For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Monsoon Diet : వర్షాకాలంలో ఇలాంటి ఫుడ్ జోలికి వెళ్లొద్దు... ఎక్కువగా ఏం తినాలంటే...

|

ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వర్షం జోరుగా కురుస్తోంది. ఈ వానకాలం వచ్చిందంటే చాలు మనలో చాలా మందికి సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

అందుకే ఈ కాలంలో ఆహారం విషయంలో చాలా కేర్ తీసుకోవాలి. ఈ టైంలో అందరికీ వేడి వేడి పదార్థాలు తినాలని అనిపిస్తుంది. కానీ వర్షాకాలంలో అన్నింటినీ వేడి వేడిగా తినకూడదు. ముఖ్యంగా జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ఇన్ స్టంట్ ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

సాధారణంగా సమ్మర్ లో అయితే బాడీలో వేడి తగ్గించే ఫుడ్ ఎక్కువగా తీసుకుంటాం. అదే వర్షాకాలంలో మన బాడీలో వేడి పెంచే ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. అయితే అందులోనూ కొన్నింటిని మాత్రమే ఎక్కువగా తీసుకోవాలి. అనవసరంగా ఇతర పదార్థాలను తింటే మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా వర్షాకాలంలో ఏయే పదార్థాలను తినాలి.. ఏవి తినకూడదనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

కోడిగుడ్లతో కలిపి వీటిని పొరపాటున కూడా తీసుకోకూడదట... ఎందుకో తెలుసా...కోడిగుడ్లతో కలిపి వీటిని పొరపాటున కూడా తీసుకోకూడదట... ఎందుకో తెలుసా...

వెచ్చని నీరు..

వెచ్చని నీరు..

వర్షాకలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ ముప్పు కూడా ముంచుకొస్తోంది. కాబట్టి ఈ సమయంలో మనం మరింత అప్రమత్తంగా ఉండాలి. ఈ సమయంలో మీరు తాగే నీరు బోర్ వాటర్ అయినా లేదా కార్పొరేషన్, మున్సిపాలిటీ నుండి నేరుగా వచ్చే వాటిని అలాగే తాగడం మంచిది కాదు. ఆ నీల్లను పూర్తిగా ఫిల్టర్ చేసి లేదా నీళ్లను వేడి చేసి కాచి చల్లార్చుకుని తాగితే ఎంతో మంచిది.

ఆయిల్ ఫుడ్..

ఆయిల్ ఫుడ్..

వర్షాకాలంలో వాతావరణం మొత్తం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. దీంతో ప్రతి ఒక్కరూ వేడి వేడి సమోసా, చికెన్ పకోడి, మిర్చి వంటి ఆయిల్ పదార్థాలను తినేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు. అయితే వర్షాకాలంలో ఇలాంటి ఆహారం తీసుకోవడం చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కాలంలో మన బాడీనికి సరైన క్రమంలో న్యూట్రియన్స్ అందాలంటే.. ఇలాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదట.

ఆకుకూరలు తక్కువగా..

ఆకుకూరలు తక్కువగా..

సాధారణంగా ఆకుకూరలు మన ఆరోగ్యానికి మంచి చేస్తాయి. కానీ వర్షాకాలంలో వీటిని ఎంత తక్కువగా తీసుకుంటే అంత మేలట. ఎందుకంటే ఈ సమయంలో అవి చాలా తేమతో కూడుకుని ఉంటాయి. దీని వల్ల పోషకాలన్నీ మన బాడీకి అందకపోవచ్చు. కాబట్టి ఈ సీజన్లో ఆకుకూరలు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ తినకపోవడమే మంచిది.

భోజనం తర్వాత ఈ రెండు తింటే... కరోనా నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు...!భోజనం తర్వాత ఈ రెండు తింటే... కరోనా నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు...!

అల్లం టీతో పాటు..

అల్లం టీతో పాటు..

వర్షాకాలంలో మన బాడీలో ఆటోమేటిక్ గా తేమ అనేది తగ్గిపోతుంది. దీని వల్ల రెగ్యులర్ గా వాష్ రూమ్ కి వెళ్లాల్సి వస్తుంది. అందుకే ఈ కాలంలో మన బాడీకి ఎక్కువగా ఫ్లూయిడ్స్ అందించాలి. అలాగే వర్షాకాలంలో నీటిని ఎక్కువగా తీసుకోలేం. కాబట్టి.. దీనికి బదులు మీరు రెగ్యులర్ గా అల్లం టీ, తులసి టీ, హెర్బల్ టీ, మసాలా టీ వంటివి తీసుకోవడం వల్ల మీ హెల్త్ కు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

ఉడకబెట్టిన ఫుడ్..

ఉడకబెట్టిన ఫుడ్..

వర్షాకలంలో వీలైనంత మేరకు నిల్వ చేసిన పదార్థాలను తినడం మానుకోండి. సాధ్యమైనం మేరకు వేడి వేడిగా వండుకుని తినడం చేయండి. రాత్రి పూట మిగిలిన ఆహారాన్ని ఉదయం తినడం వంటివి చేయకండి. అలాగే ఈ వర్షాకాలంలో సలాడ్స్ కన్నా.. ఉడకబెట్టిన సలాడ్స్ తినడం చాలా మంచిది.

ఇమ్యూనిటీ పెంచే ఫుడ్..

ఇమ్యూనిటీ పెంచే ఫుడ్..

ఈ వర్షాకలంలో మీరు తీసుకునే ఆహారాల్లో ఎక్కువగా మసాలాలు ఉండేలా చూసుకోండి. పసుపు, మిరియాలు, లవంగం ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ ఇమ్యూనిటీ పెంచడంలో ఉత్తమంగా పని చేస్తాయి.

English summary

Monsoon Diet : What To Eat And What To Avoid During The Monsoon Season

Here are the what to eat and what to avoid during the monsoon season. Take a look
Story first published: Monday, July 19, 2021, 17:34 [IST]