Latest Updates
-
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్‌గా ఉండొచ్చు!
ముక్కు కారుతోందా? జలుబు, ముక్కు దిబ్బడను తరిమికొట్టే వంటింటి చిట్కాలు
చలికాలం వస్తే చాలు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు కొన్ని అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. టెంపరేచర్స్ పడిపోవడం వల్ల గాలిలో తేమ తగ్గి, వైరల్ ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. ముఖ్యంగా జలుబు, ఫ్లూ.. ఈ సీజన్ లో చాలా మందిని తీవ్రంగా ఇబ్బంది పెట్టే సమస్యలు.
ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువగా ఉంటదో వారు వాతావరణ మార్పుల కారణంగా త్వరగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. చలి వాతావరణం, అలర్జీలు, సైనస్ ఇన్ఫెక్షన్ల కారణంగా ముక్కు కారడం, ముక్కు దిబ్బడ వంటి సమస్యలు స్టార్ట్ అవుతాయి. ఇలాంటి సమయాల్లో మన వంటింట్లో దొరికే సహజసిద్ధమైన పదార్థాలతో తక్షణ ఉపశమనం పొందవచ్చు. ఆ చిట్కాలు ఏంటో ఇక్కడ చూడండి.

వేడి నీటి ఆవిరి
జలుబు చేసి ముక్కు కారుతున్నప్పుడు లేదా ముక్కు బిగుసుకుపోయినప్పుడు ఆవిరి పట్టడం అనేది అత్యంత ప్రభావవంతమైన మార్గం. ఇది శ్వాసనాళాల్లో అడ్డుపడ్డ కఫాన్ని కరిగించి, ఊపిరి తేలిగ్గా ఆడేలా చేస్తుంది.
ఒక పెద్ద గిన్నెలో బాగా మరిగించిన నీటిని తీసుకోండి. అందులో కొన్ని చుక్కల యూకలిప్టస్ ఆయిల్ లేదా పిప్పరమింట్ ఆయిల్ వేయండి. ఇప్పుడు మీ తల మీద ఒక మందపాటి టవల్ కప్పుకొని, ఆవిరి బయటకు పోకుండా గిన్నెపై వంగి సుమారు 5-10 నిమిషాల పాటు ఆవిరిని పీల్చుకోండి. ఇది వెంటనే మీకు ఉపశమనాన్ని ఇస్తుంది.
ఉప్పు నీటితో పుక్కిలించడం
గొంతు నొప్పి, గొంతు గరగర,ముక్కు దిబ్బడకు ఉప్పు నీరు ఒక దివ్య ఔషధం. ఇది గొంతులోని బ్యాక్టీరియాను చంపడమే కాకుండా, వాపును తగ్గిస్తుంది.
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ ఉప్పు కలపండి. ఈ నీటిని గొంతులో పోసుకుని పుక్కిలించి ఊయండి. రోజుకు 2-3 సార్లు ఇలా చేయడం వల్ల గణనీయమైన ఉపశమనం లభిస్తుంది.
అల్లం,తేనె టీ
అల్లం గొప్ప యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడుతుంది.
ఒక చిన్న అల్లం ముక్కను దంచి నీటిలో బాగా మరిగించండి. ఆ నీటిని వడకట్టి దానికి ఒక టీస్పూన్ తేనెను కలపండి. ఈ టీని గోరువెచ్చగా తాగడం వల్ల గొంతుకు ఉపశమనం కలగడమే కాకుండా, శరీరం లోపలి నుండి వేడెక్కి ఇన్ఫెక్షన్లను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతుంది.
పసుపు పాలు
పసుపులో ఉండే కర్కుమిన్ అనే అద్భుతమైన సమ్మేళనం ఇన్ఫెక్షన్లను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో అర టీస్పూన్ పసుపు, చిటికెడు మిరియాల పొడి కలిపి త్రాగాలి. ఇది జలుబు, ముక్కు కారడం తగ్గించడమే కాకుండా మంచి నిద్రకు కూడా సహకరిస్తుంది.
వెల్లుల్లి
వెల్లుల్లిని సహజ యాంటీ బయోటిక్ గా పిలుస్తారు. ఇందులో ఉండే అల్లిసిన్ అనే పదార్థం రోగనిరోధక శక్తిని అమాంతం పెంచుతుంది. జలుబు, ముక్కు కారడం వంటి లక్షణాల నుండి ఇది త్వరగా బయటపడేస్తుంది.
మీరు ఆహారంలో వెల్లుల్లిని ఎక్కువగా చేర్చుకోవడం లేదా ఉదయాన్నే ఒక వెల్లుల్లి రెబ్బను తినడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











