Latest Updates
-
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
యాంటీబయోటిక్ మందులను ఎక్కువ వాడితే చాలా ప్రమాదం..! వైద్యుల వార్నింగ్..!
యాంటీబయోటిక్‌లను ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది శృతికి మించి వాడుతున్నారు. చిన్న తలనొప్పి వచ్చినా యాంటీ బయోటిక్ మందులను ఉపయోగిస్తారు. యాంటీ బయోటిక్స్ శరీరానికి అలవాటైపోయ్, రెసిస్టెన్స్ పెరగడం వల్ల తరువాత ఫలితం కూడా లేకుండా పోతుంది. ప్రపంచంలో అన్ని దేశాలకంటే భారత దేశంలోనే యాంటీ బయోటిక్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎవరైనా సరే యాంటీబయోటిక్‌లను కొనుక్కొని వేసుకునే పరిస్థితి వచ్చింది. ఇతర దేశాల్లో డాక్టర్ సలహా లేనిది ఒక్క యాంటీబయోటిక్ మందు కూడా దొరకదు. చిన్న చిన్న ఆరోగ్యసమస్యలు, ఇన్ఫెక్షన్లకు కూడా పవర్ఫుల్ యాంటీ బయోటిక్‌లను ఉపయోగిస్తున్నాం. యాంటీ బయోటిక్ రెసిస్టెన్స్ రాకుండా వుండాలంటే ఏమి చేయాలి. ఒక వేల వస్తే కలిగే నష్టాలేంటో తెలుసుకుందాం.

2000 సంవత్సరం నుంచి యాంటీ బయోటిక్ మందుల వాడకం 76 శాతం ప్రపంచం వ్యాప్తంగా పెరిగిందని చెబుతున్నారు. అంతకు ముందు ఏదైన చిన్న అనారోగ్య సమస్య వస్తే లవంగాలు, సొంటి లాంటి ఇంట్లో వున్న వస్తువలతో ఆరోగ్య చిట్కాను పాటించేవారు. కానీ ప్రస్తుతం అన్నింటికీ యాంటీ బయోటిక్‌లను తీసుకుంటున్నారు.
శరీరంలో క్రిములు ప్రవేశించి ఇన్ఫెక్షన్ కలిగిస్తున్నప్పుడు దాన్ని నిరోధించడానికి తెల్లరక్తకణాలు ఆ బ్యాక్టీరియా ఇన్ఫెక్షను బంధించడానికి కొన్ని రకాల యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంటాయ్. 5 రకాల యాంటీ బాడీలను మన శరీరం విడుదల చేస్తుంది.ఏ రకమైన క్రిములు శరీరంలోకిి వెళ్లినా లోపల వున్న రక్షణ వ్యవస్థ వెంటనే స్పందిస్తుంది. అయితే ఇలా ఎదుర్కోవడానికి కొంత సమయం పడుతుంది. ఈ లోపు బ్యాక్టీరియా విజృంభించడం వల్ల అసౌకర్యం మొదలౌతుంది. జలువు, దగ్గు, జ్వరం, ఇన్ఫెక్షన్లు కూడా పెరుగుతాయ్. దీన్ని వెంటనే తగ్గించుకోవడానికి యాంటీ బయోటిక్ మందులను మింగేస్తాం.

యాంటీబయోటిక్ నుంచి తప్పించుకోవడానికి బ్యాక్టీరియా తన సెల్ వాల్‌ను మార్చుకుంటుంది. బ్యాక్టీరియా తనలో టాక్సిన్స్, కెమికల్స్ ఉత్పత్తిని పెంచుకొని యాంటీబయోటిక్‌లకు రెసిస్టెన్స్‌ను పెంచుకుంటుంది. బ్యాక్టీరియా తన రూపాన్ని, గుణాలను మార్పు చేసుకొని యాంటీబయోటిక్‌లకు దొరక్కుండా తయారౌతుంది. పోలీసుల నుంచి దొంగలు చాకచక్యంగా తప్పించుకున్నట్టుగా బ్యాక్టీరియా కూడా యాంటీబయోటిక్‌ల నుంచి తప్పించుకొని తిరుగుతుంటుంది.
ఎన్నిరకాల యాంటీబయోటిక్‌లను ప్రయోగించినా బ్యాక్టీరియా వాటితో పోరాడి నిలుస్తూనే వుంటుంది. కాబట్టి యాంటీబాడీల వాడకాన్ని ఎంత తగ్గిస్తే శరీరంలో బ్యాక్టీరియా అంత ప్రమాదకరంగా మారకుండా వుంటాయ్. ఎమర్జెన్సీలో మాత్రమే యాంటీబయోటిక్‌లను ఉపయోగించాలి. చిన్న చిన్న రోగాలకు కూడా యాంటీబయోటిక్‌లను ఎక్కువగా ఉపయోగిస్తే రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ రాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి.
ఇక ఇప్పటి నుంచి మీకు ఏ జలుబూ, దగ్గూ, తలనొప్పి వచ్చినా వెంటనే యాంటీబయోటిక్‌లను వాడవద్దు. ముందుగా ఇంట్లో పెద్దవాళ్లు వుంటే వారిని ఏదైనా చిట్కా అడగండి. జలుబు వేసినప్పుడు పాలల్లో పసుపు వేసుకొని, మిరియాలు వేసుకొని కాగపెట్టి తాగితే జలుబు త్వరగా తగ్గిపోతుంది. అదే విపరీతమైన దగ్గువస్తే గనుక కొంత వామును తీసుకొని దవడ దెగ్గర పెట్టుకొని ఆ రసాన్ని పీల్చడం వల్ల దగ్గు తొందరగా తగ్గుతుంది. విపరీతంగా మోషన్స్ అయితే గనుక గసగసాల్లో కొంత చెక్కర వేసుకొని రెండూ కలుపుకొని తీసుకోవడం వల్ల మంచి ఫలితం వుంటుంది. యాంటీబయోటిక్లను వాడే ముందు ఈ చిట్కాలను ట్రై చేయండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications