For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

International Tea Day 2022 : ఆ ‘టీ‘ తాగితే మీ భాగస్వామిని బాగా సుఖపెట్టొచ్చు...

ప్రతిరోజూ ఉదయాన్నే లేస్తేనే చాలా మంది నోటి నుండి వినబడే మాట ఒక ‘టీ‘... ప్రతి విద్యార్థికి విద్యలో సహకరించే ‘టీ‘... రొమాం‘టీ‘క్ కపుల్స్ కు ఉత్సాహాన్నిచ్చే‘టీ‘.. మన స్నేహితుడిగా మారిన ‘టీ‘.. అందరికీ అంద

|

నవ్వించేందుకు నార్మల్ 'టీ'.. భాదొస్తే బాదం 'టీ'.. ఆ కార్యానికి అల్లం 'టీ'.. నిద్ర లేవగానే లెమన్ 'టీ'.. బోరు కొడుతున్నప్పుడు బ్లాక్ 'టీ'.. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇలాచీ 'టీ'.. మనసు ఆనందంలో ఉన్నప్పుడు మసాలా 'టీ'.. శరీరంలో గలీజు పోనికి గ్రీన్ 'టీ'.. ఇలా ప్రతిరోజూ ఉదయాన్నే లేస్తేనే చాలా మంది నోటి నుండి వినబడే మాట ఒక 'టీ'... ప్రతి విద్యార్థికి విద్యలో సహకరించే 'టీ'... రొమాం'టీ'క్ కపుల్స్ కు ఉత్సాహాన్నిచ్చే'టీ'.. మన స్నేహితుడిగా మారిన 'టీ'.. అందరికీ అందుబాటులో ఉండే 'టీ'.. అయితే అందరికీ బ్లాక్ టీ, లెమన్ టీ, గ్రీన్ టీతో పాటు అల్లం 'టీ' గురించి అందరికీ ఎంతో కొంత ఆరోగ్య ప్రయోజనాలు తెలిసే ఉంటాయి. అయితే అన్ని టీ ల కన్నా అల్లం టీ తాగే వారిలో రొమాంటిక్ కోరికలు ఎక్కువగా పెరుగుతాయట.

International Tea Day

ఈ 'టీ'ని ఆ కార్యంలో పాల్గొనే ముందు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని అనేక పరిశోధనల్లో వెల్లడైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అల్లం టీ తాగని వారితో పోలిస్తే ఆ 'టీ'ని తాగి ఆ కార్యంలో పాల్గొన్న వారు సంతోషంగా గడిపినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈరోజు అంతర్జాతీయ టీ దినోత్సవం సందర్భంగా ఏ యే టీ వల్ల ఏయే ఉపయోగాలున్నాయో తెలుసుకుందాం...

మొట్టమొదటగా చైనీస్ చక్రవర్తి...

మొట్టమొదటగా చైనీస్ చక్రవర్తి...

టీ అనే పానీయం మొట్టమొదట 1400 సంవత్సరంలో ఒక చేనీస్ చక్రవర్తి ఉపయోగించేవాడట. అలాగే జపనీయులు కూడా ఆ టీని ఎక్కువగా తాగేవారట. అప్పట్లో దేవాలయాల్లో టీని తీర్థం మాదిరిగా పంచేవారట. అలాగే దేవాలయాలకు వెళ్లేవారు ఎక్కువ మంది టీ కోసమే వెళ్లేవారట. టీ గురించి ముఖ్యమై విషయం ఏంటంటే అవి రెండు రకాలుగా ఉంటాయి. అవి ఒకటి చైనీస్ రకం. రెండో మన దేశంలోని అస్సాం, డార్జిలింగ్ లలో పండిచే రకం.

టీ లలో ఆరు రకాలు..

టీ లలో ఆరు రకాలు..

టీ లలో నలుపు, తెలుపు, పసుపు, గ్రీన్, బ్రౌన్, ఆరెంజ్ అని ఆరు రకాలలో ఉంటాయి. ఈ రకమైన టీలు అన్ని ఒకే మొక్క నుండి వస్తాయి. కాకపోతే వాటీ ప్రాసెసింగ్ పూర్తిగా భిన్నగా ఉంటుంది. అందువల్ల అవి వివిధ రుచులను కలిగి ఉంటాయి.

ఆ కార్యానికి అల్లం ‘టీ‘..

ఆ కార్యానికి అల్లం ‘టీ‘..

ఆ కార్యంలో పాల్గొనే ముందు అల్లం ‘టీ‘ తాగితే మీ శరీరం ఉత్తేజవంతంగా మారి మీరు పూర్తి ఉత్సాహవంతులుగా తయారవుతారట. మీ భాగస్వామిని బాగా సుఖపెడతారంట. అయితే ఈ టీని అధిక మోతాదులో తాగకూడదు. రోజుకు కేవలం రెండు కప్పులను మాత్రమే తాగాలి. అప్పుడు మాత్రమే మీరు రొమాన్స్ బాగా ఎంజాయ్ చేయగలరు.

ఆరోగ్యానికి గ్రీన్ ‘టీ‘

ఆరోగ్యానికి గ్రీన్ ‘టీ‘

గ్రీన్ టీ వల్ల అనేక ఆరోగ్య లాభాలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, కరీనా కపూర్ తో పాటు సినీ, క్రీడా ప్రముఖులు ఎక్కువగా గ్రీన్ టీ తాగుతుంటారు. ఎందుకంటే ఇది బరువు తగ్గడానికి, శరీరంలో విష పదార్థాలు తొలగిపోవడానికి చాలా సహాయపడుతుంది. అంతే కాదు వీటిలో ఉండే ఖనిజ లవణాలు, విటమిన్లు, వాపు వ్యతిరేక లక్షణాలు, గుండె సమస్యల రిస్క్ ను తగ్గిం చే లక్షణాలతో పాటు కొన్ని రకాల క్యాన్సనర్లను సైతం తగ్గించే లక్షణాలు పుష్కలంగా ఉంటాయట.

ఆ సమయంలో మాత్రం టీ తాగొద్దు..

ఆ సమయంలో మాత్రం టీ తాగొద్దు..

గ్రీన్ టీలో ఉండే అధిక కెఫీన్ వల్ల పరగడుపునే గ్రీన్ టీ తాగితే కాలేయంపై హానికర ప్రభావం చూపుతుంది. గ్రీన్ టీ పదార్థాలతో కూడిన ఆహార సప్లిమెంట్లపై చేసిన అధ్యయనంలో గ్రీన్ టీని ఖాళీ కడుపుపై తాగితే, కాలేయంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని తేలింది. గ్రీన్ టీలో ఉండే కాటెచిన్స్ అనే సమ్మేళనాల వలన గ్రీన్ టీ ఎంత తాగుతున్నారన్నది గమనిస్తూ ఉండాలి. కాటెచిన్స్ అధిక మొత్తంలో ఉంటే కాలేయం పాడవుతుంది.

లెమన్ టీ..

లెమన్ టీ..

టీ ఆకుల్లో ఉండే క్యాటెచిన్స్, థియాఫ్లేవిన్స్‌ పోషకాల వల్ల మెదడు కణాలపై పడే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్‌ ప్రభావాలతో మెదడులో వాస్క్యులార్‌ డ్యామేజీ, న్యూరోడీజెనరేషన్‌ తగ్గుతాయని నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌నకు చెందిన డాక్టర్‌ ఫెంగ్‌ లీ పేర్కొన్నారు. అంతే కాదు లెమన్ టీ రోజుకు ఒక కప్పు తాగితే మతిమరుపు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.

FAQ's
  • ప్రపంచంలో టీని మొట్టమొదట ఎవరు కనిపెట్టారు? ఎవరు ఎక్కువగా తాగేవారు?

    టీ అనే పానీయం మొట్టమొదట 1400 సంవత్సరంలో ఒక చేనీస్ చక్రవర్తి ఉపయోగించేవాడట. అలాగే జపనీయులు కూడా ఆ టీని ఎక్కువగా తాగేవారట. అప్పట్లో దేవాలయాల్లో టీని తీర్థం మాదిరిగా పంచేవారట. అలాగే దేవాలయాలకు వెళ్లేవారు ఎక్కువ మంది టీ కోసమే వెళ్లేవారట. టీ గురించి ముఖ్యమై విషయం ఏంటంటే అవి రెండు రకాలుగా ఉంటాయి. అవి ఒకటి చైనీస్ రకం. రెండో మన దేశంలోని అస్సాం, డార్జిలింగ్ లలో పండిచే రకం.

English summary

International Tea Day 2022 : Unknown Facts About Tea

Some facts about tea can surprise you on International Tea Day. Here are some of the most expensive varieties of tea that you must try on Tea Day.
Desktop Bottom Promotion