Latest Updates
-
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే..
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే!
వాతావరణం మారినప్పుడల్లా మనల్ని పలకరించే అతి సాధారణ ఆరోగ్య సమస్యలలో కండ్లకలక (దీనినే పింక్ ఐ అంటారు) ఒకటి. వర్షాకాలంలో మనం చూసే అత్యంత అంటువ్యాధులైన కంటి ఇన్ఫెక్షన్లలో ఇది ఒకటి. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఇది ఎవరికైనా సోకవచ్చు. ఒకరికి కండ్లకలక వస్తే సోకితే వారి పక్కన ఉండేవాళ్లకు వాళ్లకు అది సోకుతుంటది.

తాజాగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కూడా కండ్లకలక బారిన పడ్డారు. అయితే మొదట రణబీర్ కూతురుకి కండ్లకలక వచ్చింది..ఆ చిన్నారి నుంచి రణబీర్ కి అది సోకింది. ఈ సంఘటన ఇళ్లలో, ముఖ్యంగా సన్నిహితంగా ఉండే కుటుంబ సభ్యుల మధ్య కండ్లకలక ఎంత సులభంగా వ్యాపిస్తుందో కూడా స్పష్టం చేస్తుంది. కళ్లు ఎర్రబడటం, ఉదయం లేచేసరికి కనురెప్పలు అతుక్కుపోవడం చూసి చాలామంది కంగారు పడుతుంటారు. కానీ ఇది చూడటానికి ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ, ప్రాణాంతకం కానేకాదు. సరైన జాగ్రత్తలు పాటిస్తే చాలా సులభంగా దీని నుంచి బయటపడవచ్చు.
అసలు కండ్లకలక అంటే ఏమిటి?
మన కనురెప్ప లోపలి భాగాన్ని, కనుగుడ్డును కప్పి ఉంచే పారదర్శకమైన పొరను కంజంక్టివా అంటారు. ఈ పొరకు వచ్చే ఇన్ఫెక్షన్ లేదా వాపునే కండ్లకలక అంటారు. ఈ సమస్య వచ్చినప్పుడు సూర్యరశ్మి, దుమ్ము తగిలితే కళ్లలో మంటగా అనిపిస్తుంది. కాబట్టి బాధితులు బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతుంటారు.
కండ్లకలక లక్షణాలు?
-కండ్లకలక సోకినప్పుడు ప్రధానంగా ఈ కింది లక్షణాలు కనిపిస్తాయి.
-ఒకటి లేదా రెండు కళ్లు ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారడం.
-కళ్లలో ఎడతెగని దురద, పదే పదే కళ్లను నలపాలనిపించడం.
-కంటిలో ఏదో నలుసు పడినట్లుగా చికాకుగా, అసౌకర్యంగా ఉండటం.
-కళ్ల నుంచి పదే పదే నీరు కారడం.
రాత్రి పడుకున్నప్పుడు కళ్ల నుంచి జిగటగా స్రావాలు రావడం. ఉదయం లేచేసరికి అవి ఎండిపోయి, కనురెప్పలు అతుక్కుపోయి కళ్లు తెరవడానికి ఇబ్బంది పడటం.
వెలుతురును చూడలేకపోవడం లేదా కాంతికి సున్నితంగా మారడం (దీనినే ఫోటోఫోబియా అంటారు).

అసలు ఈ కండ్లకలక ఎందుకు వస్తుంది?
-కండ్లకలక రావడానికి ప్రధానంగా వైరస్, బ్యాక్టీరియా, అలెర్జీలు కారణం.
-జలుబు, గొంతునొప్పి లేదా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో పాటే ఈ వైరల్ కండ్లకలక కూడా రావచ్చు.
-వాతావరణంలోని దుమ్ము, పుప్పొడి వల్ల వచ్చే అలెర్జీల వల్ల కూడా కండ్లకలక వస్తుంది.
-కళ్లలో ఏదైనా రసాయనాలు పడినప్పుడు లేదా బయటి వస్తువు కంటిలో పడినప్పుడు కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది.
-అప్పుడే పుట్టిన నవజాత శిశువుల్లో కన్నీటి నాళాలు మూసుకుపోవడం వల్ల కూడా ఈ సమస్య వచ్చే ప్రమాదం ఉంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. నివారణ
కండ్లకలక అనేది ఒకరి నుంచి మరొకరికి చాలా వేగంగా వ్యాపించే అంటువ్యాధి. ముందస్తు జాగ్రత్తలే దీనికి అసలైన మందు.
దూరం పాటించడం: ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది. వారితో కరచాలనం చేయడం వంటివి నివారించాలి.
వస్తువులు పంచుకోవద్దు: బాధితులు వాడిన టవల్స్ (చేతి రుమాళ్లు), దిండు కవర్లు, దుప్పట్లు, కంటి మేకప్ వస్తువులను ఇతరులు అస్సలు వాడకూడదు.
సన్ గ్లాసెస్ వాడకం: కండ్లకలక వచ్చిన వారు కళ్లను తరచుగా చేతులతో ముట్టుకోకూడదు. బయటకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా నల్లటి సన్ గ్లాసెస్ (కళ్లద్దాలు) ధరించాలి. ఇది కళ్లను ఎండ, దుమ్ము నుంచి రక్షించడమే కాకుండా, ఎదుటివారికి ఇబ్బంది కలగకుండా చేస్తుంది.
విశ్రాంతి ముఖ్యం: కళ్లు త్వరగా కోలుకోవడానికి టీవీలు, మొబైల్స్ చూడటం తగ్గించాలి. ఇన్ఫెక్షన్ తగ్గే వరకు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సలహా ఇస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
