Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
రోజూ పుదీనా నీరు తాగితే..శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!
వంటల్లో సువాసన కోసం లేదా గార్నిష్ కోసం సాధారణంగా మనం పుదీనా ఆకుని వాడుతుంటాం. కొంతమంది పుదీనా ఆకు టీని తాగుతుంటారు. చాలామంది దీనిని ఒక సాధారణ ఆకుకూరలా చూస్తారు కానీ, ఆయుర్వేదంలో పుదీనాకు ప్రత్యేక స్థానం ఉంది.
ఇది కేవలం రుచిని పెంచేది మాత్రమే కాదండోయ్.. మన శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే అద్భుతమైన ఔషధ మొక్క. ఆరోగ్య నిపుణుల ప్రకారం పుదీనా నీటిని రోజు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. పుదీనా ఆకులను నీటిలో కలిపి తీసుకోవడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు, దానిని ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

పుదీనా నీరు ఎందుకు తాగాలి? కలిగే లాభాలేంటి?
జీర్ణవ్యవస్థకు శ్రీరామరక్ష
సమయానికి తినకపోవడం,జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వంటి అనేక రకాల కారణాలతో ఈ రోజుల్లో చాలామంది గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. పుదీనాలో ఉండే మెంథాల్ కడుపులోని కండరాలను సడలించి, జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. ఉదయాన్నే ఈ నీటిని తాగడం వల్ల కడుపు తేలికగా మారుతుంది.
శరీరానికి నేచురల్ కూలెంట్
వేసవిలో లేదా శరీరం బాగా వేడిగా ఉన్నప్పుడు పుదీనా నీరు దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఇది బాడీ టెంపరేచర్ ను కంట్రోల్ చేసి వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది.
బరువు తగ్గాలనుకునే వారికి
బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్లయితే పుదీనా నీరు మీకు బెస్ట్ ఫ్రెండ్. ఇది జీవక్రియ (మెటబాలిజం)ను పెంచుతుంది, అనవసరమైన ఆకలిని తగ్గిస్తుంది. దీనివల్ల మీరు అదనపు కేలరీలను తీసుకోకుండా బరువును అదుపులో ఉంచుకోవచ్చు.
మెరిసే చర్మం కోసం
పుదీనా ఒక సహజ డిటాక్సిఫైయర్. ఇది రక్తాన్ని శుద్ధి చేసి, శరీరం నుండి విష పదార్థాలను బయటకు పంపుతుంది. ఫలితంగా మొటిమలు తగ్గి, చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది.
నోటి దుర్వాసన మాయం
ఎంత బ్రష్ చేసినా నోటి దుర్వాసన పోవట్లేదా? పుదీనా నీరు సహజ మౌత్ ఫ్రెషనర్ గా పనిచేస్తుంది. నోటిలోని బ్యాక్టీరియాను చంపి, తాజా శ్వాసను అందిస్తుంది.
ఒత్తిడికి చెక్
పుదీనా సువాసన, గుణాలు మెదడును శాంతపరుస్తాయి. తలనొప్పిగా ఉన్నప్పుడు లేదా ఒత్తిడిగా అనిపించినప్పుడు ఒక కప్పు పుదీనా టీ లేదా నీరు తాగితే తక్షణ ఉపశమనం లభిస్తుంది.
పుదీనా నీటిని తయారు చేయడం ఎలా?
మరిగించే పద్ధతి: 10 తాజా పుదీనా ఆకులను ఒక గ్లాసు నీటిలో వేసి 10 నిమిషాలు మరిగించాలి. తర్వాత వడకట్టి, గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి.
నానబెట్టే పద్ధతి: రాత్రిపూట ఒక గ్లాసు నీటిలో కొన్ని పుదీనా ఆకులను వేసి నానబెట్టండి. ఉదయాన్నే ఆ నీటిని వడకట్టి, రుచి కోసం కాస్త నిమ్మరసం, తేనె కలుపుకుని తాగండి.
ఎప్పుడు తాగాలి? ఎవరు తాగకూడదు?
ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయి. భోజనం తర్వాత కూడా తాగవచ్చు కానీ పడుకునే ముందు మరీ ఎక్కువగా తాగకండి.
గర్భిణీ స్త్రీలు, అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు, తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నవారు డాక్టర్ల సలహా మేరకు మాత్రమే దీనిని తీసుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications