Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
మీలో ఈ 5 లక్షణాలు ఉంటే మీరు ప్రమాదంలో ఉన్నట్లే.. వెంటనే వెళ్లి చెక్ చేయించుకోండి!
చలికాలంలో సాధారణంగానే పలు వ్యాధుల బారిన పడుతుంటాం. అందులో ముఖ్యమైనది న్యూమోనియా. ఇది ఒక రకమైన ఇన్ఫెక్షన్. ఇది బ్యాక్టీరియా, శిలింద్రాలు, వైరస్‌ల వల్ల వస్తుంది. ఈ వ్యాధి కారణంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలు, చాతి నొప్పి వంటి సమస్యలు వస్తాయి. పిల్లలు, వృద్ధులను ఈ వ్యాధి అమితంగా ప్రభావితం చేస్తుంది. ఒక్కోసారి ఇది ప్రాణాంతకంగా కూడా మారుతుంది.
ఈ న్యూమోనియా లక్షణాలపై అవగాహన ఉండడం, వాటి గురించి ముందుగానే తెలుసుకోవడం ద్వారా మీ పిల్లలతో పాటు మీ కుటుంబంలోని వృద్ధులను కూడా ముందుగానే రక్షించుకోవచ్చు. అయితే మీలో కూడా ఈ లక్షణాలు కనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లో అజాగ్రత్తగా ఉండకూడదు. దీనివల్ల న్యూమోనియా వచ్చే అవకాశాలు ఉంటాయి. పైగా ఇది ప్రాణాంతకం కూడా. ఆ లక్షణాలు ఏంటంటే?

న్యూమోనియా లక్షణాలు ఇవే..
న్యూమోనియా వచ్చినప్పుడు శరీరంలో కొన్ని మార్పులు స్పష్టంగా కనిపిస్తుంటాయి. ఆ లక్షణాలు అత్యంత సాధారణమైనవిగా సులువుగానే గుర్తుపట్టే విధంగా ఉంటాయి. న్యూమోనియా వచ్చే వ్యక్తులకు తీవ్రమైన శ్వాస ఆడకపోవడం, ఛాతిలో నొప్పి, దగ్గు, జ్వరం, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. వీటిని ప్రధానమైన సమస్యలుగా చెప్పుకోవచ్చు. అలాగే వీటికి తోడు.. తీవ్రమైన చలి, కండరాల నొప్పి, అలసట, బలహీనత వంటి సమస్యలు కూడా ప్రధానంగా మనుషులను ఇబ్బందులకు గురి చేస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు తక్షణమే వైద్యులను సంప్రదించి సరైన చికిత్స తీసుకుంటే మంచిది.
ఈ న్యూమోనియా ఊపిరితిత్తులను వాపుకు గురి చేస్తాయి. అలాగే ఊపిరి తిత్తుల్లో శ్లేష్మం, ద్రవం నిండిపోయేలా చేస్తుంది. ఇది శ్వాసను తీసుకోవడాన్ని నిలిపివేసి శరీరంలో ఆక్సిజన్ శాతాన్ని తగ్గిస్తుంది. క్రమంగా మనిషి చనిపోయేంత వరకు తీసుకెళ్తుంది. దీనిని ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోకపోతే వ్యక్తి వయస్సు, ఆరోగ్య పరిస్థితిని బట్టి ప్రమాదకరంగా మారుతుంది.
న్యూమోనియా నివారణ మార్గాలు..
టీకాలు వేయించుకోవడం..
టీకాలు వేయడం ద్వారా న్యూమోనియాను సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చు. ఇది సమర్ధవంతంగా, చాలా ప్రతిభావంతంగా పని చేస్తుంది. న్యుమోకాకల్ కంజుగేట్ వ్యాక్సిన్ అనే వ్యాక్సిన్ ద్వారా న్యూమోనియాను సమర్ధవంతంగా నివారించుకోవచ్చు. ఈ వ్యాక్సిన్‌ను రెండు నెలల చిన్నారుల నుంచి 65 ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసున్న వ్యక్తులకు వేసుకోవచ్చు. ఈ టీకా ఊపిరితిత్తులను ఇన్ఫెక్షన్ నుంచి రక్షించి.. న్యూమోనియా ప్రభావం నుంచి బయటపడేలా చేస్తుంది.
ధూమపానం మానుకోవాలి..
న్యూమోనియాతో బాధపడే వ్యక్తులు కచ్చితంగా ధూమపానం మానుకోవాల్సి ఉంటుంది. ఇది ఊపిరితిత్తులను బలహీనపరుస్తుంది. అలాగే రోగ నిరోధక శక్తిని తగ్గించి.. ఇన్ఫెక్షన్ ప్రభావం మరింత ఎక్కువగా అయ్యేలా ప్రేరేపిస్తుంది. అందుకే న్యూమోనియా ఉన్న వ్యక్తులు కచ్చితంగా ధూమపానాన్ని మానుకోవాలి. అలాంటప్పుడే ఆ వ్యాధిని మనం నివారించగలము.
ఆరోగ్యకరమైన జీవనశైలి ముఖ్యం..
న్యూమోనియాను సమర్ధవంతంగా ఎదుర్కోవాలంటే ఆరోగ్యవంతమైన జీవన శైలి చాలా ముఖ్యం. మంచి పోషకాలు ఉన్న ఆహరం తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా న్యూమోనియాను ఎదుర్కొనేందుకు మన శరీరానికి శక్తి లభిస్తుంది. సరైన జీవన విధానం వల్ల ఆస్తమా, మధుమేహం, గుండె జబ్బులు వంటి సమస్యలను నివారించుకోవచ్చు. ఆరోగ్యం సరిగ్గా ఉంటే న్యూమోనియాను సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చు.
గాలి నాణ్యత ముఖ్యం..
న్యూమోనియాను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు గాలి నాణ్యత అత్యంత ముఖ్యమైనది. అనారోగ్యకరమైన గాలి నాణ్యత న్యూమోనియా ప్రమాదాన్ని ఇంకా పెంచుతుంది. అందుకే ఇంట్లో సరైన గాలి నాణ్యత ఉండేందుకు సరైన వెంటిలేషన్‌ను ఉంచుకోవాలి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వైరస్ వ్యాప్తి చెందకుండా క్రమంగా తుడుచుకోవాలి.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. మేము కేవలం సమాచారం అందించడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాము. వీటిని ఎంతవరకు విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత. దీనికి బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications