సింగిల్ పేరెంటింగ్ ప్రమాదకరం.. ప్రత్యేక ఇంటర్వ్యూలో ఎన్నో సూచనలు చేసిన ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్. కృష్ట చింతల

యువత, పిల్లల్లో మానసిక సమస్యలు పెరిగిపోతున్నాయ్. కరోనా తరువాత ఇవి మరింత ఎక్కువయ్యాయ్. చిన్న వాటికే ఎక్కడా లేనంత కోపం వస్తుంది. ఆ కోపంలో వారు ఏమి చేస్తారో వారికే తెలియదు. తల్లిదండ్రులు కూడా పిల్లలను ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక తలపట్టుకుంటున్నారు. మరో వైపు మారుతున్న జీవిన విధానం, కుటుంబ వ్యవస్థ కూడా కూలిపోతుండడం కూడా మానసిక సమస్యలకు ప్రధాన కారణమంటున్నారు. మానసిక సమస్యలుకు తల్లిదండ్రులు ప్రధాన బాధ్యులుగా వుంటున్నారు. సింగుల్ పేరెంటింగ్‌తో పిల్లల జీవితంపై తీవ్రమైన ప్రభావం పడుతుందని చెబుతున్న ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ కృష్ణ చింతలతో ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం.

ఇప్పుడు పిల్లలు యంగ్ జనరేషన్ ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏవి ?

ప్రస్తుతం చాలా అడ్వాన్స్ లెవెల్స్‌లో సైకలాజికల్ సమస్యలను ఎదుర్కొంటూ వున్నారు. పిల్లల్లో ఇంటర్రెట్ అడిక్షన్, గేమింగ్ అడిక్షన్ పెరిగిపోతోంది. పిల్లల్లో అంతకు ముందు స్ట్రెస్ డిసార్డర్లు యాంక్జైటీ చాలా తక్కువగా వుండేది. ఇప్పుడవి చాలా పెరిగిపోయాయ్. భార్య భర్తలు తొందరగా విడిపోవడం వల్ల పిల్లలు చిన్న వయసు నుంచే చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. హ్యుమిలియేషన్ కూడా పెరుగుతుంది. చిన్నపిల్లల్లో పక్కవాళ్లు, స్కూల్లో ఫ్రెండ్స్ బుల్లీయింగ్ చేయడం తరచుగా చూస్తున్నాం. అన్న మాటలనే పదే పదే అంటూ బాధపెడతారు.

సింగుల్ పేరెంటింగ్ అనేది ప్రస్తుతం పెద్ద ఛాలెంజింగ్‌గా మారుతుంది. ఈ మధ్య పేరెంట్ టీచర్ మీటింగులు ఎక్కువగా జరుగుతున్నాయ్. అలాంటి సమయంలో తల్లిదండ్రులిద్దరూ రాకపోతే ఫ్రెండ్స్ నుంచి మీ నాన్న ఎప్పుడూ రాడా, మీ అమ్మ మీటింగ్‌కి రాదా లాంటి ప్రశ్నలను తోటి స్నేహితులే వేస్తారు. ఇలా ఫ్రెండ్స్ నుంచే బుల్లీయింగ్ తీవ్రంగా జరగుతుంది. వీటన్నింటి మధ్య పిల్లలు నలిగిపోతుంటారు.

doctor krishna chintala on psychological problems

గతంలో తండ్రి చిన్నప్పుడే చనిపోవడం లాంటి పరిస్థితులు వున్నాయి కదా..? అప్పుడు రాని సమస్యలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయనుకోవచ్చు ?

ఇంతకు ముందు చాలా పెద్ద కుటుంబాలు వుండేవి. ఇంట్లో ఒక మగమనిషి పెద్దరికంగా వుండేవారు. ప్రస్తుతం అది ఎక్కడా కనిపించడం లేదు. బాబాయ్, మామా, అత్త, బామ్మ, నానమ్మ, ఇవన్నీ లేవు. సింగుల్ పేరెంటింగ్ ‌లో తల్లి పనిచేస్తే గానీ పిల్లలను పెంచడం సాధ్యం కాదు. ఇలాంటి పరిస్థితిలో పిల్లలకు మోరల్ సపోర్ట్ దొరకడం చాలా కష్టంగా మారుతుంది. ఇప్పుడు ఒక బామ్మను చూడ్డం చాలా కష్టంగా మారిపోయింది. అమ్మమ్మ, నానమ్మలు అస్సలు కనిపించడం లేదు.

విలువలు, ఎథిక్స్ పెంచుకోవాల్సిన అవసరం ఇప్పుడ మనకు చాలా వుంది. మన చుట్టూ ప్రతీదీ ఎటకారంగానే మారిపోయింది. పిల్లలు తల్లిదండ్రులతో ఎటకారంగానే మాట్లాడుతున్నారు. పెద్దవాళ్లు చెబుతుంటే పిల్లలు అస్సలు వినడం లేదు. సింగుల్ పేరెంటింగ్ అనేది ఎప్పటికైనా చాలా ఛాలెంజింగ్ అనే చెప్పుకోవచ్చు.

తల్లిదండ్రులు విడిపోతే ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటారు ?

తల్లిదండ్రి విడిపోయినప్పుడు పిల్లలు తల్లివైపు వుంటారా, తండ్రివైపు వుంటారా అని యాంక్జైటీ చాలా ఎక్కువగా వుంటుంది. చిన్న పిల్లల మనసులపై ఇది ఘాడమైన ముద్రను వేస్తుంది. పిల్లలు చిన్నప్పటి నుంచే తమ జీవితంలో నాన్న పాత్ర లేకపోతే చాలా దెబ్బ తింటారు. చుట్టుపక్కల అందరికీ నాన్న వుండి తనకు లేకపోతే ఆ బాధను మాటల్లో వర్ణించలేము.

doctor krishna chintala on psychological problems

సూసైడెల్ టెండెన్సీస్ ఎందుకు పెరుగుతాయ్ ?

బయటకు తమ భావవ్యక్తీకరణ చేయలేనప్పుడు, అది వారి మనసులో క్రమక్రమంలో పెరిగిపోయినప్పుడు జీవితం మొత్తం అంధకారంగా మారిపోతుంది. బయటకు రాలేమని వాళ్లు ఒక నిర్ణయానికి వస్తారు. చిన్న సమస్య కూడా చాలా పెద్దగా కనబడిపోతుంది. ఏదో అయిపోతుందని ఏమీ ఆలోచించకుండా మూర్ఖత్వమైన డెసిషన్‌ను తీసుకొని ఆత్మహత్య చేసుకుంటారు.

ఆత్మహత్యలు పెరగడానికి సమాజం కూడా ఒక కారణం. వాడికి తండ్రి లేడు, ఉంటే విలువ తెలిసేది లాంటి మాటలు చాలా గాయపరుస్తాయ్. సమాజమే ఇలా అనిపిస్తుంది. తండ్రి కావాల్సినప్పుడు పక్కవాళ్లు దగ్గర చేర్చుకోకపోవడం, అంటరానివాడని దూరం పెట్టడం, వీటివల్ల కూడా సూసైడల్ టెండెన్సీస్ చాలా పెరిగిపోతాయ్. గతంలో ఏదో జరిగిన దానివల్ల బాధపడి తన దగ్గర లేనిది వేరే వాళ్ల దగ్గర వుండి వాళ్లు ఆనందిస్తే చూడలేక బాధపెట్టడం వల్ల యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తయారౌతారు. వీరు సమాజానికి చాలా ప్రమాదకరం.

డ్రగ్స్, విచ్చలవిడితనం పెరుగిపోతుంది దీన్ని ఎలా ఎదుర్కోవాలి ?

ఏదైనా మితంగా వున్నప్పుడే బాగుంటుంది. అది సంతోషమైనా ఏదైనా. ఏదీ అతిగా తీసుకోవద్దు. ప్రతీదీ మద్యస్థంగా వుండాలని సైకాలజీ మనకు చెబుతుంది. ఎక్కువ ఆనందాన్ని పొందలేము అలాగే ఎక్కువ బాధను కూడా తీసుకోలేము. బాధ వుండాలి, సంతోషం, విజయం కూడా వుండాలి. సైకాలజీ ఎప్పుడూ న్యూట్రల్‌గా వుండాలని చెబుతుంది. సైకాలజీలో ఒక గ్లాండ్ ఎక్కువగా పనిచేసినా లోపం కిందకు వస్తుంది, అదే తక్కువగా పనిచేసినా కూడా లోపం కిందకే వస్తుంది.

పిల్లలను ఎలా చూసుకోవాలి..?

పిల్లలకు ఎక్కువ కంఫర్టులను ఇవ్వకూడదు. చిన్న కారు అడిగితే పెద్దతి కొనిపంచడం చేయవద్దు. గుడ్డే కావాలంటే డార్క్ ఫ్యాంటసీలు ఇప్పటించడం, సైకిల్ కావాలంటే స్కూటీ కొనిపెట్టడం. ఇలాంటివి చేస్తే పిల్లలు లగ్జరీకి అలవాటు పడిపోయ్, చిన్నప్పటి నుంచే ఆ మోడ్‌లో వుండడం వల్ల వారికి తరువాత సర్దబాటు చేసుకోవడం చాలా కష్టంగా మారుతుంది. అడిగింది ఇవ్వకపోతే పిల్లలు తల్లిదండ్రులపై ఘోరంగా తిరగబడే పరిస్థితి రావచ్చు. పిల్లలకు బ్రతకడం ఎలాగో నేర్పించాలి. సిల్వర్ స్పూన్‌తో పెంచడం కాకుండా. కష్టనష్టాలు, బాధలు వారికి కూడా తెలిసేలా చేయాలి. ఇప్పుడు ధనవంతులు కూడా ఇలాగే చేస్తున్నారు. తమ పిల్లలకు ఎక్కడో ఒక నగరానికి గుమస్తాగా పనిచేయమని పంపుతున్నాడు. ఎందరో కోటీశ్వరుల పిల్లలు కొంత సమయం వరకు ఇలా పనిచేస్తున్నారు.

డాక్టర్ కృష్ణ చింతల ఎమ్మెస్సీ సైకాలజీ, క్లినికల్ సైకాలజీ చేసి ఆర్‌సీఐ సర్టిఫైడ్ సైకాలజిస్ట్‌గా వున్నారు. జాతీయంగా, అంతర్జీయంగా ఎన్నో సైకాలజీ సెషన్స్‌ను నిర్వహించారు. లైఫ్ ట్రాన్స్‌ఫార్మొషన్ వెల్‌నెస్ సెంటర్‌తో వైద్య సేవలను గత 8 సంవత్సరాలుగా అందిస్తున్నారు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Desktop Bottom Promotion