Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
నెల రోజులైనా పచ్చిమిర్చి తాజాగా ఉండాలా? ఈ ఒక్క ట్రిక్ పాటిస్తే చాలు!
మన దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పేదవారైనా, ధనవంతులైనా అందరి ఇళ్లలో తప్పక పచ్చిమిరపకాయ ఉంటుంది. కూరలో ఘాటైన కారం కావాలన్నా, పచ్చడికి అద్భుతమైన రుచి రావాలన్నా, వేడివేడి బజ్జీలతో సాయంత్రాన్ని ఆస్వాదించాలన్నా పచ్చిమిర్చి ఉండాల్సిందే.
అయితే మార్కెట్ కు వెళ్లి తాజా మిరపకాయలను ఏరికోరి తెచ్చుకున్నా మన ఉత్సాహం రెండ్రోజులకే ఆవిరైపోతుంది. ఫ్రిడ్జ్ లో పెట్టిన మిరపకాయలు మెత్తబడి, బూజు పట్టడం, తొడిమల దగ్గర కుళ్లిపోయి, ఒకరకమైన వాసన రావడం మనందరికీ అనుభవమే. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీ పచ్చిమిర్చి నెల రోజులైనా తాజాగా ఉంటాయి. అదెలాగో ఇక్కడ చూడండి.

పచ్చిమిర్చిని తాజాగా ఉంచే సులభమైన పద్ధతులు
తొడిమలు తీసేయండి, ఆయుష్షు పెంచండి
మిరపకాయలు ఎక్కువగా తొడిమల దగ్గర నుంచే కుళ్లిపోవడం మొదలవుతుంది. కాబట్టి మార్కెట్ నుండి తెచ్చిన వెంటనే వాటి తొడిమలన్నింటినీ తీసివేయండి. ఇలా చేయడం వల్ల మిరపకాయల జీవితకాలం కనీసం రెట్టింపు అవుతుంది.
తడి లేకుండా ఆరబెట్టండి
తొడిమలు తీసిన మిరపకాయలను నీటితో శుభ్రంగా కడగండి. ఆ తర్వాత వాటిని ఒక శుభ్రమైన కాటన్ వస్త్రంపై లేదా పేపర్ టవల్ మీద పరిచి, గాలికి పూర్తిగా ఆరనివ్వండి. వాటిపై ఒక్క నీటి చుక్క కూడా ఉండకూడదు.
అవసరమైతే మెత్తటి గుడ్డతో తుడవండి. తేమ ఎంత తక్కువగా ఉంటే మిరపకాయలు అంత ఎక్కువ కాలం ప్రెష్ గా ఉంటాయి.
గాలి చొరబడని డబ్బానే బెస్ట్ ఫ్రెండ్
పూర్తిగా ఆరిన మిరపకాయలను నిల్వ చేయడానికి గాలి చొరబడని డబ్బాను ఉపయోగించడం ఉత్తమమైన మార్గం. డబ్బాలో అడుగున ఒక టిష్యూ పేపర్ లేదా పేపర్ టవల్ వేసి దానిపై మిరపకాయలను ఉంచండి.
ఆ తర్వాత పైన మరో టిష్యూ పేపర్ వేసి మూతపెట్టండి. ఈ టిష్యూ పేపర్ ఏమైనా తేమ ఉంటే పీల్చుకుని మిరపకాయలను పొడిగా ఉంచుతుంది. జిప్ లాక్ బ్యాగ్‌లు కూడా మంచి ప్రత్యామ్నాయమే.
ఫ్రిడ్జ్ లో సరైన చోట భద్రపరచండి
ఈ డబ్బాను ఫ్రిడ్జ్ లోని కూరగాయల ట్రే లో పెట్టండి. ఫ్రిడ్జ్ లోని ఇతర భాగాలతో పోలిస్తే ఇక్కడ ఉష్ణోగ్రత, తేమ నియంత్రణలో ఉంటాయి. ఇది మిరపకాయలు ఎక్కువ కాలం తాజాగా ఉండటానికి సహాయపడుతుంది.
మర్చిపోకూడని ముఖ్య విషయాలు
-మీ మిరపకాయలలో ఏదైనా ఒకటి రంగు మారినా, మెత్తబడినా, లేదా కొద్దిగా కుళ్లినట్లు అనిపించినా వెంటనే దాన్ని తీసి పడేయండి. ఒక్క కుళ్లిన మిరపకాయ మొత్తం డబ్బాలోని మిరపకాయలన్నింటినీ పాడు చేస్తుంది.
-డబ్బాను ప్రతి రెండు, మూడు రోజులకు ఒకసారి తెరిచి చూడండి. మిరపకాయలు బాగానే ఉన్నాయో లేదో గమనించండి. టిష్యూ పేపర్ తడిగా అనిపిస్తే దాన్ని మార్చి కొత్త పొడి పేపర్‌ను వేయండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications