Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఈ సమస్యలు ఉన్నవారు టమోటాలను తినకూడదు.. వెంటనే చెక్ చేసుకోండి, లేకపోతే పెద్ద ప్రమాదమే!
టమోటాలు లేకుండా ఏ వంట కూడా పూర్తి కాదు. సాధారణమైన వంట నుంచి చికెన్, మటన్ వరకు ప్రతీదాంట్లో టమోటాలను వినియోగిస్తూ ఉంటారు. టమోటాల్లో ఎన్నో రకాల ఔషధ గుణాలు, ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఉన్నాయి. క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ సీ, యాంటీ యాక్సిడెంట్లు కూడా మెండుగా లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
టమోటాలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభించినా.. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న వ్యక్తులు టమోటాలను తినకూడదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అలాంటి వ్యక్తులు టమోటాలను ఎక్కువగా తినడం వల్ల ఆ సమస్యలు అధికమవడంతో పాటు, అనేక రోగాల బారిన పడే అవకాశం ఉటుందట. అయితే ఎలాంటి వ్యక్తులు టమోటాలను తినకూడదు ఇప్పుడు తెలుసుకుందాం.

కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్న వ్యక్తులు..
ఈ మధ్య కాలంలో చాలా మందిని బాధించే అతిపెద్ద సమస్య కిడ్నీలో రాళ్లు ఉండడం. అయితే కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్న వ్యక్తులు టమోటాలను ఎక్కువగా తినకూడదని ఆయుర్వేద నిపుణులతో పాటు ఆరోగ్య నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. టమోటాల్లో కాల్షియం ఆక్సలేట్ అనేది పుష్కలంగా ఉంటుంది. ఇది కిడ్నీలో రాళ్ల సమస్యను ఇంకా తీవ్రతరం చేస్తుందట. అందుకే కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్న వ్యక్తులు.. టమోటాలను తినకూడదని, తింటే కొన్ని కొన్ని సార్లు మూత్రపిండాలు కూడా దెబ్బతినే ప్రమాదముందని చెబుతున్నారు.
కీళ్ల వాపు, నొప్పి ఉన్న వ్యక్తులు..
కీళ్ల వాపు, కీళ్ల నొప్పులతో బాధ పడుతున్న వ్యక్తులు టమోటాల జోలికి ఎంత తక్కువగా పోతే అంత మంచిదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే టమోటాల్లో సోలనిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. ఇది మన కణాల్లో క్యాల్షియం ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. క్యాల్షియం ఎక్కువైతే కీళ్ల వాపు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు ఎక్కువవుతాయి. కొన్నిసార్లు నడవడం, కూర్చోవడం, కదలడం కూడా ఇబ్బందిగా మారుతుందట. ఈ సమస్యలు ఉన్న వారు టమాటాలు తినకూడదని చెబుతున్నారు.

అలర్జీ సమస్యలు ఉన్నవారు..
టమోటాల్లో హిస్టామిన్ అనే పదార్ధం ఉంటుంది. దీనిని ఎక్కువగా తినడం వల్ల అలర్జీ సమస్యలు వస్తాయి. అందుకే ఇప్పటికే అలర్జీ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు టమోటాలను ఎక్కువగా తినకూడదని ఆరోగ్య నిపుణులతో పాటు ఆయుర్వేద నిపుణులు కూడా చెబుతున్నారు. ఈ సమస్యలు ఉన్న వ్యక్తులు టమోటాలను ఎక్కువగా తినడం వల్ల.. గొంతులో చికాకు, తుమ్ములు, ముఖం, నోటి వాపు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందట. ఒకవేళ మీకు ఇప్పుడే ఇలాంటి సమస్యలు ఉంటే.. టమోటాలను తక్కువగా తినాలట.
గ్యాస్ సమస్యలు ఉన్న వ్యక్తులు..
ఇప్పటికే గ్యాస్ సమస్యలతో బాధ పడుతున్న వ్యక్తులు టొమాటోలు తక్కువగా తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. టమోటాల్లో ఆమ్ల పదార్ధం ఎక్కువగా ఉంటుంది. దీనిని అధికంగా తినడం వల్ల గ్యాస్ట్రిక్ యాసిడ్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. దీంతో గ్యాస్ సమస్య ఎక్కువగా అయ్యే ప్రమాదముంది. అలాగే గుండెలో మంట, కడుపులో మంట, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి. అందుకే గ్యాస్ సమస్యలు ఉన్న వ్యక్తులు టమోటాలను తక్కువగా తినాలి.
రక్తం గడ్డ కట్టదు..
సాధారణంగా ఎప్పుడైనా దెబ్బ తగిలేటప్పుడు రక్తం తొందరగా గడ్డ కట్టి, రక్తస్రావం కాకుండా ఉంటే చాలా మంచిది. కానీ టమోటాలను ఎక్కువగా తినడం వల్ల రక్తం గడ్డకట్టే స్థాయిని తక్కువగా చేస్తుందట. రక్తం పలుచగా ఉన్న వ్యక్తులు ఈ టమోటాల జోలికి ఎంత తక్కువగా వెళ్తే అంత మంచిదని పేర్కొంటున్నారు.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. వీటిని పాటించే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications