Latest Updates
-
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి!
ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నోళ్లకే ఎక్కువగా బ్రెయిన్ స్ట్రోక్!..మైండ్ బ్లాక్ అయ్యే విషయం వెలుగులోకి
మనుషుల్లో అయినా,జంతువుల్లో అయినా శరీరంలో రక్తం లేకుంటే ఆ శరీరం వెంటనే పనిచేయడం ఆగిపోతుంది. రక్తం ఎవరిలో అయినా ఒకే రంగులో ఉంటుంది. రక్తం ఎర్రగా ఉన్నప్పటికీ అందరిలోనూ ఒకేలా ఉండదు. రక్తంలో అనేక గ్రూపులు ఉంటాయి. ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన బ్లడ్ గ్రూపు ఉంటుంది. మానవ జీవశాస్త్రంలో బ్లడ్ గ్రూప్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే కొన్నిబ్లడ్ గ్రూప్ లు ఉన్నవారికి ముందస్తు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఓ అధ్యయనం తెలిపింది. ముఖ్యంగా 'A' బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి అకాల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది.
వీరికే ఎందుకంటే
60 ఏళ్ల వయస్సు లోపు ఉన్న వ్యక్తులలో A బ్లడ్ గ్రూప్ ఉన్నవారిలో రక్తం త్వరగా గడ్డకట్టే అవకాశం ఎక్కువగా ఉందని, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం వీరిలో 16% ఎక్కువగా ఉంటుందని అధ్యయనంలో తేలింది. 2022లో జరిగిన ఈ పరిశోధనలో భాగంగా 18-59 సంవత్సరాల మధ్య వయస్సు గల 6 లక్షల మంది వ్యక్తుల డేటాతో పాటుగా 17,000 మంది బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్ల జన్యు డేటాను కూడా పరిశీలించిన రీసెర్చర్లు.. "O1" బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి స్ట్రోక్ వచ్చే ప్రమాదం 12% తక్కువగా ఉంటదని తెలిపారు. ప్లేట్‌లెట్స్, రక్తనాళాల నిర్మాణం, ప్రొటీన్ల ప్రభావం వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం పెరుగుతుంది. రక్తం గడ్డకట్టడం వల్ల మెదడుకు రక్త ప్రవాహం తగ్గడం వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని అధ్యయనం తెలిపింది. అయితే 60 ఏళ్ల తర్వాత ఈ ప్రమాదం తగ్గుతుందట.

లైఫ్ స్టైయిల్ మారాల్సిందే
'A' బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు ఎక్కువ కార్టిసాల్ ను ఉత్పత్తి చేస్తారు. దీనిని ఒత్తిడి హార్మోన్ అని కూడా అంటారు. దీనివల్ల ఒత్తిడి పెరిగి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి A బ్లడ్ గ్రూప్ ఉన్నవారు తమ ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి. అకాల బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడానికి.. ఆహారపు అలవాట్లను మార్చుకోవడం, ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ తప్పనిసరి.
బ్లడ్ గ్రూప్ లు ఎన్ని రకాలు?
బ్లడ్ గ్రూపు రకాల్లో ప్రధానంగా 4 బ్లడ్ గ్రూపులు ఉన్నాయి. అందులో A, B, AB, O.. మీలో బ్లడ్ గ్రూపు అనేది జన్యువుల ఆధారంగా గుర్తిస్తారు. అంటే మీకు వారసత్వంగా మీ తల్లిదండ్రుల నుంచి సంక్రమిస్తుంది. ప్రతి గ్రూపులోనూ RhD పాజిటివ్ లేదా RhD నెగటీవ్ అని రెండు ఉంటాయి. ఇలా మొత్తంగా 8 రకాల బ్లడ్ గ్రూపులు (O+, O-, A+, A-, B+, B-, AB+, AB-) ఉంటాయి. సాధారణంగా చాలామందిలో బ్లడ్ గ్రూపులు ఒకేరకంగా వేర్వేరుగానూ ఉంటాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











