Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.!
ముఖంపై మొటిమలు రావడం సహజమే. కానీ కొన్ని సందర్భాల్లో ఈ మొటిమలు కేవలం చర్మ సమస్య మాత్రమే కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వాటికి పలు కారణాలు ఉండవచ్చని చెబుతున్నారు. జీవనశైలి మార్పులు, ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, కాలుష్యం, ఆహారపు అలవాట్లు మొటిమల సమస్యను తీవ్రతరం చేస్తాయని హెచ్చరిస్తున్నారు.

చాలా మంది మొటిమలు కేవలం జిడ్డు చర్మం లేదా మురికి వల్ల మాత్రమే వస్తాయని భావిస్తుంటారు. కానీ ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. చర్మ రంధ్రాలు అధిక నూనె, మృత చర్మ కణాలు, బ్యాక్టీరియాతో మూసుకుపోయినప్పుడు మొటిమలు వస్తుంటాయి.
నూనె గ్రంథులు
కాగా, చర్మంపై నూనె గ్రంథులు అధికంగా నూనెను ఉత్పత్తి చేసినప్పుడు, మృతకణాలు దానితో కలిసి రంధ్రాలను మూసుకుపోయే చేస్తాయి. ఈ మూసుకుపోయిన ప్రదేశంలో బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. ఈ క్రమంలో రోగనిరోధక వ్యవస్థ వాటిని తొలగించడానికి వాపును ప్రేరేపించేలా చేయడంతో ముఖంపై ఎర్రగా, నొప్పిగా, చీముతో నిండిన మొటిమలు ఏర్పడతాయి. అందుకే కేవలం ముఖాన్ని మాత్రమే శుభ్రం చేసుకుంటే సరిపోదని.. చర్మం లోపల కూడా ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.
హార్మోన్ల మార్పులు
ముఖంపై మొటిమలకు ప్రధాన కారణాల్లో హార్మోన్ల అసమతుల్యత కూడా ఒక కారణమని డెర్మటాలజిస్టు నిపుణులు చెబుతున్నారు. కౌమారదశలో ఆండ్రోజెన్ హార్మోన్లు పెరుగుతాయి. ఫలితంగా నూనె గ్రంథులు మరింత చురుకుగా మారుతాయి. అధికంగా సెబమ్ ఉత్పత్తి అయి మొటిమలు వచ్చేలా చేస్తుంది.

రుతుక్రమం, గర్భం, మెనోపాజ్ లేదా పీసీఓఎస్ వంటి పరిస్థితుల్లోనూ హార్మోన్ల హెచ్చుతగ్గుల కారణంగా కూడా మహిళల్లో మొటిమలు పెరిగే సూచనలు ఉన్నాయి. రుతుస్రావం, హార్మోన్ల మార్పుల కారణంగా మహిళలకు మొటిమల సమస్యలు రావడమనేది సర్వసాధారణంగా భావించాలి.
ఈ అలవాట్లతో మరింత ప్రమాదం
అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు, తీపి పానీయాలు, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు అధికంగా తీసుకోవడం వల్ల మొటిమల ప్రమాదం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తగినంత నిద్ర లేకపోవడం, నిరంతరం ఒత్తిడికి గురికావడం, ధూమపానం వంటి అలవాట్లు మొటిమలకు దారితీస్తాయి. ఈ క్రమంలో మొటిమలు ఉన్నప్పుడు ముఖాన్ని పదేపదే కడుక్కోవడం, వాటిని పగలగొట్టడానికి ప్రయత్నించడం చేస్తుంటారు. ఇలా చేయడం ద్వారా స్కిన్ ఇన్ఫెక్షన్‌కి గురి అవుతుంది. మచ్చలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. అతిగా స్క్రబ్ చేయడం, వైద్యుల సలహా లేకుండా స్టెరాయిడ్ క్రీమ్ రాయడం కూడా చర్మంపై దుష్ప్రభావం పెంచుతుంది.
మొటిమల నివారణ చిట్కాలు
ముఖంపై మొటిమల నివారణ కోసం డెర్మటాలజిస్టు నిపుణుల సలహా మేరకు కొన్ని క్రీములు వాడవచ్చు. ముఖంపై దుమ్ము, ధూళి కనబడకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. సరైన సమతుల్య ఆహారం తీసుకోవాలి. పుష్కలంగా నీరు తాగాలి. ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం ద్వారా మొటిమలు రాకుండా చర్మాన్ని కాపాడుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications