Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
ఇంట్లో ఈ ఒక్క మొక్క ఉంటే చాలు.. ఇక మిమ్మల్ని ప్రపంచంలో ఎవరూ ఆపలేరు!.. రోగాలు అన్ని మాయం!
ఇంట్లో తులసి చెట్టు ఉంటే దేవతల అనుగ్రహం ఉంటుందని, అదే మనీ ప్లాంట్ ఉంటే డబ్బులు కొదవ లేకుండా ఉంటామని చాలా మంది చెప్తుంటారు. అందుకు తగినట్టుగానే ఆ చెట్లను తమ తమ ఇంట్లో లేదా పెరట్లో పెంచుకుంటూ ఉంటారు. అయితే చెట్లకు ఈ కారణాలతో పాటు వేరే ఇతర ప్రయోజకర కారణాలు కూడా ఉంటాయి. అందుకే వీటిని ఇంట్లో పెంచుకునేందుకు చాలా మంది మొగ్గుచూపుతుంటారు.
అయితే ఇలాంటిదే ఒక చెట్టు ఉంది. అదే వైజయంతి మాల లేదా పెర్ల్ ప్లాంట్ అని కూడ పిలుస్తుంటారు. ఈ చెట్టుకు సంబంధించిన పూలను కృష్ణుడి పూజలో వినియోగిస్తారు. మొగ్గగ్గ ఉన్నపుడే వాటిని కోసి, పువ్వుగా మార్చిన తరువాత పూజలో ఉపయోగిస్తారు. ఈ చెట్లు ఎక్కువగా నీది ఎద్దడి ఉన్న ప్రదేశాల్లో కనిపిస్తుంటాయి. మరీ ముఖ్యంగా గుజరాత్‌లో కచ్ వంటి ప్రాతాల్లో దర్శనమిస్తాయి. అయితే ఈ చెట్టును ఇంట్లో పెంచుకుంటే ఎలాంటి ఫలితాలు పొందుతాము? ఏ విధమైన ప్రయోజనాలు దక్కుతాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

శ్వాసకోశ సమస్యలు దూరం..
ఈ చెట్టుకు ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ చెట్టు కాండం నుంచి పూల వరకు ప్రతిదాన్ని ఆయుర్వేదంలో వినియోగిస్తుంటారు. ఈ చెట్టు పండు, పువ్వులోని ఔషధ గుణాలు చాలా వ్యాధులను నయం చేస్తాయి. వాటిలో శ్వాసకోశ వ్యాధులు కూడా ఉన్నాయి. ఈ చెట్టు నుంచి వచ్చిన పండ్లను తింటే ఊపిరితిత్తుల్లోని మంటను తగ్గిస్తుంది. అలాగే శ్వాసకోశ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడే వ్యక్తులు ఈ చెట్టును ఇంట్లో పెంచుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు. తక్షణమే వీటి పండును తినడంతో పాటు ఈ చెట్టు కాసాయాన్ని తాగడం వల్ల ఊపిరి తిత్తుల సమస్యల బారిన నుంచి బయటపడొచ్చు.
వైరల్ ఇన్ఫెక్షన్స్ మటుమాయం..
వైజయంతి మాల పూలలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. ఈ పూల రసాన్ని తాగడం వల్ల.. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే మన శరీరానికి కావాల్సిన ఇమ్యూనిటీని అందిస్తుంది. తద్వారా వైరల్ ఇన్ఫెక్షన్స్, ఇతర వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఈ చెట్టు పండ్లలోని యాంటీ వైరల్ లక్షణాలు రక్తంలోని ఇన్ఫెక్షన్‌ను తగ్గించి.. రోగ విముక్తి కలిగిస్తుంది.
చర్మ సౌందర్యానికి కూడా..
ఈ మొక్కలోని ఔషధ గుణాలు మూత్రపిండాల సమస్యలను సైతం నయం చేస్తుందట. అలాగే వాటి పని తీరును మెరుగుపరిచి మంచి ఫలితాలను నదించనుంది. ఈ మొక్కలోని సారం చర్మ సౌందర్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఎన్నో చర్మ సౌందర్య ఉత్పత్తుల్లో దీనిని వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు చర్మాన్ని కాంతి వంతంగా, యవ్వనంగా ఉంచుతుందట.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. వీటిని పాటించేముందు తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకోవాలి. వీటితో బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి సంబంధం లేదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications