Latest Updates
-
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.!
పీరియడ్స్ లేదా నెలసరి సమయంలో నొప్పితో బాధపడుతున్నారా? అయితే ఇప్పుడే ఈ అలవాట్లు మానుకోండి..
పీరియడ్స్ ప్రారంభం కావడానికి కొద్ది రోజుల ముందు నుంచే జీవన శైలి లో కొన్ని చిన్నచిన్న మార్పులు చేసుకోవడం వల్ల ఈ రుతుక్రమ సమయంలో అసౌకర్యాలు, నొప్పి నుంచి విముక్తి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
పీరియడ్స్ సమయంలో నడుము నొప్పి, కడుపు నొప్పి, క్రాంప్స్ తో బాధపడుతున్నారా? వేడి నీటి బాటిల్ తో కాపడం పెట్టుకుంటూ, హెర్బల్ టీ తాగుతూ, వెచ్చని నీటి స్నానం చేసి రోజంతా మంచంపై గడపాలని అనిపిస్తోందా? ఏపని చేసేందుకు శరీరం సహకరించడం లేదా? ఇక్కడ కొన్ని పీరియడ్స్ సమయంలో ఉపయోగపడే విషయాలున్నాయి.

ఉప్పగా ఉండే స్నాక్స్, సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోకూడదు, మరీ ఎక్కువ బిజీగా కూడా ఉండకూడదు అని నిపుణులు కొన్ని సలహాలు ఇస్తున్నారు. పీరియడ్స్ ముందు, పీరియడ్స్లో చెయ్యకూడని పనులేమిటో, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం.
కాఫీ వద్దు
కాఫీలో ఉండే కెఫిన్ వల్ల టెన్షన్ వంటి పీరియడ్ లక్షణాలు మరింత పెరుగుతాయి. హార్మోన్ల ప్రసారాన్ని కెఫిన్ నియంత్రించడం వల్ల రక్తనాళాలు కుంచించుకు పోతాయి. అందువల్ల రక్త ప్రసరణ నెమ్మదిస్తుంది. 2014 -16 మధ్య జరిగిన అనేక అధ్యయనాలు తెలుపుతున్నదేమిటంటే ఒక్క కప్పు కాఫీ కూడా నొప్పిని రెట్టింపు చేస్తుందట. అంతేకాదు కెఫిన్ వల్ల చికాకు, మూడ్ స్వింగ్స్, యాంగ్జైటీ పెరిగిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఉప్పటి స్నాక్స్
సోడియం ఎక్కువ గా తీసుకోవడం పీరియడ్ సమయంలో అనారోగ్యకరం. ఎక్కువ ఉప్పు కలిగిన పదార్థాలు తీసుకోవడం వల్ల కడుపుబ్బరం, శరీరం నీరు పట్టడం వంటి సమస్యలు మరింత ఎక్కువ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇన్ఫ్లమేషన్ కూడా పెరిగి పీరియడ్స్ మరింత బాధిస్తుంది. ఇనకనుక ఉప్పు ఎక్కువ గా ఉండే ఊరగాయలు, చిప్స్, ఇతర ప్యాక్డ్ ఫూడ్ తినకపోవడం పీరియడ్స్ సమయంలో అవసరం.

భోజనం మానకూడదు
చాలా మందికి వికారంగా ఉండి ఏమీ తినాలని అనిపించదు. అయినా సరే రెగ్యులర్ గా తీసుకునే ఆహారాన్ని తినకుండా ఉండకూడదు. రోజువారీ భోజనం తీసుకోకపోతే పోషకాల లోపం ఏర్పడి శక్తి సన్నగిల్లుతుంది. ఓవారాల్ హెల్త్ మీద ప్రభావం చూపిస్తుంది. సమయానికి భోంచెయ్యకపోతే వికారం కూడా పెరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు
చక్కెర మీద నియంత్రణ
చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి పోవడం మాత్రమే కాదు కడుపు ఉబ్బరానికి కూడా కారణం కావచ్చు. తాత్కాలికంగా ఆనందాన్ని ఇచ్చినా తర్వాత కాలంలో సమస్యలను మరింత పెరిగేట్టు చేస్తుంది. ప్రాసెస్ చేసిన చక్కెరలు కడుపులో మంట, ఉబ్బరంతో పాటు పీరియడ్ అసౌకర్యాన్ని పెంచుతాయి.
పొగతాగడం
పొగతాగే అలవాటున్న స్త్రీలలో ప్రిమెన్సువల్ సిమ్టమ్స్ 50 శాతం వరకు ఎక్కువగా ఉండడాన్ని గమనించారట. ఎంత ఎక్కువ పొగతాగితే అంత ఎక్కువ లక్షణాలు ఇబ్బంది పెడతాయట. పాసివ్ స్మోకింగ్ అంటే సిగరెట్ తాగేవారి పరిసరాల్లో సమయం గడిపేవారిలో కూడా సమస్య ఎక్కువగానే ఉంటుందట. స్మోకింగ్ రక్తనాళాల వ్యాసార్థం తగ్గిస్తుంది. గర్భాశయ రక్తనాళాలు సంకోచిస్తే నొప్పి మరింత ఎక్కువగా ఉంటుంది.
బూజింగ్ వద్దు
మూడ్ బాలేకపోవడం వల్ల ఆల్కహాల్ తీసుకోవాలని అనిపించడం సహజమే. కానీ అది ప్రిమెన్స్ ట్రువల్ సమయంలో అయితే మీ మూడ్ ను మరింత పాడు చెయ్యవచ్చు అని నిపుణులు హెచ్చిరిస్తున్నారు. ఆల్కాహాల్ హార్మోన్ల మీద ప్రభావం చూపుతుంది అందువల్ల ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ రెండూ కూడా పెరిగిపోవచ్చు. అందువల్ల ప్రిమెన్స్ట్ ట్రువల్ సింమ్టమ్స్ మరింత పెరిగిపోయి విసుగు, చిరాకు ఎక్కువవుతాయట.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి 'తెలుగు బోల్డ్ స్కై' ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు.



Click it and Unblock the Notifications