Latest Updates
-
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్! -
ఉదయం 5 గంటలకు నిద్రలేస్తేనే సక్సెస్ వస్తుందా?.. ప్రముఖ న్యూరోసైంటిస్ట్ చెబుతున్న సంచలన నిజాలివే! -
ఎండ దెబ్బకు చెక్: బార్లీ నీళ్లా? చెరకు రసమా? వేసవి వ్యర్థాలను తరిమికొట్టే బెస్ట్ డ్రింక్ ఏది? -
ఇప్పటి ప్రేమ పరిచయాలు యువతను ఎందుకు మానసికంగా అలసిపోయేలా చేస్తోంది -
మధురై తణ్ణి చట్నీతో ఇడ్లీ, దోశల టేస్ట్ డబుల్!..ఎలా చేసుకోవాలంటే.. -
బాధ్యతలు ఏవైనా ఒత్తిడి సమానమే.. మహిళలూ వీటిపై నిర్లక్ష్యం వద్దు.! -
జూన్ 4: గ్రహాల కదలికలతో ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం, కెరీర్లో అద్భుతమైన మార్పులు! -
జూన్ 4న అరుదైన బ్రహ్మ యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీదే! -
వేసవిలో కడుపుకు హాయినిచ్చే బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..5 నిమిషాల్లో దహీ పోహా ఎలా చేయాలంటే..
ఊబకాయంతో క్యాన్సర్.. ఒకటీ రెండూ కాదు ఏకంగా 18 రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం
అధిక బరువు, ఊబకాయం వల్ల వచ్చే రోగాలు అన్నీ ఇన్నీ కావు. కొవ్వు పేరుకుపోయి గుండె సంబంధిత వ్యాధులతో పాటు రక్త ప్రసరణ సమస్యలతో బీపీ, డయాబెటిస్, జీర్ణ సంబంధిత వ్యాధులు, మోకాళ్ల నొప్పులు, బ్యాక్ పెయిన్ ఇలా చాలా రకాల ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. అయితే ప్రపంచ ఆరోగ్య సమస్థ - WHO జరిపిన అధ్యయనంలో క్యాన్సర్ ప్రమాదాల ముప్పు కూడా పొంచి ఉందని తేలింది. ఒకటీ రెండూ కాదు ఏకంగా 18 రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అధ్యయనంలో వెల్లడైంది.
కొన్ని అధ్యయనాల ప్రకారం క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని ఊబకాయం 4-8 శాతం పెంచుతున్నట్లు తేలింది. అలాగే మెనోపాజ్ తర్వాత వచ్చే రొమ్ము క్యాన్సర్, కొలోరెక్టల్, ఎండోమెట్రియల్, మూత్రపిండాలు, అన్నవాహిక, ప్యాంక్రియాటిక్, కాలేయం, పిత్తాశయ క్యాన్సర్లకు ఊబకాయమే ప్రధాన కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన కొత్త అధ్యయనం ప్రకారం 18 నెలల నుంచి 4 సంవత్సరాల వయస్సు ఉన్న ఊబకాయుల్లో 18 రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తేలింది. నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్ లో ప్రచురించిన అధ్యయన ఫలితాల ప్రకారం స్పెయిన్ లోని కాటలోనియాలోని 2.6 మిలియన్లకి పైగా ప్రజల ఆరోగ్య రికార్డులను అధ్యయనకర్తలు పరిశీలించారు. 2009 లో 40 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు క్యాన్సర్ నుంచి విముక్తి పొందినట్లు తేలింది. 9 ఏళ్ల తర్వాత అంటే 2018 లో 2.25 లక్షల మందికి పైగా క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు డబ్ల్యూహెచ్ఓ నివేదిక వెల్లడించింది.
ఈ అధ్యయనంలో పాల్గొన్న వారి బాడీ మాస్ ఇండెక్స్ పరిస్థితి ఏ విధంగా ప్రభావితం చేస్తుందో తెలుసుకున్నారు. 25 లేదా అంతకంటే ఎక్కువ బీఎంఐ ఉన్న వారిలో 18 రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉన్నట్లు తేలింది. లుకేమియా, నాన్ హాడ్కిన్ లింఫోమా, తల, మెడ, మూత్రాశయ క్యాన్సర్ల వంటివి బరువుతో ముడిపడి ఉన్నట్లు వెల్లడైంది. అధిక బరువు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధకులు వెల్లడించారు. ఇక బాల్యంలోనే వచ్చే ఊబకాయం వల్ల కాగ్నిటివ్ పనితీరు క్షీణిస్తున్నట్లు గుర్తించారు.
ఊబకాయంతో ముడిపడి ఉన్న క్యాన్సర్లు:
* కాలేయం
* కిడ్నీ
* పిత్తాశయం
* మొదడు
* థైరాయిడ్
* రొమ్ము క్యాన్సర్
* పొట్ట
* ప్యాంక్రియాటిస్
* పేగు
* మైలోమా
* గర్భాశయం
* అండాశయం
* లుకేమియా
* నాన్ హాడ్కిన్ లింఫోమా
* తల
* మెడ
* మూత్రాశయ
ఊబకాయానికి, క్యాన్సర్‌కు సంబంధం ఏంటి?
విసెరల్ కొవ్వు శరీరంలోని ముఖ్యమైన అవయవాలను చుట్టుముట్టి ఇన్సులిన్, ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్లలో వినాశనం కలిగిస్తున్నట్లు ఎండీ ఆండర్సన్ క్యాన్సర్ సెంటర్ అధ్యయనంలో వెల్లడైంది. విసెరల్ కొవ్వు కణాలు శరీరాన్ని దెబ్బతీస్తాయి. కణాల విభజన జరిగి కణితులు ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరగడం వల్ల కణాల అధిక ఉత్పత్తికి దారి తీస్తుంది. ఫలితంగా కణితి పెరుగుతుంది. మహిళల్లో ఈస్ట్రోజెన్ అధిక స్థాయిలులు రొమ్ము, ఎండోమెట్రియల్, అండాశయ క్యాన్సర్ల ప్రమాదంతో ముడి పడి ఉంటుంది.
ఊబకాయాన్ని ఎదుర్కొనే మార్గాలు:
ఒత్తిడి:
మనసుపై, శరీరంపై ఒత్తిడి తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఒత్తిడి వల్ల అధిక కేలరీల ఆహారం తినాలనే కోరికను కలిగిస్తుంది. ఇది ఊబకాయానికి దారితీస్తుంది.
వ్యాయామం:
సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం వారానికి 150 నిమిషాల పాటు ఏరోబిక్ వ్యాయామం చేయాలి. అలాగే 75 నిమిషాల పాటు చిన్న చిన్న వ్యాయామాలు చేయాలి.
ఆరోగ్యకరమైన ఆహారం:
రోజూ తినే ఆహారం సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి. ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, కొవ్వులు ఉండే ఆహారం తీసుకోవాలి. రోజూ వారి కార్యకలాపాలకు అవసరమయ్యే పోషకాలు ఉండేలా ఆహారం తీసుకోవాలి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications