Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
HMPV వైరస్ సోకిన వారి పరిస్థితి ఇప్పుడెలా ఉందో తెలుసా?
హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ లేదా HMPV వైరస్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రజలందరిలో ఓ భయాందోళనలను రేకెత్తించింది. ఈ వైరస్ కేసులు ఇప్పటికే మన దేశంలో పదుల సంఖ్యలో నమోదయ్యాయి. చైనాలోని పలు ఆసుపత్రులు ఈ వైరస్ కారణంగా రద్దీగా కనిపిస్తున్న దృశ్యాలు పలువురిని కలవరపెడుతున్నాయి.
అందులో భాగంగానే మన దేశంలో పలువురు శిశువుకు ఈ వైరస్ సోకడంతో అంతా కంగారు పడుతున్నారు. వారి పరిస్థితి ఎలా ఉంది? వారిలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయి? ఇంతకీ వారి ఆరోగ్య పరిస్థితి ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బెంగళూరులో మొదటగా..
ఈ వైరస్ కేసులు మొదటగా బెంగళూరులో నమోదైనట్లు మనకు రిపోర్ట్ వచ్చింది. బెంగళూరు తరువాత గుజరాత్, కోల్‌కతా, తమిళనాడులో ఈ వైరస్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే ఆయా రాష్ట్రాల నివేదిక ప్రకారం ICMR పరీక్షలు జరపగా వారికి సోకింది HMPV వైరస్సే అని వెల్లడైంది. దీంతో వారికి ప్రత్యేకమైన చికిత్స అందజేస్తున్నారు.
వారి పరిస్థితి ఎలా ఉందంటే..
HMPV వైరస్ సోకిన చిన్నారుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని తెలుస్తోంది. వారందరూ ఇప్పుడు క్షేమంగా ఉన్నట్లు ఆయా రాష్ట్రాల ఆరోగ్య శాఖాధికారులు తెలుపుతున్నారు. ప్రస్తుతం వారికి ఎలాంటి ప్రమాదం లేదని, వారంతా ఆరోగ్యంగా కోలుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ వైరస్ గురించి ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదని, ఇది కేవలం ఒక ఫ్లూ మాత్రమేనని పేర్కొన్నారు. దీంతో దేశంలోని ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు.
HMPV యొక్క లక్షణాలు
- దగ్గు
- జ్వరం
- ముక్కు దిబ్బడ
- గొంతు నొప్పి
- ఊపిరి ఆడకపోవడం
చాలా సందర్భాలలో, ఈ లక్షణాలు తేలికపాటివి. అలాగే ఒకటి లేదా రెండు వారాలలో పరిష్కరించబడతాయి. అయినప్పటికీ, మరింత తీవ్రమైన సందర్భాల్లో, ప్రత్యేకించి అనుమానాస్పద వ్యక్తులలో, HMPV బ్రోన్కైటిస్, న్యుమోనియా, ఆస్తమా వంటి సమస్యలకు కారణమవుతుంది. లక్షణాల తీవ్రత, వ్యవధి, వ్యక్తి వయస్సు, ఆ వ్యక్తి రోగ నిరోధక శక్తి ప్రకారం ఈ వైరస్ మరింత ప్రమాదకరంగా మారుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. వైరస్ ప్రమాదకరమైనది కానప్పటికీ మన జాగ్రత్తలో మనముంటే ఎలాంటి సమస్యల బారిన పడకుండా ఉంటాము.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications