Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ప్రెగ్నెన్సీలో కుంకుమపువ్వు పాలు తాగితే బిడ్డ తెల్లగా పుడతారా? డాక్టర్ చెప్పిన నిజం!
మన దేశంలో ఒక మహిళ ప్రెగ్నెంట్ అయిన తర్వాత నిమిషం నుంచే ఆమెకు ఇంట్లో వాళ్లు, బంధువులు, ఫ్రెండ్స్ అనేక రకాలు సలహాలు, సూచనలు చేస్తుంటారు. అలా చెయ్యి, ఇలా చెయ్యకు అని అనేకం చెబుతుంటారు. ముఖ్యంగా తినే ఆహారం విషయంలో రకరకాల సూచనలు అందుతుంటాయి.
అందులో తరతరాలుగా బలంగా వినిపించే మాట..రోజూ పాలల్లో కుంకుమపువ్వు కలుపుకుని తాగు పుట్టబోయే బిడ్డ తెల్లగా,అందంగా పుడుతుంది అని. అయితే అసలు ఇది నిజమేనా? ఈ విషయంలో అసలు వాస్తవాలేంటో, వైద్య శాస్త్రం ఏం చెబుతుందో ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ పూజా శ్రీ..లేమాన్ డాక్టర్ అనే ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో తెలిపారు.

రంగును నిర్ణయించేది కుంకుమపువ్వు కాదు.. జన్యువులు!
డాక్టర్ పూజా ప్రకారం..ఒక శిశువు స్కిన్ కలర్, కళ్ల రంగు లేదా ముఖ కవళికలు అనేవి తల్లిదండ్రుల నుంచి వచ్చే జన్యువుల (Genetics) మీద ఆధారపడి ఉంటాయి. గర్భం దాల్చిన క్షణంలోనే పిండం DNA ద్వారా ఈ లక్షణాలు స్థిరపడతాయి. పాలను బట్టి,కుంకుమ పువ్వుని బట్టి లేదా ఇతర ఆహారాలను బట్టి మారవు.
మీరు గర్భధారణ సమయంలో ఎంత కుంకుమపువ్వు తీసుకున్నా, అది శిశువు శరీరంలోని మెలనిన్ స్థాయిని మార్చలేదు. వైద్యపరంగా చూస్తే ఏ ఆహారం లేదా పానీయం కూడా పుట్టబోయే బిడ్డ సహజ చర్మ రంగును మార్చే శక్తిని కలిగి ఉండవు.
కుంకుమపువ్వు వల్ల కలిగే అసలు ప్రయోజనాలేంటి?
అయితే కుంకుమపువ్వు వాడటం వల్ల బిడ్డ రంగు మారకపోయినా, తల్లి ఆరోగ్యానికి కొన్ని ఇతర ప్రయోజనాలు ఉన్నాయి.
ఒత్తిడి నివారిణి: గర్భధారణ సమయంలో కలిగే మానసిక ఆందోళనను, మూడ్ స్వింగ్స్ తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.
జీర్ణక్రియ: ఇది జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది.
నిద్ర: రాత్రిపూట ఒక గ్లాసు గోరువెచ్చని పాలతో కుంకుమపువ్వు తీసుకోవడం వల్ల ప్రశాంతమైన నిద్ర పడుతుంది.
కుంకుమపువ్వును అతిగా తీసుకోకూడదు. రోజుకు 2-3 రేకల కంటే ఎక్కువ వాడటం వల్ల గర్భాశయ సంకోచాలు కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి డాక్టర్ సలహా తప్పనిసరి.
పాల ప్రాముఖ్యత
పాలు గర్భిణీ స్త్రీలకు ఒక అద్భుతమైన ఆహారం. ఇందులో ఉండే కాల్షియం, ప్రోటీన్లు శిశువు ఎముకల పెరుగుదలకు తోడ్పడతాయి. పాలు తాగడం వల్ల బిడ్డ తెల్లగా పుడుతుందని నమ్మడం కంటే, అది తల్లికి,బిడ్డకు అవసరమైన పోషకాలను అందిస్తుందని నమ్మడం సరైనదని డాక్టర్ పూజా చెబుతున్నారు.
మన దృక్పథం మారాలి
మనం బిడ్డ చర్మం రంగుకు ఇస్తున్న ప్రాధాన్యతను, బిడ్డ ఆరోగ్యం, మేధస్సుపై మళ్లించాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యకరమైన గర్భం అంటే సరైన పోషకాహారం, సమతుల్యమైన డైట్, క్రమం తప్పని ప్రసూతి పరీక్షలు, ఒత్తిడి లేని మనస్తత్వం అని నిపుణులు చెబుతున్నారు. రంగు అనేది కేవలం బాహ్య సౌందర్యం మాత్రమే, కానీ ఆరోగ్యం అనేది జీవితకాల సంపద.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications