. కోకోనట్ వాటర్:

కోకోనట్ వాటర్ అనేది సహజసిద్ధమైన ఆరోగ్యకరమైన డ్రింక్. ఇది కిడ్నీలకు మంచిది. ఇందులో, చక్కర శాతం తక్కువగా ఉంటుంది. యాసిడ్స్ ఉండవు. కేలరీలు అసలే ఉండవు. ఎలెక్ట్రోలైట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి, కిడ్నీల పనితీరును మెరుగుపరచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. కోకోనట్ వాటర్ ని తాగడం ద్వారా మీరు మీ శరీరాన్ని హైడ్రేట్ చేసుకోవచ్చు.

10. పైనాపిల్ స్మూతీ:

10. పైనాపిల్ స్మూతీ:

పైనాపిల్ లో పోషకాలు అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఈ ఫ్రూట్ లో బ్రోమేలయిన్ అనే ఫైటో న్యూట్రియెంట్ లభ్యమవుతుంది. ఈ ఎంజైమ్ కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇమ్మ్యూన్ సిస్టమ్ కు సపోర్ట్ ఇస్తుంది. ఇరిటేషన్ ను తగ్గిస్తుంది. సిస్టమిక్ ఫంక్షన్ ని ప్రోత్సహిస్తుంది.

English summary

World Kidney Day: 10 Best Detox Drinks For The Kidneys

The kidneys are one of the most important organs that help to flush out the eliminated waste and toxins from the body. Beetroot juice, cranberry juice, carrot juice, apple cider vinegar, vegetable juice, pineapple smoothie, berry smoothie, etc., are some of the drinks that will help detox your kidney.
Story first published:Friday, March 9, 2018, 12:54 [IST]
Desktop Bottom Promotion