Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
ఓట్స్, కార్న్ ఫ్లేక్స్.. ఇందులో ఏది తింటే ఆరోగ్యం మెరుగుపడుతుందో తెలుసా?
ఓట్స్, కార్న్‌ఫ్లేక్స్.. ఈ రెండూ చాలా మందికి ఎక్కువగా ఇష్టమైన అల్పాహారం. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో సులువుగా తయారు చేసుకుని తినగలిగే వీటిని చాలా మంది ప్రతిరోజూ తింటుంటారు.
సాధారణంగా పాలతో తయారు చేయబడిన కార్న్ ఫ్లేక్స్ కరకలాడుతుంటుంటే ఇష్టంగా లాగించేస్తారు. అలాగే ఓట్స్ ను ఎక్కువగా నమలి తినాల్సి వస్తుంది. అయితే ఈ రెండూ ఆరోగ్యానికి మంచివే. ఈ రెండిసట్లో ఏది మంచిదో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఓట్స్..
ఓట్స్ లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఫైబర్‌తో నిండిన ఈ ఓట్స్ ను చాలా మంది ఇష్టంగా తింటారు. మొత్తం మూడు రకాల ఓట్స్ ఉంటాయి. స్టీల్ కట్, ఇన్ స్టంట్ మరియు రోల్డ్ ఓట్స్. స్టీల్ - కట్ ఓట్స్ తక్కువ ప్రాసెస్ చేయబడినవి. కానీ ఇన్‌స్టంట్ ఓట్స్ ఎక్కువగా ప్రాసెస్ చేయబడతాయి. ఓట్స్ ప్రాథమికంగా సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు. వీటిని తింటే ఎక్కువ సేపు ఆకలి వేయదు. కడుపు నిండుగా ఉంటుంది. ఓట్స్‌లో ఐరన్, థయామిన్, జింక్, మెగ్నీషియం మరియు సెలీనియం వంటి పోషకాలు ఉంటాయి. ఈ ఫైబరస్ ఫుడ్ ఐటెమ్ సహజంగా గ్లూటెన్ రహితంగా ఉంటుంది.
కార్న్ ఫ్లేక్స్
మొక్కజొన్నతో తయారు చేసిన కార్న్ ఫ్లేక్స్.. క్రిస్పీ తృణ ధాన్యాలు. దీనిని ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఇష్ట పడతారు. కార్న్ ఫ్లేక్స్ యొక్క గొప్పదనం ఏమిటంటే.. వీటిని మీరు ఉడికించాల్సిన అవసరం లేదు. గోరు వెచ్చని పాలు, పంచదార కలిపితే రెండు నిమిషాల్లో ఇది రెడీ అయిపోతుంది. కార్న్ ఫ్లేక్స్ లో విటామిన్లు, ఫోలేట్, కార్బో హైడ్రేట్లు, మినరల్స్ మరియు డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. అలాగే కాలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకున్న వాళ్లకు కార్న్ ఫ్లేక్స్ చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఈ రెండిట్లో ఏది మంచిది?
ఓట్స్, కార్న్ ఫ్లేక్స్ రెండూ మంచివే. అల్పాహారంలో వీటిని భాగం చేసుకోవడం చాలా మంచిది. అయితే ఓట్స్ ఎంచుకోవడం మరింత మంచిది. ఎందుకంటే 100 గ్రాముల ఓట్స్‌లో 26 గ్రాముల ప్రొటీన్లు ఉంటాయి. కార్న్ ఫ్లేక్స్‌లో 7 గ్రాములు ఉంటాయి. ఓట్స్ లో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల ఓట్స్ లో 16 గ్రాముల ఫైబర్ ఉంటే.. కార్న్ ఫ్లేక్స్‌లో 2 గ్రాములు మాత్రమే ఉంటాయి. ఒక కప్పు ఓట్స్‌లో 300 కేలరీలు ఉంటాయి. కార్న్ ఫ్లేక్స్‌లో 100 మాత్రమే ఉంటాయి.
ఓట్స్‌ను రుచిగా, మరింత ఆరోగ్యకరమైనదిగా చేయడానికి.. వాటిలో కొన్ని పండ్లను కలుపుకోవాలి. ముఖ్యంగా బెల్లం, తేనె లేదా స్టెవియాతో తినడం ద్వారా ఇది మరింత ఆరోగ్యాన్ని కల్గజేస్తుంది. మీరు ఓట్స్‌తో ఓట్‌మీల్, మసాలా ఓట్స్, ఓట్స్ చీలా, ఓట్స్ స్మూతీ, ఓట్స్ కట్‌లెట్స్, ఓట్స్ చపాతీ మరియు మరెన్నో వంటకాలను తయారు చేసుకోవచ్చు.
అలాగే కార్న్ ఫ్లేక్స్ తినాలనుకునే వాళ్లు పాలలో బాదం, వాన్ నట్, చియా గింజలు, గుమ్మడి కాయ గింజలు వంటి వాటిని కలుపుకుంటే మరింత మంచిది. అలాగే తరిగిన యాపిల్ ముక్కలు, అరటి పండ్లు, స్ట్రాబెర్రీలు వంచి వాటిని కార్న్ ఫ్లేక్స్‌లో కలుపుకుంటే మరింత అద్భుతమైన రుచి వస్తుంది. అలాగే ఆరోగ్యం కూడా మన సొంతం అవుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











