వర్షాకాలం అలర్ట్‌.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!

వర్షాకాలంలో గర్భిణీలు తమ ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గర్భిణీల్లో రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, హార్మోన్ల అసమతుల్యత కారణంగా వారు వర్షాకాలంలో ఎక్కువగా ఇన్‌ఫెక్షన్లు, సీజనల్‌ వ్యాధులకి గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో వారి ఆరోగ్యం పట్ల కుటుంబీకులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో చూద్దాం..

pregnancy care in rainy season women should follow these suggestions

ఇన్‌ఫెక్షన్లు

వర్షాకాలంలో వాతావరణంలో తేమ, బురద విపరీతంగా ఉంటుంది. ఈ కారణంగా బ్యాక్టీరియా, వైరస్‌, ఫంగస్‌ త్వరగా వృద్ధి చెందడం ద్వారా సీజనల్‌ వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లకి ఆస్కారం ఎక్కువ. గర్భిణీల్లో ఇమ్యూనిటీ పవర్‌ తగ్గే అవకాశం అవకాశం ఉన్నందున వీటికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే గర్భిణీలు తరచుగా అంటే భోజనానికి ముందు, కాలకృత్యాల తర్వాత సబ్బుతో శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. బయట నుంచి ఇంటికి వచ్చాక చేతులు శానిటైజింగ్‌ చేసుకోవాలి. పబ్లిక్‌ ప్లేసుల్లో మాస్క్‌ ధరించాలి. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే వారికి దూరంగా ఉండటం మేలు.

తాగు నీటి విషయంలో జాగ్రత్త

వర్షాకాలంలో నీరు ఎక్కువగా కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. నీటి కాలుష్యం కారణంగా డయేరియా, టైఫాయిడ్‌, కలరాతో పాటు పొట్ట ఇన్‌ఫెక్షన్లకి దారి తీసే అవకాశం ఉంది. అందుకే ఈ కాలంలో గర్భిణీలు ఎల్లప్పుడూ కాచి చల్లార్చిన నీటిని తాగాలి. లేదా ఫిల్టర్‌ చేసిన నీటిని తాగడం మేలు. బిందెలపై మూతలు లేని నీరు, చల్లటి నీరు, బయట అపరిశుభ్రంగా విక్రయించే పానీయాలకు దూరంగా ఉండాలి. సీజన్‌ ఏదైనా గర్భిణీలు సరిపడా నీరు తాగడం వల్ల శరీరం నిత్యం హైడ్రేడెట్‌గా ఉంటుంది.

తాజా ఆహారం..

వర్షాకాలంలో ఆహారం త్వరగా కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఎల్లప్పుడూ తాజాగా, వేడిగా ఉన్న ఆహారం తీసుకోవాలి. స్ట్రీట్‌ ఫుడ్‌కి గర్భిణీలు దూరంగా ఉండాల. బహిరంగ ప్రదేశాల్లో విక్రయిస్తున్న ఆహారం, బయట కోసిన పండ్లు, నిల్వ ఉంచిన ఆహారం, సరిగా వండని ఆహారంపై ఈగలు, దోమలు వాలే అవకాశం ఎక్కువ. ఫలితంగా ఫుడ్ పాయిజనింగ్‌ని గురికావచ్చు. పండ్లు, కూరగాయలు వాడే ముందు శుభ్రంగా కడిగి వాడుకోవాలి.

దోమల బెడద

వర్షాకాలంలో దోమల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా డెంగ్యూ, మలేరియా, చికున్‌ గున్యా వ్యాధుల సంక్రమణ పెరుగుతుంది. ఇది గర్భిణీలపైనా, శిశువు ఆరోగ్యంపైనా ప్రభావం చూపిస్తుంది. అందుకే ఈ కాలంలో మహిళలు రాత్రి సమయంలో పూర్తి చేతులు ఉండేలా దుస్తులు ధరించాలి. చుట్టూ పరిసరాలు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. దోమ తెరలను వాడటం ఉత్తమం.

pregnancy care in rainy season women should follow these suggestions

జారే ప్రమాదం..

వర్షంలో తడి కారణంగా రోడ్లు, మెట్లు, నేలలు జారుడుగా ఉండి కింద పడిపోయే ప్రమాదం ఉంటుంది. దీని వల్ల గర్భిణీలకు హాని కలిగించే అవకాశాలు ఎక్కువ. అందుకే ఈ కాలంలో జారుడుగా ఉండే చెప్పులు కాకుండా సౌకర్యవంతంగా ఉండే చెప్పులు ధరించాలి. తడి ప్రదేశాల్లో నెమ్మదిగా నడవడంతో పాటు అవసరమైతే కుటుంబీకుల సాయం తీసుకోండి.

ఆరోగ్య పరీక్షలు

వర్షాకాలంలో గర్భిణీలు ఏ మాత్రం అసౌకర్యంగా అనిపించినా.. జ్వరం, వాంతులు, విరేచనాలు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, నీరసం లక్షణాలతో కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. క్రమం తప్పకుండా పరీక్షలు, టెస్టులు చేయించుకోవాలి. సకాలంలో చికిత్స తల్లీ బిడ్డ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Thursday, July 23, 2026, 13:07 [IST]
Desktop Bottom Promotion