Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
జిమ్ చేసే మగవారిలో ఈ సమస్య.. ఇలా చేయకపోతే పిల్లలు కూడా పుట్టరట..!
ప్రస్తుతమున్న కాలంలో చాలామంది తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఫిట్‌గా ఉండేందుకు జిమ్ చేయడం మొదలు పెట్టారు. అయితే పురుషుల్లో వంధ్యత్వం పెరుగుతున్న నేపథ్యంలో.. దీనిపై జరిపిన పరిశోధనల్లో సంచనల విషయాలు వెలువడ్డాయి. జిమ్ చేయడం కారణంగా పురుషుల్లో వంధ్యత్వం పెరుగుతుందని తేలింది. అలాగే పిల్లలు పుట్టడానికి కూడా అది అడ్డుగా మారుతుందని వెల్లడైంది. దానికి గల కారణాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
జిమ్ దీనిపై ప్రభావం చూపుతుందంటే..
సంతానోత్పత్తి సమస్య జిమ్‌లో ఎక్కువగా సమయం గడిపేవారిలోనే వస్తుందని ఆ అధ్యయనంలో వెల్లడైంది. జిమ్ చేయడం వల్ల శారీరక శ్రమ పెరిగి అవసరమైన వీర్యకణాల సంఖ్య ఉత్పత్తి అవ్వడం లేదనే వాదన కూడా ఉంది. అందుకే జిమ్ చేసే మగవారిలో వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉందని అందులో పేర్కొన్నారు. అదే సమయంలో ఆడవారు స్టీమ్ బాత్ చేయడం వల్ల, ల్యాప్‌టాప్‌లు ఎక్కువగా వినియోగించడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయని పేర్కొంటున్నారు.

అక్కడ వేడి వల్లే..
జిమ్ ఎక్కువగా చేసే వారిలో వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండడం, వీర్య కణాలు వృద్ధి కాకపోవడం.. ఉన్న కణాలు కూడా చురుకుగా లేకపోవడం వంటి సమస్యలను గుర్తించారట. అయితే జిమ్‌లో ఎక్కువ సమయం గడిపేవారు చాలా టైట్‌గా ఉండే దుస్తులనే వేసుకుంటారు. దానివల్ల శరీరంలోని ప్రైవేట్ భాగాల్లో వేడి పెరుగుతుందట. తద్వారా ఆ ప్రభావం వీర్యకణాలపై చూపుతుందని చెబుతున్నారు. దీంతో జిమ్ చేసే పురుషుల్లో వంధ్యత్వ సమస్యలు ఎక్కువ అవుతున్నాయని చెబుతున్నారు.
ఎలా అదుపు చేయాలంటే..
సాధారణంగా పురుషుల్లో వేడి ఎక్కువగా ఉంటుంది. అయితే పైన పేర్కొన్నట్లు జిమ్ చేస్తున్న సమయంలో ఆ వేడి మరింత ఎక్కువై వీర్యకణాలు అంతం అవడానికి దోహదపడుతుంది. అందుకే ఎక్కువగా సమయం జిమ్‌లో తమ సమయాన్ని వెచ్చించేవారు జిమ్‌కు వెళ్లడం తగ్గించాలట. అలాగే జిమ్ చేసేటప్పుడు కొంచెం వదులు దుస్తువులు వేసుకోవాలట. ఇలా చేయడం ద్వారా హీట్ తగ్గి.. శరీరానికి కావాల్సిన గాలి అందుతుందని పేర్కొంటున్నారు.
తద్వారా పైన పేర్కొనబడిన సమస్య నుంచి విముక్తి పొందొచ్చని చెబుతున్నారు. మీరూ కూడా జిమ్‌కు వెళ్లే సమయంలో మరీ ఫిట్‌గా ఉండే దుస్తులను కాకుండా.. గాలి వీచే విధంగా ఉండే దుస్తులను వేసుకుంటే ఉత్తమ ఫలితాలు కనిపించే అవకాశం ఉంటుంది.
ఈ థెరపీ ట్రై చేయండి..
ఇవి మాత్రమే కాదు ఇంకా కొన్ని సమస్యలు మగవారిలో వంధ్యత్వం పెరగడానికి కారణం అవుతున్నాయని చెబుతున్నారు. హైపోథాలమస్ పిట్యూటరీ గోనాడల్ యాక్సిస్ పనితీరు, ఆక్సీకరణ ఒత్తిడిలో పెరుగుదల, మంట వంటివి ఫెర్టిలిటీ సమస్యలకు కారణమవుతున్నాయట. వీటి వల్ల టెస్టోసీరాన్ ఉత్పత్తి తగ్గడంతో పాటు వీర్యకణాల వృద్ధి కూడా నెమ్మదిస్తుందట. ఈ సమస్యను ఎదుర్కొంటున్న వారు టెస్టొసిరాన్ రీప్లేస్మెంట్ థెరఫీ చేయించుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఇవి కూడా పాటించాలి..
జిమ్ ఎక్కువగా చేసే వ్యక్తులు, వంధ్యత్వంతో బాధపడుతున్న పురుషులు తగినంత నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. జింక్, మెగ్నీషియం ఎక్కువగా ఉన్న ఆహరం తీసుకోవడం.. లేకపోతే వాటికి సంబంధించిన సప్లమెంట్స్ తీసుకోవడం వంటివి చేయాలి. శరీరంలో కొత్త వీర్యకణాల వృద్ధికి సుమారు మూడు నెలల సమయం పడుతుంది. ఆలోపు జిమ్‌కు వెళ్లడం తగ్గించడం, కొత్త జీవన విధానానికి అలవాటు పడడం నేర్చుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications