Latest Updates
-
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే..
Pimples on Forehead: నుదిటిపై తరచుగా మొటిమలు వస్తున్నాయా? శరీరంలోని ఆ భాగం ప్రమాదంలో!
ఎవరినైనా కలిసినప్పుడు మనం ఫస్ట్ గమనించేది వారి ఫేస్. అందుకే చాలా మంది తమ ముఖం పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. ఇది మన గురించి ఒక అభిప్రాయాన్ని సృష్టిస్తుంది. మనం మన ముఖాన్ని సరిగ్గా చూసుకోకపోతే మన ముఖం మీద మొటిమలు రావచ్చు. ముఖంపై మొటిమలు సరైన సంరక్షణ లేకపోవడానికి సంకేతం మాత్రమే కాదు అవి మన శారీరక ఆరోగ్యాన్ని కూడా సూచిస్తాయి. మీ నుదిటిపై తరచుగా మొటిమలు వస్తున్నాయా? మీ నుదిటిపై పదే పదే మొటిమలు వస్తే దాని అర్థం ఏమిటో మీకు తెలుసా?
నుదిటిపై మొటిమలకు కారణం ఇదే
ఏ వ్యక్తి అయినా మొటిమలు లేని ముఖాన్ని ఇష్టపడతారు. అయితే కొన్ని సందర్భాలలో దుమ్ము, అలెర్జీలు, వేడి కారణంగా కొంతమందికి నుదిటిపై మొటిమలు తరచుగా కనిపిస్తాయి. 2-3 రోజులు కంటిన్యూగా చికెన్ లేదా కారంగా ఉండే ఆహారాన్ని తింటే చాలామందిలో నుదిటిపై చిన్న మొటిమలు కనిపించడం గమనించవచ్చు. ఇది కొంచెం చిరాకు తెప్పిస్తుంది. చాలా మంది ముఖంలో ఏ భాగంలోనైనా మొటిమలు వచ్చినప్పుడల్లా నా శరీరం వేడిగా ఉంది అని అనుకుంటూ మజ్జిగ తాగుతారు. లేదా చియా గింజలతో తయారు చేసిన వాటర్ తాగుతారు.

వాస్తవానికి నుదిటిపై మొటిమలు రావడానికి ప్రధాన కారణాలలో ఒకటి 'అజీర్ణం'. మీరు ఎక్కువగా ఆహారం తింటే లేదా మీరు తినే ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే నుదిటిపై మొటిమలు వస్తాయి. అందుకే నాన్ వెజ్ తిన్న రెండు రోజుల్లోనే మొటిమలు వస్తాయి. నాన్-వెజ్ అయినప్పుడు చాలామంది సాధారణంగా తినే దానికంటే కొంచెం ఎక్కువగా తింటారు. ఇది సరిగ్గా జీర్ణం కాకుంటే జీర్ణ సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు,నిద్ర సమస్యలు వస్తాయి. మీ నుదిటిపై కనిపించే మొటిమలు వీటన్నింటి ఫలితమే. మీ నుదిటిపై మొటిమ కనిపిస్తే మీ జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయడం లేదని అక్కడ ఒక సమస్య ఉందని అర్థం. నుదురు శుభ్రంగా ఉండటం అంటే మీ శరీరం సరిగ్గా పనిచేస్తుందని అర్థం.
మొటిమలు రాకుండా నిరోధించాలంటే ఇలా
ఒక్కసారి మొటిమలు వస్తే తర్వాత వాటిని ఎదుర్కోవడం కష్టం. కాబట్టి మొటిమలు రాకుండా నిరోధించాలి. మీ ముఖాన్ని తరచుగా చల్లటి నీటితో కడుక్కోవడం, పుష్కలంగా నీరు త్రాగడం వంటి సాధారణ అలవాట్లు మీ ముఖంపై మొటిమలు ఏర్పడకుండా నిరోధించవచ్చు.
-మొటిమలకు అతి ముఖ్యమైన కారణాలలో ఒకటి రంధ్రాలు మూసుకుపోవడం. అధిక నూనె స్రావం బయటకు రాదు మరియు అవి మొటిమలుగా ఏర్పడతాయి. అధిక నూనె స్రావాన్ని నియంత్రించడం ద్వారా దీనిని నివారించవచ్చు.
-తల చర్మాన్ని సరిగ్గా చూసుకోకపోతే, అది అధికంగా పొడిగా లేదా జిడ్డుగా మారవచ్చు, ఫలితంగా నుదిటిపై మొటిమలు వస్తాయి.
- నిరంతరం ఒక సమస్య గురించి ఆలోచిస్తుంటే లేదా భయపడితే మీ నుదిటిపై మొటిమలు కనిపిస్తాయి. శరీరంలోని వివిధ సమస్యలకు ఒత్తిడి మూల కారణం. ఒత్తిడి ఉన్నప్పుడు హార్మోన్ స్రావంలో మార్పుల వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
