Latest Updates
-
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే.. -
ఫోన్ పక్కనపెట్టి ఇది ట్రై చేయండి.. హృతిక్ చెబుతున్న హెల్త్ టిప్స్! -
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.! -
చికెన్, మటన్ కంటే 50 రెట్లు బలం..ఏడాది పాటు నిల్వ ఉండే బోడకాకరకాయ పచ్చడి ఇలా చేయండి
పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నారా? అయితే ప్రెగ్నెన్సీ ముందే ఈ టెస్టులు తప్పనిసరి!
జీవితంలో తల్లిదండ్రులు కావడం అనేది ప్రతి జంట కలలు కనే అద్భుతమైన ఘట్టం. ఇంట్లోకి చిట్టి అడుగులు పడబోతున్నాయంటే ఆ సంతోషం మాటల్లో చెప్పలేనిది. అయితే బిడ్డను కనాలని ప్లాన్ చేసుకోవడం కేవలం మానసిక సిద్ధబాటు మాత్రమే కాదు.. శారీరకంగా కూడా పూర్తి ఆరోగ్యంతో ఉండటం అంతే ముఖ్యం.
చాలామంది మహిళలు గర్భం దాల్చిన తర్వాతే డాక్టర్ దగ్గరకు పరుగెత్తుతారు. కానీ గర్భధారణకు ముందుగానే కొన్ని వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల భవిష్యత్తులో తలెత్తే అనవసరమైన ప్రమాదాలను చాలా వరకు అరికట్టవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దాగి ఉన్న ఆరోగ్య సమస్యలు, పోషకాహార లోపాలు లేదా ఇన్ఫెక్షన్లను ముందుగానే గుర్తించి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా పండంటి బిడ్డకు జన్మనివ్వవచ్చు.

కాబోయే అమ్మలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన పరీక్షలు
హార్మోన్ల బ్యాలెన్స్ టెస్టులు: గర్భధారణకు హార్మోన్లు చాలా కీలకం. థైరాయిడ్, ప్రోలాక్టిన్ వంటి పునరుత్పత్తి హార్మోన్ల స్థాయిలు సరిగ్గా ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. ఇవి హెచ్చుతగ్గులుగా ఉంటే నెలసరి సమస్యలు వచ్చి గర్భం దాల్చడం కష్టమవుతుంది.
అండాశయ రిజర్వ్ (AMH)టెస్ట్: ఈ రోజుల్లో కెరీర్ వల్ల లేదా ఇతర కారణాల వల్ల పిల్లలను ఆలస్యంగా కనాలని ప్లాన్ చేయడం సాధారణమైంది. ఇలాంటి వారు కచ్చితంగా యాంటీ ముల్లెరియన్ హార్మోన్ (AMH) టెస్ట్ చేయించుకోవాలి. ఇది అండాశయంలో ఎగ్స్ నిల్వ, నాణ్యతను తెలియజేస్తుంది.
పెల్విక్ అల్ట్రాసౌండ్ స్కాన్: గర్భాశయం, అండాశయాల పనితీరును తెలుసుకోవడానికి ఈ స్కాన్ చేస్తారు. పీసీఓఎస్ (PCOS), ఫైబ్రాయిడ్లు లేదా నీటి బుడగలు లాంటివి ఏమైనా ఉంటే ముందుగానే గుర్తించి సులభంగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.
ఇన్ఫెక్షన్ స్క్రీనింగ్: తల్లి నుంచి బిడ్డకు ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉండాలంటే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, HIV, రుబెల్లా వంటి వాటికి రక్త పరీక్షలు చేయించుకుని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
షుగర్, హిమోగ్లోబిన్ టెస్టులు: మాతృత్వానికి రక్తహీనత (ఎనీమియా) పెద్ద అడ్డంకి. అలాగే డయాబెటిస్ కూడా ప్రమాదకరం. రక్తంలో షుగర్ లెవల్స్, హిమోగ్లోబిన్ శాతాన్ని చెక్ చేసుకుని కంట్రోల్ లో ఉంచుకోవడం ఆరోగ్యకరమైన గర్భధారణకు పునాది.
కాబోయే నాన్నలు చేయించుకోవాల్సిన ముఖ్యమైన పరీక్షలు
గర్భధారణలో కేవలం మహిళల ఆరోగ్యమే కాదు, పురుషుల ఆరోగ్యం కూడా 50 శాతం కీలక పాత్ర పోషిస్తుంది.
వీర్య కణాల విశ్లేషణ : పురుషుల్లో స్పెర్మ్ కౌంట్, వాటి కదలిక, ఆకృతి ఎలా ఉన్నాయో తెలుసుకోవడం చాలా అవసరం. సంతానోత్పత్తిలో ఇదే ప్రధానం.
హార్మోన్ల పరీక్ష: టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిలు తగ్గితే అది వీర్యోత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి హార్మోన్ల చెకప్ ముఖ్యం.
సాధారణ ఆరోగ్య పరీక్షలు: మారుతున్న జీవనశైలి వల్ల వచ్చే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేయకూడదు.
ఎస్టీడీ (STD) పరీక్షలు: లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్లు ఉన్నాయో లేదో నిర్ధారించుకోవడం వల్ల భాగస్వామికి, పుట్టబోయే బిడ్డకు వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications