Latest Updates
-
నెలాఖరులో డబ్బు తక్కువైనప్పుడు భార్యాభర్తలు ఒకరితో ఒకరు ఎలా మాట్లాడతారో తెలుసా? -
సమ్మర్లో చల్లచల్లగా మిల్క్‌షేక్, మాక్‌టెయిల్.. ఈ ఫ్రూట్స్‌తో స్పెషల్ డ్రింక్స్ -
కొవిడ్ తెచ్చిన కష్టాలు.. యువతలో పెరుగుతున్న తుంటి మార్పిడి సర్జరీలు.! -
కళ్లలో నీళ్లు తిరుగుతున్నా ఆపకుండా తినేంత టేస్టీ..మహారాష్ట్ర స్పెషల్ తేచ్చా చికెన్..ఈజీగా ఎలా చేయాలంటే.. -
బీట్రూట్, అటుకులతో హాట్ అండ్ స్వీట్ హెల్తీ స్నాక్స్ -
మధురై స్పెషల్ బంగాళాదుంప ఫ్రై..జన్మలో మర్చిపోలేని టేస్ట్..ఇంట్లోనే ఎలా చేయాలంటే.. -
అధిక మాసంలో ఈ 4 వస్తువులు ఇంట్లో ఉంటే చాలా డేంజర్.. వెంటనే తీసేయండి.! -
World cycle day 2026: ప్రపంచ సైకిల్ దినోత్సవం.. ఈ ఏడాది ప్రత్యేక థీమ్ ఇదే.! -
తిన్న వెంటనే కడుపు ఉబ్బిపోతోందా?..ఇలా చేస్తే జీర్ణక్రియ మెరుగుపడి, కడుపు ఉబ్బరం తగ్గిపోతుంది!.. -
‘అద్దం’తో దంపతుల మధ్య తరచూ గొడవలు.. ఎందుకంటే.?
బొప్పాయి తింటున్నారా? అమృతం అనుకుంటే పప్పులో కాలేసినట్లే..ఈ విషయాలు తెలుసుకోండి!
బొప్పాయి పండు పేరు వినగానే దాని అద్భుతమైన రుచి, ఆరోగ్యాన్నిచ్చే గుణాలు గుర్తుకొస్తాయి. ఇందులో విటమిన్లు ఏ, సి, ఈ పుష్కలంగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉండి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో ఉండే పపైన్ అనే ప్రత్యేక ఎంజైమ్ జీర్ణవ్యవస్థకు ఒక వరంలా పనిచేస్తుంది. అందుకే చాలామంది బొప్పాయిని తమ రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటారు.
నాణేనికి మరోవైపు ఉన్నట్లు అపారమైన ప్రయోజనాలున్న బొప్పాయి పండు కొందరి పాలిట విలన్. ముఖ్యంగా పచ్చి బొప్పాయిని లేదా మోతాదుకు మించి బొప్పాయిని తినడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ఆ నష్టాలేంటో ఇక్కడ చూడండి.

మూత్రపిండాల్లో రాళ్ల ముప్పు
ఇప్పటికే కిడ్నీలో రాళ్ల సమస్య ఉందా? అయితే బొప్పాయి విషయంలో, ముఖ్యంగా పచ్చి బొప్పాయి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పండిన బొప్పాయితో పెద్దగా ప్రమాదం లేనప్పటికీ పచ్చి బొప్పాయిలో ఉండే అధిక విటమిన్ సి శరీరంలో ఆక్సలేట్ గా మారుతుంది. ఈ ఆక్సలేట్, కాల్షియంతో కలిసిపోయి కాల్షియం ఆక్సలేట్ రాళ్లను ఏర్పరుస్తుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్ల సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. కాబట్టి ఎంత మంచిదైనా మితంగా తినడమే మేలు.
గర్భిణీ స్త్రీలకు అత్యంత ప్రమాదకరం
గర్భధారణ సమయంలో మహిళలు పచ్చి బొప్పాయికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పచ్చి బొప్పాయిలో ఉండే లేటెక్స్, పపైన్ గర్భాశయ సంకోచాలను ప్రేరేపిస్తాయి. దీనివల్ల నెలలు నిండకముందే ప్రసవ నొప్పులు రావడం, కొన్నిసార్లు గర్భస్రావం జరిగే ప్రమాదం కూడా ఉంది. అందుకే గర్భిణీ స్త్రీలు బొప్పాయిని తినే ముందు డాక్టర్ ని సంప్రదించడం తప్పనిసరి.
అలెర్జీలతో ఇబ్బందులు
కొంతమందికి బొప్పాయి తిన్న వెంటనే తుమ్ములు, దురద లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఎదురవుతాయి. దీనికి కారణం బొప్పాయిలో ఉండే చిటినేస్ అనే ఎంజైమ్. ముఖ్యంగా లేటెక్స్ అలెర్జీ ఉన్నవారు పచ్చి బొప్పాయిని అస్సలు తినకూడదు. ఇది కొన్నిసార్లు తీవ్రమైన అలెర్జీకి దారితీసి శ్వాసనాళంలో వాపుకు కారణం కావచ్చు.
గుండె జబ్బులున్న వారు జాగ్రత్త
పచ్చి బొప్పాయిలో సైనోజెనిక్ గ్లైకోసైడ్స్ అనే రసాయన సమ్మేళనాలు చాలా స్వల్ప మోతాదులో ఉంటాయి. ఇవి శరీరంలోకి వెళ్ళాక హైడ్రోజన్ సైనైడ్ ను విడుదల చేస్తాయి. ఇది హార్ట్ బీట్ రేటును అస్తవ్యస్తం చేస్తుంది. ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు పచ్చి బొప్పాయిని తీసుకునే ముందు తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి.
థైరాయిడ్ పనితీరుపై ప్రభావం
హైపోథైరాయిడిజం వంటి థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు పచ్చి బొప్పాయి వినియోగంలో అప్రమత్తంగా ఉండాలి. బొప్పాయిలోని కొన్ని పదార్థాలు థైరాయిడ్ గ్రంథి పనితీరుకు ఆటంకం కలిగించవచ్చు. ఇది శరీరంలో అయోడిన్ గ్రహించడాన్ని తగ్గించి, అలసట, బరువు పెరగడం వంటి సమస్యలకు దారితీస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications