Latest Updates
-
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
Pigeon Droppings: పావురమే కదా అని దగ్గరికి వెళ్ళారో ప్రాణాంతక వ్యాధులు కొని తెచ్చుకున్నట్లే
Pigeon Droppings: పావురాలు శాంతికి చిహ్నాం. అంతే కాదు ప్రేమికులకు చాలా ఇష్టమైన పక్షి కూడా. పావురాన్ని ఇల్లల్లో పెంచుకోవడంతో పాటు బయట ప్రాంతాల్లో వాటితో గడపేందుకు ముచ్చటపడుతుంటారు. అయితే ఆ పావురం వల్ల మనిషి ప్రాణాలకు ముప్పు ఉందని మీకు తెలుసా? వాటి వల్ల మనిషికి వస్తున్న ముప్పేంటో మీకు తెలుసా? పావురాలను మనం ప్రేమిస్తుంటే వాటి ఎఫెక్ట్ తో మనిషి ప్రాణాలకు ముప్పు వస్తోంది అని రీసెంట్ గా ఒక స్టడీలో కనుగొన్నారు. పక్షులు మరియు సాధుజంతువులను ఇల్లలో పెంచుకోవడం వాటికి ఆహారం ఇవ్వడం సహజం. అయితే, ఇప్పుడు పట్టణాలు, నగరాల్లో పక్షులు తక్కువగా కనిపిస్తున్నాయి. కానీ ఎక్కువగా కనిపించే పక్షి పావురం. ఇళ్ల డాబాల మీద రేషన్ షాపులు ఆహార పదార్థాలు దొరికే ప్రదేశాలు, రోడ్ల పక్కన పావురాల గుంపులు గుంపులుగా గింజలు తింటూ ఉంటాయి.
ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూర్ వంటి జంటనగరాల్లో పావురాలు ఎక్కడపడితే అక్కడ కనబడుతుంటాయి. పావురాలు కనిపించాయి కదా అని వాటి వద్దకు వెళితే ఇక అంతే సంగతులు. ప్రాణాంతక వ్యాధులను కొని తెచ్చుకున్నట్లే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవును, ఇది వాస్తవం ఒకప్పుడు సమాచారాన్ని చేరవేసే రాయబారి పాత్ర పోషించే పావురాలు ఇన్ఫెక్షన్ల వ్యాధికి కారకాలుగా మారయంటే ఆశ్చర్యం కలుగుతుంది.

పావురాలకు మూత్రకోశం లేకపోవడం వల్ల విసర్జనలోనే మలమూత్రాలు ఉంటాయి. వీటి రెట్టల నుండి విసర్జక సూక్ష్మ క్రిములు గాల్లో కలిసిపోతాయి. వీటి రెక్కల నుండి, ఈకల ద్వారా వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ ఏసీలలోకి చేరుతాయి. ఆ గాలిని పీల్చుకోవడం ద్వారా ప్రజలు వ్యాధిగ్రస్తులు అవుతున్నారు. అయితే ఈ విషయం తెలియని ప్రజలు ఆ పావురాలతో గడిపేందుకు మాత్రం ఇష్టపడుతున్నారు.
ప్రమాదకరమైనవిగా భావించని పావురాలు బాల్కనీలు మరియు ఇంటి పైకప్పులపై పావురాల రెట్టలు వాస్తవానికి అలెర్జీలకు కారణమవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. పీజియన్స్ డ్రాపింగ్స్ (Pigeon Droppings) పావురాల వల్ల ప్రాణాంతక వ్యాధి వస్తుంది. అవును పావురాల రెట్టల వల్ల శ్వాసకోశ సంబంధింత వ్యాధులు చాలా వరకు వస్తున్నాయి. రీసెంట్ గా ఢిల్లీకి చెందిన 11 ఏళ్ళ బాలుడు పావురపు రెక్కలు, ఈకల ద్వారా తీవ్రమైన అలెర్జీకి గురై సర్ గంగారామ్ హస్పిటల్లో చికిత్స పొందుతున్నాడని ఒక కేస్ స్టడీ ద్వారా వెల్లడైంది.
హైపర్సెన్సిటివిటీ న్యుమోనిటిస్ (HP)
ఈ బాలుడు కొన్ని రోజులు నుండి దగ్గుతో బాధపడుతున్నాడని, అయితే చికిత్స చేయించినా తగ్గకపోవడంతో బాలుడిని ఆస్పత్రికి తరలించినట్లు అధ్యయనంలో తేలింది. అయితే అప్పటికే ఆలస్యం అయింది. అతినిలో ఊపిరితిత్తులు ఎక్కువగా వాపుతో, శ్వాసకోశ పూర్తిగా దెబ్బతింది. ఈ బాలుడికి పావురం ప్రొటీన్‌కు అలర్జీ కారణంగా హైపర్‌సెన్సిటివిటీ న్యుమోనైటిస్ (హెచ్‌పి) ఉన్నట్లు నిర్థారించారు. అయితే ఈ వ్యాధి పిల్లకు మాత్రమే కాదు పెద్దలకు కూడా సోకుతుంది, ఇది సంవత్సరంలో దాదాపు ఒక లక్ష మందిలో కనీసం 5 నుండి 6 మంది దీని భారీన పడుతున్నారాని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

లక్షణాలు ఎలా ఉంటాయి
- పీజియన్స్ డ్రాపింగ్స్ (Pigeon Droppings) పావురాల రెట్ట వల్ల వ్యాపించే వ్యాధి లక్షణాలు అలర్జిక్ బ్రొంకియాల్ ఆస్తమాలాగా ఉంటుంది.
- జలుబు, జ్వరంతో మొదలవుతుంది.
- దగ్గు, దమ్ము(ఊపిరితిత్తుల్లో నెమ్ము దిగడం) వంటివి వస్తాయి.
- ఆయాసం.
- ముఖ్యంగా ఇది ఇమ్యునో కాంప్రమైజ్ ఉన్న వారిలో చాలా సివిరియగా ఉంటుంది. దీన్ని కనుక్కోవడానికి కూడా కొంత సమయం పడుతుందని వైద్యనిపుణులు అంటున్నారు. ఈ అలర్జిక్ బ్రొంకియాల్ ఆస్తమా పావురాల నుండే వస్తుందా? అన్నది కనుక్కోవడానికి సమయం పడుతుంది.
శ్వాసకోస వ్యాధులు తీవ్రం అయిపోయి, వారిని వెంటిలేటర్ మీద పెట్టాల్సి వస్తుంది. రానురాను అంత సీరియస్ అయిపోతుంది. కాబట్టి పావురమే కదా అని దగ్గరికి వెళ్ళారో వ్యాధులు కొని తెచ్చుకున్నట్లే
నివారణ
ఈ వ్యాధిని నివారించడానికి, మీ ఇంటి చుట్టూ ఉన్న పావురం రెట్టలు మరియు ఈకలను తొలగించడం చాలా ముఖ్యం.
అలాగే, పావురాల మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో చేరకుండా లేదా గూడు కట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి.
పావురాలు ఇంట్లోకి రాకుండా నెట్ ఉపయోగించండి.
ఇంటి పై కప్పులపై పరిసరాలు తరచు శుభ్రం చేసుకోండి. శుభ్రం చేసే ముందు చేతులకు ముక్కుకు తొడుగులు ధరించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











