Latest Updates
-
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు!
రాష్ట్రవ్యాప్తంగా దంచి కొడుతున్న వానలు.. వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు ఈ చిట్కాలు పాటించండి
రాబోయే ఐదు రోజులు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 24 గంటల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. పగలు సాధారణ పరిస్థితి ఉన్నప్పటికీ సాయంత్రానికి వాతావరణం మారి వాన కురుస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు పడుతున్నట్లు చెప్పింది. ఐదు రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని వెల్లడించింది. వానలు వస్తున్నాయంటే రోగాలు కూడా చుట్టుముడతాయి. ఈ వర్షాలతో వచ్చే వివిధ అనారోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి, ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

1. రోగనిరోధక శక్తి పెంచుకోవాలి:
రోగ నిరోధక శక్తి లేకపోవడం వల్ల వర్షాకాలంలో వ్యాధులు, ఇన్ఫెక్షన్లు వస్తాయి. అలాగే వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల దగ్గు, జలుబు, జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. వెల్లుల్లితో చేసిన సూప్ లు తాగడం, అల్లం టీ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
2. కాచిన నీటిని తాగాలి:
వర్షాకాలంలో నీరు కలుషితం అయ్యే అవకాశాలు ఎక్కువ. కాబట్టి కాచి వడపోసిన నీటిని తాగడం మంచిది. అంటువ్యాధులు రాకుండా ఉండటానికి ఇది ప్రభావవంతమైన చిట్కా.
3. పాల ఉత్పత్తులు తీసుకోవాలి:
వర్షాకాలంలో పాలు తీసుకోవడం వల్ల కొంత మందిని అజీర్తి సమస్య వేధిస్తుంది. బదులుగా ఇతర పాల ఉత్పత్తులు తీసుకోవడం మంచిది. ఈ ఉత్పత్తులు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి.
4. హెర్బల్ టీలు తాగాలి:
హెర్బల్ టీల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. మెరుగైన ఆరోగ్యం కోసం హెర్బల్ టీలు తాగడం అలవాటు చేసుకోవాలి. ఇవి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. తద్వారా రోగాల నుంచి దూరంగా ఉండొచ్చు.
5. పండ్లు తినాలి, కానీ..:
సీజనల్ ఫ్రూట్స్ తప్పకుండా తినాలి. అయితే వర్షాలు మొదలైన తర్వాత పుచ్చకాయ తినవద్దు. అయితే ఆపిల్, దానిమ్మ, బెర్రీల వంటివి తినడం మంచిది.
6. స్పైసీ ఫుడ్‌కు దూరంగా ఉండండి:
మసాలా ఆహారం నోటికి మంచి రుచిగా ఉంటుంది. అందుకే చాలా మంది స్పైసీ ఫుడ్స్ తినడానికి ఇష్టపడతారు. వర్షాలు పడుతున్నప్పుడు స్పైసీ ఫుడ్స్ తినడం వల్ల చర్మ అలెర్జీలు, చికాకు వచ్చే అవకాశం ఉంది.
7. నీరు నిలవకుండా చూసుకోవాలి:
పూల కుండీల్లో, పాత టైర్లు, ట్యాంకులు, పగిలిపోయిన సీసాలు, వాటర్ సీసాల్లో నీరు నిలిచే అవకాశాలు ఉంటాయి. అలా నీరు నిలవకుండా జాగ్రత్త పడాలి. అలా నీరు నిలిచిపోతే అవి దోమలు సహా ఇతర సూక్షక్రిములకు ఆవాసంగా మారుతాయి.
8. దోమలకు దూరంగా ఉండాలి:
వర్షాకాలం మొదలైందంటే.. దోమలు పెరిగిపోతాయి. కాబట్టి ఇంటి తలుపులకు, కిటికీలకు నెట్స్ బిగించుకోవాలి. అలాగే మస్కిటో రిపెల్లెంట్స్ వాడాలి. దోమలు చాలా రోగాలకు కారణం అవుతాయి.
9. వెంట గొడుగు, రెయిన్‌కోట్‌లు ఉంచుకోవాలి:
బయటకు వెళ్లినప్పుడు వర్షం పడితే తడవాల్సి వస్తుంది. అందుకే ఎప్పుడు బయటకు వెళ్తున్నా వెంట గొడుగు, రెయిన్ కోట్ లు ఉంచుకోవడం మంచిది. వాన నీటిలో తడవడం వల్ల జలుబు, దగ్గు, ఫ్లూ, జ్వరం వచ్చే అవకాశాలు ఉంటాయి. అవి ఒకరినుంచి ఇంట్లో మరొకరికి వ్యాపిస్తాయి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications