Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
గుండ్రటి సొరకాయ Vs పొడవాటి సొరకాయ..మీకెవ్వరికీ తెలియని నిజం ఇదే
సొరకాయ తినడం వల్ల మన ఆరోగ్యానికి బోలెడు మేలు చేస్తుందని మనకు తెలిసిన విషయమే. అయితే సొరకాయను చూస్తేనే కొందరు మొఖం తిప్పేసుకుంటారు. ఇంట్లో సొరకాయ కూర వండితే ఆ రోజు పస్తు అయినా ఉంటారు కానీ ఆ కూరను మాత్రం తినరు. సొరకాయను తెలంగాణా ప్రాంతంలో అనపకాయ అంటారు. వేదకాలం నుంచి మన దేశంలో సొరకాయను సాగు చేస్తున్నారు. మానవజాతికి ఏనాడో పరిచయమైన అతి ప్రాచీనమైన కూరగాయ సొరకాయ. సొరకాయ పుట్టింది ఆఫ్రికాలో అని చెప్పినప్పటికీ క్రీస్తు పూర్వం 11 వేల నుంచి 13 వేల సంవత్సరంలో పెరులో సొరకాయ సాగు జరిగిందని పురాతన శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎండిన సొరకాయపై తొడుగును సొరకాయ బుర్ర అని అంటారు. దీనిలో నీరు పోసుకుని పొలాలకు తీసుకునిపోయేవారు.
ఇదిలాఉంటే,సొరకాయను సాధారణంగా రెండు ఆకారాల్లో మనకు చూస్తుంటాం. మనం మార్కెట్ కి వెళ్లినప్పుడు లేదా కూరగాయలు అమ్మేటోళ్ల దగ్గరకు వెళ్లినప్పుడు అక్కడ గుండ్రంగా ఉన్న సొరకాయలు,పొడవుగా ఉండే సొరకాయలు మనకు కనబడుతుంటాయి. అయితే చాలామంది ఈ రెండింటిలో ఏ సొరకాయ కొనాలి అని కన్ఫ్యూజ్ అవుతుంటారు. వీటి మధ్య టేస్ట్ లో, పోషకాలలో ఏమైనా తేడా ఉందా వంటి అనేక ఆలోచనలు వస్తుంటాయి. అసలు ఏ సొరకాయ మన శరీరానికి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటదో ఇక్కడ చూడండి.

తేడా ఇదే
గుండ్రటి సొరకాయని దేశవాళీ సొరకాయ అని పిలుస్తుంటారు. వ్యవసాయ పరిభాషలో నరేంద్ర మాధురి వంటి పేర్లతో గుర్తిస్తారు. దీంతో వండిన కూర మెత్తగా, నోట్లో ఇట్టే కరిగిపోయేలా ఉంటుంది. భోజనంలోకి రుచికరమైన కూర చేసుకోవాలంటే గుండ్రటి సొరకాయ బెస్ట్ ఆప్షన్. ఇది త్వరగా ఉడకడమే కాకుండా, కూర రుచిని రెట్టింపు చేస్తుంది.
పొడవాటి సొరకాయ
పొడవాటి సొరకాయలు ఎక్కువగా హైబ్రిడ్ రకాలుగా లభిస్తాయి. వీటిని శివానీ మాధురి వంటి పేర్లతో పిలుస్తారు. గుండ్రటి సొరకాయతో పోలిస్తే దీని రుచి కొంచెం చప్పగా ఉండే అవకాశం ఉంటది. కొన్నిసార్లు అధిక దిగుబడి కోసం వాడే పద్ధతుల వల్ల వీటి సహజమైన రుచి తగ్గుతుంది. ఇది కాస్త గట్టిగా ఉండటం వలన ఉడకడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. ఇందులో నీటిశాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే దీనిని ఎక్కువగా జ్యూస్ లేదా సూప్ ల తయారీకి వాడతారు. శరీరానికి తక్షణ శక్తిని, తాజాదనాన్ని ఇవ్వడంలో పొడవాటి సొరకాయ రసం అద్భుతంగా పనిచేస్తుంది.
తాజా, లేత సొరకాయను ఎంచుకోవడానికి ఈ చిన్న చిట్కాలు పాటించండి
తొడిమను గమనించండి: సొరకాయ తొడిమ పచ్చగా,ఫ్రెష్ గా ఉండాలి. తొడిమ ఎండిపోయి లేదా నల్లగా ఉంటే అది పాతదని అర్థం.
పైతొక్కను పరీక్షించండి: పైచర్మం నున్నగా, మచ్చలు లేకుండా ఉండాలి. మీ వేలిగోరుతో నెమ్మదిగా గిచ్చి చూడండి. గోరు సులభంగా లోపలికి దిగితే అది లేత సొరకాయ అని అర్థం.
బరువు, గట్టిదనం: సొరకాయ బండరాయిలా గట్టిగా ఉండకూడదు. అలా ఉంటే అది ముదిరిపోయిందని, ఉడకదని, రుచి కూడా బాగోదని అర్థం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications