Latest Updates
-
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
గ్యాస్, అసిడిటీకి తక్షణమే చెక్ పెట్టే అద్భుతమైన వాము పరాఠా.. ఎలా చేయాలో తెలుసా?
మొఖంపై మొటిమలు ఎందుకు వస్తాయో తెలుసా?
ఏ అమ్మాయి అయినా లేదా అబ్బాయి అయినా మెరిసిపోయే చర్మం, మొటిమలే లేదా మచ్చల్లేని కోరుకోవడం సహజం. మేకప్ అక్కర్లేకుండానే అందరి దృష్టిని ఆకర్షించే వారిని చూడగానే, వీళ్లు లక్ష్లల రూపాయలు ఖర్చుపెట్టి ఖరీదైన ట్యూటీ ట్రీట్మెంట్స్ చేయించుకుంటారేమో అని చాలామంది అనుకుంటారు. అయితే అసలైన రహస్యం క్రీముల్లోనో లేదా ఫేషియల్స్‌లోనో ఉండదు.. మన రోజువారీ అలవాట్లలోనే దాగి ఉందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. మొటిమలు లేని మృదువైన చర్మాన్ని సొంతం చేసుకోవడానికి మీరు చేయాల్సిందల్లా కొన్ని చిన్న చిన్న మార్పులే.
సౌందర్యానికి తొలి మెట్టు
చాలామంది చేసే అతిపెద్ద పొరపాటు ఏంటంటే ఫేస్ శుభ్రత విషయంలో నిర్లక్ష్యం చూపడం. పొద్దున్నే నిద్ర లేవగానే, రాత్రి పడుకునే ముందు ఈ రెండు సమయాల్లో ముఖం కడుక్కోవడం తప్పనిసరి. ఈ చిన్న అలవాటును నిర్లక్ష్యం చేస్తే చర్మ రంధ్రాల్లో దుమ్ము, ధూళి, జిడ్డు పేరుకుపోయి మొటిమలకు స్వాగతం పలికినట్లే అవుతుంది. కేవలం ఈ రెండుసార్లే మాత్రమే కాకుండా ఎక్సర్ సైజ్ చేసినప్పుడు లేదా ఎక్కువగా చెమట పట్టినప్పుడు కూడా మొఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. దీనివల్ల చర్మం ఫ్రెష్ గా, ఆరోగ్యంగా ఉంటుంది. మీ చర్మతత్వానికి సరిపోయే సున్నితమైన ఫేస్ వాష్ ఎంచుకోవడం కూడా అంతే ముఖ్యమని గుర్తుపెట్టుకోండి.

మీ చేతుల్లోనే ఉన్న శత్రువులు
ఫోన్ లేనిదే అన్నం తినరు,బాత్రూమ్ కి కూడా పోరు అనే విధంగా ప్రస్తుతం పరిస్థితులు మారాయి. నిద్రపోయే సమయం తప్ప మిగతా టైం మొత్తం ఫోన్ లో గడిపేటోళ్లు చాలామందే ఉన్నారు. అయితే పబ్లిక్ టాయిలెట్ కన్నా మన మొబైల్ ఫోన్ స్క్రీన్ అత్యంత అపరిశుభ్రంగా ఉంటుందని మీకు తెలుసా? మనం ఫోన్ లో మాట్లాడేటప్పుడు, ఆ స్క్రీన్ పై ఉన్న వేలాది క్రిములు మన బుగ్గలకు అంటుకుంటాయి. అదే చేతులతో ముఖాన్ని తాకినప్పుడు కూడా ఇదే జరుగుతుంది. ఇవే మొటిమలకు ప్రధాన కారణమవుతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు ఫోన్ స్క్రీన్ ను శానిటైజర్ తో శుభ్రపరచడం, అనవసరంగా చేతులతో ముఖాన్ని తాకే అలవాటును మానుకోవడం చాలా అవసరం.
బెడ్ రూమ్ లో రహస్యం
మనకు తెలియకుండానే మనం చేసే మరో పొరపాటు దిండు కవర్లను తరచుగా మార్చకపోవడం. మనం నిద్రపోయేటప్పుడు మన జుట్టు ముఖంలోని నూనెలు, మురికి దిండు కవర్ కు అంటుకుంటాయి. రోజుల తరబడి అదే దిండును వాడటం వల్ల ఆ మురికి తిరిగి మన చర్మానికి చేరి మొటిమలను సృష్టిస్తుంది. కాబట్టి కనీసం వారానికొకసారి అయానా ఖచ్చితంగా దిండు కవర్లను మార్చాలి.
ఆహారమే అసలైన ఔషధం
అందం అనేది బయట పూసే క్రీముల వల్ల మాత్రమే రాదు..లోపలి నుంచి కూడా రావాలి. మనం తీసుకునే ఆహారమే మన చర్మ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. మీ ఆహారంలో తాజా కాయగూరలు, ఆలివ్ ఆయిల్, తృణధాన్యాలు వంటివి చేర్చుకోండి. ఇవి చర్మానికి కావాల్సిన పోషకాలను అందించి సహజంగానే మెరిసేలా చేస్తాయి. అలాగే అధిక బరువు కూడా శరీరంలో హార్మోన్ల అసమతుల్యతకు కారణమై మొటిమల సమస్యను పెంచుతుంది. కాబట్టి బరువును అదుపులో ఉంచుకుంటే ఆరోగ్యం మాత్రమే కాదు, అందం కూడా మీ సొంతమవుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications