Latest Updates
-
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి!
పురుషులు టాయిలెట్ లో ఎక్కువ సమయం ఉండటానికి అసలు కారణాలివే..
సాధారణంగా ఆడవారితో పోల్చితే మగవారు బాత్ రూంలో ఎక్కువ సమయం గడుపుతారు. స్త్రీలు 10 నిముషాల్లో బయటకు వస్తే, పురుషులు మాత్రం అరగంట నుండి గంట సమయం బాత్ రూమ్ లోనే గడుపుతారు. ఇది తరచూ మనం మనఇల్లలో చూస్తుంటాం. అయితే ఈ విషయం పై చాలా మంది ఇన్స్టా గ్రామ్, టిక్ టాక్ వంటి సోషియల్ మీడియాలో తమ ప్రశ్నలను లేవనెత్తుతున్నారు.
ఈ అంశంపై నిపుణులు కూడా దృష్టి సారించారు. బాత్ రూమ్ లో ఎక్కువ సమయం గడిపే మగవారి డైజెస్టివ్ హెల్త్‌ను ఇంప్రూవ్ చేస్తాయని.. వారి డైజెస్టివ్ హెల్త్ సాధారణంగా మహిళల కంటే ఎప్పుడూ మెరుగ్గా ఉంటుందని నిపుణులు అంటున్నారు.

'మహిళల కంటే పురుషులు టాయిలెట్‌లో ఎక్కువ సమయం గడుపుతారు, కానీ వాస్తవానికి వారికి బవెల్ ప్రాబ్లమ్స్, క్రానిక్ కాంస్టిపేషన్ వచ్చే అవకాశం మహిళల కంటే చాలా తక్కువ' అని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ కైల్ స్టాలర్ చెప్పారు. క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ (Cleveland Clinic)కి చెందిన గ్యాస్ట్రోఇంటెస్టినల్ సైకలాజిస్ట్ మాడిసన్ సైమన్స్ దీని వెనుక ఒక బయోలాజికల్ రీజనింగ్ ఉందని తెలిపారు.
పురుషులు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి టాయిలెట్ లో ఎక్కువ సమయం గడపడం వల్లసులభంగా రిలాక్స్‌గా మారగలరని, ఇది డైజెషన్‌కు ముఖ్యమైనదని ఆమె అన్నారు. ఆమె దీనిని 'బైనరీ స్విచ్' అని పిలిచారు, ఈ బైనరీ స్విచ్ మగవారికి రిలాక్స్ కావడానికి, ఫుడ్ డైజెస్ట్ చేయడానికి హెల్ప్ అవుతుందని చెప్పారు. ఇవే కాకుండా మరికొన్ని కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం
బిజీ లైఫ్ నుంచి బ్రేక్
మగవారు రిలాక్స్‌గా ఉన్నప్పుడే జీవితంలోని ఒత్తిళ్ల నుంచి తప్పించుకోగలరు. పురుషులు బిజీ లైఫ్‌ను మళ్లీ ఎదుర్కొనే ముందు వాష్‌రూమ్ టైమ్‌ను పీస్‌ఫుల్ టైమ్‌గా ఆస్వాదిస్తారని సైమన్స్ సూచించారు. ప్రైవేట్‌గా ఉండే బాత్‌రూమ్ పిల్లలను చూసుకోవడం లేదా పనిలో సమస్యలను పరిష్కరించడం వంటి వాటి నుంచి వారికి విరామం ఇస్తుంది.
'మగవారు మళ్లీ వారి రొటీన్ లైఫ్‌కి తిరిగి వెళ్ళే ముందు ఆ రిలాక్సేషన్ స్టేట్‌లో టైమ్‌ను గడుపుతున్నారు. మీరు బాత్రూమ్‌లో కూర్చొని ఉంటే పిల్లల కోసం ఆహారం తయారు చేయమని లేదా పనిలో సమస్యను పరిష్కరించమని అడగరు" అని సైమన్స్ న్యూయార్క్ పోస్ట్‌తో అన్నారు.
టాయిలెట్‌లో మొబైల్ వాడకం
స్మార్ట్ ఫోన్లు భూమిపైకి వచ్చినప్పటి నుండి, టాయిలెట్లలో వాటి వినియోగం పెరుగుతోంది. 2012లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, 75% మంది ప్రజలు తమ మొబైల్ ఫోన్‌లను టాయిలెట్‌లో ఉపయోగిస్తున్నారు.
30% మంది పురుషులు టాయిలెట్‌లో మొబైల్ ఫోన్‌లను ఉపయోగించడం అనివార్యమని తెలుసుకున్నారు. మీరు మొబైల్ ఫోన్ పట్టుకుని టాయిలెట్‌లోకి వెళితే ఎక్కువ సమయం పడుతుందని తెలుసుకోండి.
ఇది ఆరోగ్యకరమా?
అఫ్ కోర్స్ కాదు, టాయిలెట్ లో పది నిమిషాల కంటే తక్కువ సమయం వెచ్చిస్తే బాగుంటుందని నిపుణులు అంటున్నారు.
మొబైల్ ఫోన్ తో టాయిలెట్ కు వెళితే క్రిములు మొబైల్ ఫోన్ ను ముద్దాడే అవకాశం 19 రెట్లు ఎక్కువ అని అంటున్నారు.
హస్తప్రయోగం
పురుషులు హస్తప్రయోగం చేయడానికి తరచుగా టాయిలెట్‌ని ఉపయోగిస్తారు. స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో నివసిస్తున్నట్లయితే, ముఖ్యంగా ఉమ్మడి కుటుంభం అయితే అతను ఖచ్చితంగా దీని కోసం టాయిలెట్‌ను ఉపయోగిస్తాడు.
షేవింగ్
పురుషులు తరచుగా ట్రిమ్మర్ లేదా సాధారణ బ్లేడ్‌ని తీసుకుంటారు మరియు షేవ్ చేయడానికి టాయిలెట్‌ని ఉపయోగిస్తారు.

ఏడవడానికి!
పురుషులు కూడా ఏడుస్తారు. కానీ అది చూపించడం ఇష్టం లేక పోవడంతో టాయిలెట్‌లోకి వెళ్లి ఏడుస్తారు.
ఆటలు ఆడటం
చాలామంది పురుషులు టాయిలెట్‌లో కూర్చొని గేమ్స్ ఆడతారు. ఎందుకంటే వారికి ఆఫీసులోనో, ఇంట్లోనో సమయం దొరకకపోవడమే ప్రధాన కారణం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, వీడియో గేమ్ వ్యసనం మానసిక అనారోగ్యంగా పరిగణించబడుతుంది. మీరు ఆట ఆడటానికి టాయిలెట్‌లో ఎక్కువ సమయం తీసుకుంటే, మీరు దీన్ని తీవ్రంగా పరిగణించాలి.
మీ స్వంత శరీరాన్ని ప్రేమించండి
కొంతమంది పురుషులు ఒంటరిగా ఉన్నప్పుడు తమను తాము అద్దంలో చూసుకుంటారని అధ్యయనాలు చెబుతున్నాయి.
సైమన్స్ టాయిలెట్ టైమ్ మానసిక కోణాన్ని కూడా ఎత్తి చూపారు. పురుషులు విశ్రాంతి తీసుకోవడానికి, రీఛార్జ్ కావడానికి, దృష్టి పెట్టడానికి ఇది మంచి సమయం అని ఆమె అన్నారు. బాత్‌రూమ్‌లో వారు ఒంటరిగా ఉంటూ ఒక సమయంలో ఒక పనిని మాత్రమే చేయగలరని, ఇది వారి మైండ్స్ రిఫ్రెష్ చేయడానికి వారికి అవకాశం ఇస్తుందని చెప్పారు. అందువల్ల, టాయిలెట్‌కి లాంగ్ టైమ్ తీసుకోవడం అనేది మగవారికి కేవలం అలవాటు మాత్రమే కాదు, ఒత్తిడితో కూడిన రొటీన్ లైఫ్‌లో అదొక యూజ్‌ఫుల్ బ్రేక్, దీని ద్వారా వారి శ్రేయస్సును మెరుగుపరచడానికి ఒక మార్గం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications