Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఇవి తింటే మీ చర్మం మెరిసిపోతుందట..అందంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇచ్చే ఆహారాలివే
ఈ రోజుల్లో శరీరంలో లోపల అవయువాలను ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో బయట కనిపించే చర్మాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే, ఆహారంపై శ్రద్ధ వహించడం తప్పనిసరి. అసలైన అందాన్ని పెంచుకోవడానికి ఇది శాశ్వత పరిష్కారం. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన పోషణను అందించే కొన్ని మొక్కల ఆహారాలు ఉన్నాయి. వీటిలోని పోషకాలు చర్మాన్ని సమస్య లేకుండా ఉంచడంలో సహాయపడతాయి. దీంతో మీ చర్మం ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంటుంది. ఆ ఆహారాలు ఏంటో ఇక్కడ చూడండి.
అవకాడో
ఆవకాడోలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ అవకాడోలో పుష్కలంగా లభిస్తాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి, కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. ముడుతలను తొలగిస్తాయి.

నీరు అధికంగా ఉండే పండ్లు,కూరగాయలు
మీరు మీ ఆహారంలో పుచ్చకాయ, గుమ్మడికాయ, దోసకాయ, టొమాటో, పాలకూర, స్ట్రాబెర్రీ వంటి నీరు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను తీసుకుంటే అవి చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడతాయి. చర్మం అందంగా కనిపిస్తుంది. మొటిమలు, మచ్చల సమస్యల నుండి విముక్తి పొందుతుతారు.
ఆకు కూరలు
మీ ఆహారంలో బచ్చలికూర, వివిధ రకాల ఆకుకూరలు చేర్చుకుంటే వాటిలో ఉండే పోషకాలు చర్మంతో పాటు జుట్టును ఆరోగ్యంగా,అందంగా ఉంచడంలో సహాయపడతాయి.
చిలగడ దుంప
చిలగడ దుంపలో ఇదులో విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఇందులో ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. ఇది చర్మపు మంటను తొలగిస్తుంది. అతినీలలోహిత కిరణాల ప్రభావాల నుండి రక్షిస్తుంది. అంతే కాదు, వృద్ధాప్య లక్షణాలను దూరం చేయడంలో కూడా సహాయపడుతుంది.
నట్స్,సీడ్స్
జీడిపప్పు, బాదం వంటి వివిధ రకాల డ్రై ఫ్రూట్స్ బయోటిన్, ప్రొటీన్, విటమిన్ ఈ తో నిండి ఉంటాయి. ఇది యాంటీఆక్సిడెంట్ల ప్రభావాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది, ఇది వృద్ధాప్య ప్రభావాలను తగ్గించడంలో, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
ముడతలు రాకుండా
వయసు పెరిగేకొద్ది చర్మం పైన ముడతలు రావడం సహజం. అయితే రోజూ శరీరానికి కావలసినంత నీరు తాగుతూ ఉంటే ఈ ముడతలను ఆలస్యం చేయవచ్చు. చర్మం హైడ్రేట్ గా, బిగుతుగా ఉంటే ముడతలు రావు. నీరు బాగా తాగుతూ ఉంటే రక్త ప్రసరణ కూడా మెరుగ్గా ఉంటుంది. రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటే శరీరంలో కొత్త కణాల ఏర్పాటుకు దారి తీస్తుంది. ఇది చర్మాన్ని మెరుగు పరుస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications