Latest Updates
-
80వ స్వాతంత్ర్య దినోత్సవం.. వాట్సప్ స్టేటస్, కోట్స్.. మన భారతీయులకు ఇలా విషెస్ తెలియజేయండి! -
ఇంట్లోనే 100% స్వచ్ఛమైన ఆవ నూనె తయారీ.. మిక్సీ ఉంటే చాలు! -
ఆగస్టు 15 స్పెషల్..పక్కా స్వీట్ షాప్ స్టైల్ మోతీచూర్ లడ్డూ.. మీ ఇంట్లోనే ఇలా సింపుల్ గా చేసేయండి -
రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా.. మీ ఫ్యామిలీలో ఈ సమస్యలు రావడం పక్కా.! -
మన ఇంట్లో పెరిగే ఈ చెట్టు పండ్లే కాదు.. ఆకులు సైతం రోగాలతో పోరాడతాయని తెలుసా.! -
చూస్తే జాతీయ జెండా, తింటే అమృతం..ఆగస్టు 15 కోసం నోట్లో వేస్తే కరిగిపోయే ట్రై కలర్ కోకోనట్ బర్ఫీ.. -
గుడ్లు,చికెన్ కంటే వీటిలోనే ఎక్కువ ప్రొటీన్,మినరల్స్..బరువు తగ్గాలన్నా,కండలు పెంచాలన్నా ఇవే బెస్ట్ -
ఇడ్లీ, దోసెలు కాదు పొద్దున్నే ఇది తినండి..100 ఏళ్లు ఆరోగ్యంగా బతికేస్తారు! -
కాల సర్ప దోషంతో కష్టాలు.. నాగుల పంచమి రోజున ఈ ఐదు పనులు చేయండి.! -
మైదా పిండి అవసరమే లేదు.. ఇంట్లోనే జ్యూసీగా నోరూరించే స్వీట్ షాప్ స్టైల్ బాదుషా.!
పీరియడ్స్ ఒకటీ , రెండ్రోజులు మాత్రమే ఉంటున్నాయా? కారణాలు ఏమై ఉండొచ్చంటే?
రుతుక్రమం చుట్టూ చాలా మందికి ఎన్నో అనుమానాలు, అపోహలు ఉంటాయి. నెలనెలా వచ్చే పీరియడ్స్ సాధారణంగా 4 రోజుల నుండి 8 రోజుల వరకు ఉంటుంది. అంటే అప్పటి వరకు బ్లీడింగ్ ఉంటుంది. అయితే ఇది కొంత మందిలో ఎక్కువ ఉండొచ్చు.. ఇంకొంత మందిలో తక్కువ ఉండొచ్చు. ఎప్పుడూ నాలుగైదు రోజుల పాటు వచ్చే పీరియడ్స్ ఒక నెల ఒకటీ, రెండ్రోజులకే పరిమితం అయితే ఆందోళన చెందడం సాధారణం.

రుతుచక్రం 4-8 రోజుల కాకుండా కేవలం ఒకటీ రెండ్రోజులు మాత్రమే పరిమితం అయితే దాని వెనక కారణాలు ఏమై ఉండవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఒత్తిడి:
మానసిక ఒత్తిడి హార్మోన్ల విడుదలపై ప్రభావం చూపిస్తుంది. ఒత్తిడి స్థాయిలు పెరగడం వల్ల పీరియడ్స్ కొన్ని రోజులు మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఒత్తిడి స్థాయిలు తగ్గిన తర్వాత పీరియడ్స్ నిడివి సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది.
2. కఠినమైన వ్యాయామం:
కఠిన వ్యాయామాలు చేయడం శరీరంపై ప్రభావం చూపిస్తుంది. అండోత్సర్గాన్ని నియంత్రించే హార్మోన్ల విడుదలకు ఆటంకం కలిగించవచ్చు. ఫలితంగా తక్కువ రోజుల్లోనే పీరియడ్స్ అయిపోవచ్చు.
3. కొన్ని మందులు:
రక్త నియంత్రణ మందులు, బ్లడ్ థిన్నర్స్, స్టెరాయిడ్స్ వంటి కొన్ని మందులు కూడా తక్కువ పీరియడ్స్ రావడానికి కారణం కావొచ్చు.
4. ఇతర వ్యాధులు:
పీసీవోఎస్, థైరాయిడ్, గర్భాశయం యొక్క క్షయవ్యాధి, కొన్ని లైంగికంగా సంక్రమించే వ్యాధులు వంటివి కూడా ప్రభావం చూపిస్తాయి.
5. పూర్ ఓవులేషన్:
పీరియడ్స్ ఒకటీ రెండ్రోజులే ఉంటే పేలవమైన అండోత్సర్గము కారణం కావొచ్చు. దీనిని అనోవులేషన్ అంటారు. ఇది తేలికైనా లేదా క్రమరహిత పీరియడ్స్ కు కారణం కావొచ్చు.
పీరియడ్స్ 1 లేదా 2 రోజులు మాత్రమే ఉంటే?
పీరియడ్స్ ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే ఉంటే.. శరీరం తగినంత ఈస్ట్రోజెన్ ను తయారు చేయకపోవచ్చు. ఇది ఎండోమెట్రియంను నిర్మించడానికి అవసరం. శరీరంలో ఈస్ట్రోజెన్ లోపం ఉంటే, ఎండోమెట్రియం తగినంత మందంగా ఉండదు. అందువల్ల రక్త ప్రవాహం తక్కువగా ఉంటుంది. తక్కువ పీరియడ్స్ అంటే యుక్త వయస్సులోకి ప్రవేశించినట్లయితే పీరియడ్స్ ఇంకా నియంత్రణలోకి రాలేదని అర్థం. ఒకవేళ 45 ఏళ్లు పైబడిన తర్వాత పీరియడ్స్ తక్కువ రోజులే ఉంటే అది మెనోపాజ్ కు సంకేతం కావొచ్చు.
సాధారణ పీరియడ్స్ ఎన్ని రోజులు ఉంటుంది?
సాధారణంగా పీరియడ్స్ 4 నుండి 8 రోజుల వరకు ఉంటుంది. సాధారణంగా రుతు చక్రం 28 రోజులు ఉంటుంది. 28 రోజుల నుండి 40 రోజుల మధ్య పీరియడ్స్ రావడం చాలా సహజం. దీనిని సమస్యగా పరిగణించాల్సిన అవసరం లేదు.
ఆరోగ్యకరమైన రుతుచక్రాన్ని నిర్వహించడానికి చిట్కాలు:
1. ఒత్తిడిని నివారించాలి
2. బాగా నిద్రపోవాలి
3. హెల్తీ డైట్ తీసుకోవాలి
4. అతిగా తినొద్దు
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications