For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

kiwi fruit: ప్రతిరోజూ కివి పండు తింటే ఎన్ని లాభాలో తెలుసా...

|

ప్రస్తుత కరోనా కాలంలో పండ్లకు డిమాండ్ బాగా పెరిగింది. ఇందుకు ప్రధాన కారణం ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి, తమ హెల్త్ ను మెరుగ్గా ఉంచుకునేందుకు శ్రద్ధ చూపుతున్నారు.

ఈ నేపథ్యంలోనే సహజంగా పండిన పండ్లు, కూరగాయలపై ఫోకస్ పెడుతున్నారు. మార్కెట్లలోనూ ఆర్గానిక్ ఫ్రూట్స్, కూరగాయలు విరివిగా లభిస్తున్నాయి. ఇప్పటి కరోనా వంటి కష్టకాలంలో మన బాడీకి కావాల్సినంత ఎక్కువ పోషకాలను అందించే పండ్లలో కివి పండు ప్రధానమైనదని చెప్పొచ్చు.

ఈ కివి పండుని 'చైనీస్ గూస్ బెర్రీ' అని కూడా పిలుస్తుంటారు. ఇందుకు ప్రధాన కారణం.. ఈ ఫ్రూట్స్ ఆక్రోట్ ఫలం ఆకారంలో ఉండి గూస్ బెర్రీ రుచిని పోలి ఉంటాయి. ఇవి పన్నెండో శతాబ్దం నుండే మంచి ప్రాచుర్యం సంపాదించాయట. వీటి సాగు చైనా నుండి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలకు విస్తరించడంతో.. ఇవి మరింతగా పాపులర్ అయ్యాయి. ఈ సందర్భంగా కివి పండులో ఉండే పోషకాలు.. వీటి వల్ల మనకు ఎన్ని లాభాలున్నాయలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...
హార్ట్ హెల్త్ మెరుగవుతుంది..

హార్ట్ హెల్త్ మెరుగవుతుంది..

కివి పండులో ఉండే పోటాషియం వల్ల మనం గుండె సమస్యల నుండి తప్పించుకోవచ్చు. రోజుకి నాలుగు మిల్లీగ్రాముల పోటాషియం తీసుకునే వారు.. గుండె సంబంధిత సమస్యల బారిన పడే అవకాశం చాలా తక్కువని నిపుణులు చెబుతున్నారు.

బిపి కంట్రోల్ లో..

బిపి కంట్రోల్ లో..

కివి పండును తినడం వల్ల బిపి కూడా కంట్రోల్ అవుతుందని వైద్యులు చెబుతున్నారు. కివి ఫ్రూట్ ని రెగ్యులర్ ఫుడ్ లో భాగంగా తీసుకుంటే ఎంతో మంచిదని.. దీనిలో ఉండే అధిక పోషకాల వల్ల బిపి కంట్రోల్ లో ఉంటుందట.

జీర్ణశక్తిని పెంచుతుంది..

జీర్ణశక్తిని పెంచుతుంది..

ఎవరైతే తాము తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కావడం లేదని బాధపడుతుంటారో.. అలాంటి వారికి కివి పండు ఎంతగానో మేలు చేస్తుంది. ఇది మన బాడీలని జీర్ణాశయాన్ని యాక్టివ్ చేస్తుంది. కివి పండులో ఉండే యాక్టినిడిన్ అనే ఎంజైమ్ మన శరీరంలో జీర్ణ శక్తిని పెంచేందుకు ఎంతో సహాయపడుతుంది.

కంటి చూపు మెరుగుదలకు..

కంటి చూపు మెరుగుదలకు..

కివి పండు తినడం వల్ల కంటి చూపు సమస్యలు కూడా తగ్గే అవకాశం ఉంది. అలాగే ఎవరైతే కంటి సమస్యలతో బాధపడుతుంటారో.. అలాంటి వారు కూడా వాటిని అధిగమించడానికి ఆహారంలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే కివి పండును కూడా తమ రెగ్యులర్ ఫుడ్ లో తీసుకుంటే.. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. మన కంటి టిష్యూలు, కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.

అవి అదుపులో..

అవి అదుపులో..

మన బాడీలో అనేక టాక్సిన్లు ఉంటాయి. అయితే ఇవి ఎక్కువైతే మన బాడీలో ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు మనం అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఇలాంటి వాటిని అదుపులో ఉంచేందుకు కివి ఫ్రూట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి కివి ఫ్రూట్ ను ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిది.

బలమైన బోన్స్..

బలమైన బోన్స్..

ఎవరైతే ఎముకలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతుంటారో.. వారు కచ్చితంగా కివి పండు తీసుకోవాలి. ఎందుకంటే దీనిలో ఉండే విటమిన్ కె, కాల్సియమ్స్ ను అదుపు చేయగలుగుతాయి. ముఖ్యంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లేదా గాయాలైనప్పుడు ఈ పండును ఆహారంలో భాగంగా తీసుకుంటే త్వరగా రిలీఫ్ లభించే అవకాశం ఉంది.

షుగర్ కంట్రోల్..

షుగర్ కంట్రోల్..

మామూలుగా అయితే ఏవైనా పండ్లను ఆహారంగా తీసుకుంటే.. వాటిలో ఉండే స్వీట్ వల్ల మన బాడీలో షుగర్ ఇంకాస్త పెరగొచ్చు. అయితే కివి పండులో ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ ఇతరవాటితో పోల్చి చూస్తే ఇందులో ఇవి తక్కువ స్థాయిలో ఉన్నాయి. ఇది రక్తంలోని షుగర్ శాతాన్ని అదుపులో ఉంచుతుంది. అలాగే ఈ పండులో ఉండే నీటి శాతం కూడా.. మధుమేహంతో బాధపడేవారు తీసుకునే డైట్ కి సరిపోయే విధంగా ఉంటుంది. అందులోనూ ఈ పండులో కేవలం 11 గ్రాముల కార్బ్స్ మాత్రమే ఉంటాయి. ఇతర పండ్లలో ఇది ఎక్కువగా ఉంటుంది.

చర్మ క్యాన్సర్ రాకుండా..

చర్మ క్యాన్సర్ రాకుండా..

చర్మ క్యాన్సర్ కి కివి పండును ఒక ట్రీట్ మెంట్ గా పరిగణిస్తారు. కివి పండుని రెగ్యులర్ ఫుడ్ లో భాగంగా తీసుకోవడం వల్ల చర్మ సమస్యలతో బాధపడేవారికి ఎంతో ఉపశమనం లభిస్తుంది. కివి పండులో లభించే విటమిన్ సి కారణంగా.. అవి శరీరంలో చర్మాన్ని ఇబ్బంది పెట్టే సెల్స్ తో పోరాడతాయి.

బరువు తగ్గడంలోనూ..

బరువు తగ్గడంలోనూ..

కరోనా వైరస్ కారణంగా.. ప్రతి ఒక్కరూ విపరీతంగా బరువు పెరిగారు. అయితే బరువు తగ్గేందుకు చాలా మంది అష్టకష్టాలు పడుతున్నారు. అయితే కివి పండును మీ ఆహారంలో భాగంగా చేసుకుంటే.. దీనిలో లభించే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, హై ఫైబర్ కంటెంట్ మొదలైనవి మన శరీరంలో కొవ్వుని తగ్గిస్తాయి. దీని వల్ల మనం బరువు పెరగకుండా నిరోధిస్తుంది.

కివి పండు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

కివి పండును రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు అందానికి సంబంధించిన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మన బిపి కంట్రోల్ లో ఉంటుంది. ఎముకలు బలంగా మారతాయి. బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది. చర్మ క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. మన బాడీలో ఆమ్ల స్థాయిని నియంత్రణలో ఉంచి.. టాక్సిన్లను కంట్రోల్ చేస్తుంది. షుగర్ ను కూడా అదుపులో ఉంచుతుంది. కంటి చూపు మెరుగుపరచడంలోనూ.. జీర్ణ శక్తి పెరిగేందుకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.

English summary

Best Health Benefits of Eating Kiwi Fruit in Telugu

Here is the list of best health benefits of kiwi fruit. Read on to know more..